ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కూర్చుని చర్చలు జరుపుకోవడం శుభ పరిణామమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కూర్చుని చర్చలు జరుపుకోవడం శుభ పరిణామమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ అన్నారు. ఇలా చర్చలు జరుపుకోవడం ద్వారా కేంద్రానికి భారం తగ్గించారన్నారు. విభజనకు సంబంధించి తలెత్తిన సమస్యలపై భవిష్యత్తులో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం సహరించుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని రాం మాధవ్ తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణలో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బలోపేతం చేయడంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం రావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.