గులాబీ పండుగ | TRS membership program started in nizambad | Sakshi
Sakshi News home page

గులాబీ పండుగ

Mar 23 2015 9:01 AM | Updated on Sep 2 2017 11:16 PM

తెలంగాణ రాష్ర్ట సమితిలో సంస్థాగత సంరంభం మొదలైంది. సభ్యత్వ నమోదు సందర్భంగా గ్రామస్థాయి నుంచి అన్ని కమిటీలను రద్దు చేసిన ఆ పార్టీ నాయకత్వం కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది

తెలంగాణ రాష్ర్ట సమితిలో సంస్థాగత సంరంభం మొదలైంది. సభ్యత్వ నమోదు సందర్భంగా గ్రామస్థాయి నుంచి అన్ని కమిటీలను రద్దు చేసిన ఆ పార్టీ నాయకత్వం కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు సభ్యత్వ సేకరణ చేశాయి. 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రతి నియోకవర్గంలో ఐదు వేల క్రియాశీల, 25 వేల సాధారణ  సభ్యుల చొప్పున 2.70 లక్షలకు తగ్గకుండా సభ్యత్వాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా అది 4.52 లక్షలకు చేరింది. పోటాపోటీగా సాగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధులు సర్వశక్తులొడ్డారు. వచ్చే నెల 24న రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా, ఈలోగానే గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం కామారెడ్డిలో జిల్లాస్థా యి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పడే కమిటీలలో చోటు కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. 
 ఉత్సాహంగా సభ్యత్వ సేకరణ
 టీఆర్‌ఎస్ పార్టీ రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని కొంపల్లిలో నిర్వహించిన సమావేశం తర్వాత అన్ని కమిటీలు రద్దయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీలోగా అన్ని స్థాయిలలో కొత్త కమిటీలను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో పార్టీ అధినే త కమిటీలను రద్దు చేస్తున్నట్లు అదేరోజు ప్రకటించారు. వాస్తవానికి జిల్లాలో జనవరి 28 నుం చి సభ్య త్వ సేకరణ ప్రారంభం కావాల్సి ఉం డగా ఫిబ్రవరి నాలుగున ప్రా రంభించారు. జి ల్లాలోని తొమ్మి ది నియోజకవర్గాల లో ఒకేసారి సభ్యత్వ న మోదును ప్రారం భించగా, కొత్త కమిటీలకు ప్రాతిని ధ్యం వహించే ఉద్ధేశ్యంతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపారు. ఫిబ్రవరి 24న ముగించాలని భావించినా, వారం రోజులు పొడిగించారు. అనుకున్నట్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయితే ఈ నెల ఒకటి నుంచి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఉంటుందనుకున్నారు. అయితే, శాసనసభ సమావేశాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం కారణంగా సంస్థాగత ఎన్నికలు ఈ నెలాఖరుకు మారాయి. సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన రూప్‌సింగ్‌ను ఇదివరకే నియమిం చిన పార్టీ అధిష్టానం ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగించనుంది. ఇందుకోసం కామారెడ్డిలో జిల్లాస్థాయి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిసహా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కావాలని పార్టీ పిలుపునిచ్చింది. 
 26 నుంచి కొత్త కమిటీల ప్రక్రియ
 వచ్చే నెల 16లోగా గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఈనెల 26 నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం కామారెడ్డిలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని టీఆర్‌ఎస్ జిల్లా పరిశీల కులకు రూప్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలో ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇదిలా వుండగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం మార్చి ఒకటో తేదీ నుంచి 10 వరకు గ్రామ కమిటీల ఎన్నికలు, 11 నుంచి 20 వరకు మండల, పురపాలిక కమిటీ ల ఎన్నికలు జరిగితే, ఏప్రిల్ మొదటి వారంలో జిల్లా కమిటీతోపాటు, అనుబంధ కమిటీల ప్రక్రియ పూర్తి అవుతుందని భావించారు. తేదీలలో కొద్దిపాటి మార్పులు చో టు చేసుకోవడంతో ఈ నెల 26 నుంచి సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 2 వరకు గ్రామకమిటీలు జరుగుతాయని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించా యి. అదే విధంగా ఏప్రిల్ 6 నుంచి 12 వరకు మండల కమిటీలు, 13 నుంచి 16 వరకు జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement