కోదండరాంకు దొరకని కేసీఆర్ అపాయింట్‌మెంట్ | kodandram does not get kcr appoionment | Sakshi
Sakshi News home page

కోదండరాంకు దొరకని కేసీఆర్ అపాయింట్‌మెంట్

May 23 2014 1:49 AM | Updated on Jul 29 2019 2:51 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును అభినందించడానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఐదురోజుల కిందటే సమయం కోరినా ఆయనకు ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని సమాచారం.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును అభినందించడానికి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఐదురోజుల కిందటే సమయం కోరినా ఆయనకు ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని సమాచారం. తాను అపాయింట్‌మెంటు కోరిన విషయాన్ని రెండు రోజుల కిందట కూడా కేసీఆర్ వ్యక్తిగత సిబ్బందికి కోదండరాం గుర్తుచేశారని, అయినా ఇప్పటికీ కోదండరాంకు అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదని తెలిసింది.

 

కాగా, కోదండరాంతో పాటు మరికొందరు జేఏసీ నేతలను కలవడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement