గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ | KCR meeting with the governor | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

Mar 5 2015 4:11 AM | Updated on Aug 15 2018 9:27 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈనెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రధానంగా బడ్జెట్ సమర్పణ, హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై వీరు చర్చించారు. సీఎం వెంట న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లారు. హైకోర్టు విభజన చేయకుండా..న్యాయశాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టడంవల్ల తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని.. అందుకే సత్వరమే హైకోర్టు విభజన చేపట్టాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి, గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో గవర్నర్ ప్రసంగంతో పాటు ఇతర ముఖ్యాంశాలను చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement