రాష్ట్ర దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఆర్థిక వనరుల ప్రణా ళిక, కేటాయింపు, వినియోగం) చట్టం–2017 బిల్లును శుక్రవారం శాసనసభ ఆమోదించింది.
- ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం–2017కు ఆమోదం
- నిధుల వినియోగంపై అసెంబ్లీకి వార్షిక నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఆర్థిక వనరుల ప్రణా ళిక, కేటాయింపు, వినియోగం) చట్టం–2017 బిల్లును శుక్రవారం శాసనసభ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీల త్వరిత అభివృద్ధి కోసం ప్రభు త్వం ఈ చట్టాన్ని రూపొందించింది. ఆ వర్గాల కు భరోసా, ప్రోత్సాహం కల్పించడం, భవిష్య త్తులో ఆర్థిక, విద్యాపరమైన, మానవాభివృ ద్ధిలో సమానత్వ సాధన, భద్రత, సామాజిక సాధికారత, ఆత్మగౌరవం పెంపు కోసం ఈ చట్టాన్ని ఉద్దేశించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రగతి పద్దులో జనా భా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభి వృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్)కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. చట్టం పర్యవేక్షణకు సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయిలో సలహా మండలి ఏర్పాటవుతుంది. ఏడాదిలో రెండు సార్లు సమావేశమై.. విధానపరమైన అంశాలు, విధా నాల అమలుకు సలహాలిస్తుంది. శాఖల వారీ గా వార్షిక కేటాయింపులను ఆమోదిస్తుంది. ఏటా ఈ నిధి అమలు తీరుపై సభలో నివేది కను ప్రవేశపెడతారు. సలహా కమిటీని సంప్ర దించి గవర్నర్‌కు నివేదికను అందజేస్తారు.
మంత్రుల ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీలు
దళిత, గిరిజన సంక్షేమ శాఖల మంత్రుల ఆధ్వర్యంలో నోడల్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తారు. ఈ ఏజెన్సీలు ప్రతిపాదనలు రూపొం దించడం, చట్టం నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక అభివృద్ధి నిధిని విలువ కట్టడం, మదింపు చేయటం, నిధుల వినియోగం, శాఖలను సమన్వయపరిచే బాధ్యతలను నిర్వ ర్తిస్తాయి. శాఖలవారీగా నివేదికల రూపక ల్పనకు ఆదేశిస్తాయి. సమస్యలను గుర్తించి, పరిష్కారాలను సూచిస్తాయి.
ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ప్రగతి, వ్యయం, ఫలితాలను వెల్లడించే వెబ్ పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నిధుల వినియోగంలో పారదర్శకతను పాటించేందుకు ప్రతి పథకం, జిల్లా, గ్రామాలు, లబ్ధిదారుల వారీగా వివరాలను తయారు చేస్తాయి. జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు చైర్మన్లుగా పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ చట్టం అమలుకు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు.
నిధులు క్యారీ ఫార్వర్డ్
బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్‌కు కేటాయించిన నిధులు ఖర్చు చేయకుండా మిగిలిపోతే... తర్వాతి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేస్తా రు. ఈ చట్టం అమలుకు ఆర్థిక శాఖలో ఒక కార్యదర్శిని ప్రత్యేకంగా నియమి స్తారు. బడ్జెట్‌ను ఆమోదించిన వెంటనే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధి బడ్జెట్ అంచనా లతో సమకూర్చిన మొత్తానికి సంబంధిం చి ప్రతి శాఖకు బడ్జెట్ విడుదల ఉత్తర్వులు (బీఆర్‌వోలు) జారీ చేస్తారు.