తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం | telangana mlc elections counting started | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

Jun 1 2015 5:09 PM | Updated on Sep 17 2018 6:08 PM

ఎమ్మెల్యేల కోటాలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల ఫలితాలు గంటలోపే వెలువడే అవకాశం ఉంది.

హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల ఫలితాలు గంటలోపే వెలువడే అవకాశం ఉంది. సభలో 119 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది ఉండగా.. వారిలో ఇద్దరు వామపక్ష సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు. మిగిలిన 118 మంది మధ్యాహ్నం 3 గంటల లోపే ఓట్లు వేసేశారు. సాయంత్రం 4 గంటలతో పోలింగ్ సమయం ముగియగా.. గం.5లకు కౌంటింగ్ చేపట్టారు. 

 

సీపీఎం, సీపీఐ సభ్యులు మాత్రం ఓటింగుకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే.. ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా,  మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement