
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పదోన్నతులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏళ్ల నుంచి పదోన్నతులు కోసం నిరీక్షిస్తున్న అధికారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 31 మంది అదనపు ఎస్పీలకు నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నత కల్పించి పోస్టింగ్స్ ఇచ్చింది. అలాగే 101 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్స్ కల్పించింది. డీసీపీలుగా పని చేస్తున్న అదనపు ఎస్పీలను నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించి అదేచోట పోస్టింగ్ ఇచ్చారు. పలువురిని మాత్రం వివిధ విభాగాలకు బదిలీ చేశారు. బుధవారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.