వ్యూహాత్మకంగానే కొండాకు ఝలక్‌

TRS Party Strategy Behind Pending Konda Surekha MLA Ticket - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు వ్యూహాత్మకంగానే  ‘గులాబీ’ దళపతి ఝలక్‌ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మరోమారు అమెతో మాట్లాడి స్పష్టమైన హామీ తర్వాతతే  తిరిగి టికెట్‌ కేటాయించవచ్చని తెలుస్తోంది. కేసీఆర్‌ చేయించిన ఆరు సర్వేల్లోనూ  సురేఖ కు మొదటి నుంచి మంచి మార్కులే వచ్చా యి. అయితే ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ధోరణితోనే  కేసీఆర్‌.. సురేఖ టికెట్‌ను పెం డింగ్‌లో పెట్టినట్లు సమాచారం. మా కుటుంబంలో మరొకరికి  టికెట్‌ కావాలని కొండా మురళి పట్టుబడుతున్నారు.

ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వద్ద నేరుగా ప్రస్తావించకపోయినా.. భూపాలపల్లిలో సుష్మితాపటేల్‌ పేరుతో అంతర్గత ప్రచారానికి తెరలేపడం.., స్థానికంగా ప్రజా ప్రతినిధులతో వివాదాలు పెట్టుకోవడం, పార్టీ మారుతారనే సంకేతాల నేపథ్యంలో ఆమె టికెట్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. మరో వైపు రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా వరంగల్‌ తూర్పు  నియోజకవర్గానికి తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మేయర్‌ నన్నపునేని నరేందర్, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ చైర్మన్‌ ప్రదీప్‌రావు ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. వీళ్లందరినీ పక్కనబెట్టి కేసీఆర్‌.. కొండా సురేఖకే టికెట్‌ ఖరారు చేశారు.

అయితే కూతురు సుష్మితాపటేల్‌ టికె ట్‌ విషయంపై మురళి కాంగ్రెస్‌ పార్టీ నేతలతో ‘టచ్‌’లో ఉన్నారనే ప్రచారం ఉంది. దీనికి తోడు ఇటీవల గీసుకొండ మండలంలో జరిగి న ఓ నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి  కొండా మురళి  హజరాయ్యరు. ఆ సందర్భం లో కార్యకర్తలతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ‘మీ మేడం.. మీకే వస్తారు’ అనే సంకేతాలు ఇచ్చారు. ఈ రెండు అంశాలను అటు పోలీస్‌ ఇంటెలిజెన్సీ, ఇటు పార్టీ జిల్లా నాయకత్వం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top