
రెండోరోజూ ‘రైట్ రైట్’ షూటింగ్ సందడి
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం రెండోరోజూ ‘రైట్ రైట్’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది.
వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం రెండోరోజూ ‘రైట్ రైట్’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. వికారాబాద్ డిపోలో శనివారం చిత్రీకరించిన సన్నివేశాలకు కొనసాగింపుగా.. ఆదివారం వికారాబాద్ బస్టాండ్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో సుమంత్ అశ్విన్, మరో నటుడు బాహుబలి కాళకేయ ప్రభాకర్ క్యాంటీన్ నుంచి బయటకు వస్తూ హీరోయిన్లకు అడ్రస్ చెప్పే సన్నివేశాలను చిత్రీకరించారు. కో-డెరైక్టర్ మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా.. బాహుబలి కాళకేయ ప్రభాకర్ ప్రధానపాత్రను పోషిస్తున్నారు.
- వికారాబాద్ రూరల్