మిసెస్‌ ఇండియా గ్లోబ్‌గా స్నేహారావు | Sneha Rao as Mrs India Globe | Sakshi
Sakshi News home page

మిసెస్‌ ఇండియా గ్లోబ్‌గా స్నేహారావు

Sep 9 2017 4:10 AM | Updated on Sep 17 2017 6:36 PM

మిసెస్‌ ఇండియా గ్లోబ్‌గా స్నేహారావు

మిసెస్‌ ఇండియా గ్లోబ్‌గా స్నేహారావు

మిసెస్‌ ఇండియా గ్లోబ్‌గా భానూర్‌వాసి స్నేహారావు కొట్టె గెలుపొందారు.

పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్‌: మిసెస్‌ ఇండియా గ్లోబ్‌గా భానూర్‌వాసి స్నేహారావు కొట్టె గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని బీడీఎల్‌ భానూరు టౌన్‌షిప్‌లో నివసించే స్నేహారావు ఈనెల మొదటి వారంలో ఢిల్లీలో జరిగిన ‘మిసెస్‌ ఇండియా గ్లోబ్‌ –2017’విజేతగా నిలిచారు.

తన తదుపరి లక్ష్యం చైనాలో జరిగే మిసెస్‌ ఇండియా గ్లోబ్‌–2017 పోటీలో విజయం సాధించడమేనని స్నేహారావు చెప్పారు. ఇందుకు ఇప్పటి నుంచే పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఈ పోటీల కోసం ఆమె హైదరాబాద్, ముంబైలో శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నారు. అంతర్జాతీయ వేదికపైనా విజయం సాధిస్తానని స్నేహారావు ఆత్మవిశ్వాసంతో చెప్పారు. 

Advertisement
Advertisement