
బృందావన విహారి
అచ్చమైన తెలంగాణ సంస్కృతి తళుకులీనింది.
అచ్చమైన తెలంగాణ సంస్కృతి తళుకులీనింది. బర్కత్‌పురా రాజాబహదూర్ వెంకట్రామరెడ్డి మహిళ కళాశాలలో మంగళవారం జరిగిన వార్షికోత్సవం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. విద్యార్థినులు బతుకమ్మ ఆడేశారు. బుర్ర కథలు చెప్పేశారు. కృష్ణ లీలలు చూపించారు. క్లాసికల్‌కు వెస్ట్రన్ డ్యాన్స్‌లను మిక్స్ చేసి దుమ్ము లేపారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. నాటకాలు... మిమిక్రీలు... ఫ్యాషన్ షోలతో అదరగొట్టారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి... ఈ కాలేజీలో చదువుకోవాలన్నది తనకు తీరని కోరికగానే మిగిలిపోయిందన్నారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించారు... కాచిగూడ