పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామా | Barack Obama apologizes for US attack on Afghanistan hospital | Sakshi
Sakshi News home page

పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామా

Oct 8 2015 10:08 AM | Updated on Apr 4 2019 5:12 PM

పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామా - Sakshi

పొరపాటు జరిగింది.. క్షమించండి: ఒబామా

ఆఫ్ఘానిస్థాన్లో ఓ ఆస్పత్రిపై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పారు.

వాషింగ్టన్: ఆఫ్ఘానిస్థాన్లో ఓ ఆస్పత్రిపై అమెరికా దళాలు దాడిచేసిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పారు. పొరపాటున ఈ దాడి జరిగిందని, క్షమించాలని ఒబామా అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని, మిలటరీ చర్యలను పర్యవేక్షిస్తామని చెప్పారు.

ఆఫ్ఘాన్లో అమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేసిన ఘటనలో కనీసం 22 మంది మరణించారు. ఆఫ్ఘాన్లో సేవలు అందిస్తున్న 'డాక్టర్స్ వితవుట్ బోర్డర్స్' సంస్థ ప్రతినిధులతో ఒబామా ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  ఉగ్రవాదుల ఏరివేత చర్యల్లో పొరపాటున ఆస్పత్రిపై దాడి జరిగిందని ఆఫ్ఘాన్లో అమెరికా దళాల కమాండర్ ఇదివరకే వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement