
ఓయూ భూములు ఎవడబ్బ సొత్తుకాదు
ఉస్మానియా భూములు ఎవడబ్బసొత్తు కాదు, ఎవరూ తీసుకోరు అని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఉస్మానియా భూములు ఎవడబ్బ సొత్తు కాదని, ఎవరూ తీసుకోరని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ మాటలపై విద్యార్థులు దిష్టి బొమ్మలు తగలబెట్టడం సరికాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందరం కలిసి ఉస్మానియా భూములు కాపాడుకుందామని, తామంటే గిట్టని రాజకీయ పక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని నాయిని మండిపడ్డారు.