ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యేలు | TRS Mlas travel in RTC bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యేలు

Mar 20 2018 12:38 PM | Updated on Apr 7 2019 3:24 PM

TRS Mlas travel in RTC bus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజా సమస్యల్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్ , మాధవరం కృష్ణారావు సాధారణ ప్రయాణికుల్లా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ సోమవారం బస్సుయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆయన బస్సులో ప్రయాణించి ప్రజలు ఎదుర్కోంటున్న ట్రాఫిక్‌ కష్టాల్ని తెలుసుకున్నారు.

రెండో రోజు మంగళవారం కూడా వివేక్‌ తన నియోజకవర్గంలోని బాచుపల్లి గ్రామం నుంచి ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి బయలుదేరారు. ఆ తర్వాత వివేకానందనగర్‌ బస్టాప్‌ వద్ద శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కూకట్‌ పల్లి బస్టాప్‌ వద్ద ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు బస్సు ఎక్కారు. ముగ్గురు ఎమ్మెల్యేలు బస్సుల్లో సౌకర్యాలు, సమస్యలు గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్‌ ఇండియా రేడియో బస్టాప్‌ వద్ద దిగి కాలినడకన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement