టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి  | Guntakandla Jagadish Reddy Election Campaign in Suryapet District | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి 

Apr 3 2019 2:54 PM | Updated on Apr 3 2019 2:54 PM

Guntakandla Jagadish Reddy Election Campaign in Suryapet District - Sakshi

మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి 

సాక్షి, సూర్యాపేట: కేసీఆర్‌ను మరింతగా బలపర్చాంటే టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ అభ్యర్థులందరినీ గెలిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 30,33వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు అంగిరేకుల రాజశ్రీ, ఝాన్సీలక్ష్మిలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు రాజశ్రీ, ఝాన్సీలక్ష్మిలకు పార్టీకండువాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానం పలికారు.

వారితో పాటు వారి అనుచరులు పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావడానికి కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నేతలకు స్వాగతం పలుకుతున్నామన్నారు. రాబోయే తొమ్మిది రోజులు ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేసి పార్లమెంట్‌ అభ్యర్థులనుగెలిపించేందుకు కృషి చేయాలన్నారు. సేవా గుణం ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. వేమిరెడ్డిని గెలిపించుకుంటే ప్రభుత్వ నిధులతో పాటు, సొంత నిధులు ద్వారా అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమన్నారు. దేశంలో నిరుద్యోగం, కరువు పరిస్థితులు ఉన్నాయంటే దానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమని తెలిపారు.

దేశంలోనూ ప్రజల కష్టాలను మాత్రమే ఎజెండాగా తీసుకుని కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి రవీందర్‌రావు, రాష్ట్రకార్యదర్శి వైవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  గండూరి ప్రవళిక, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, అంగిరేకుల నాగార్జున, జుట్టుకొండ సత్యనారాయణ, పెద్దిరెడ్డి రాజా, బత్తుల రమేష్, ఉప్పల ఆనంద్, శనగాని రాంబాబుగౌడ్, రమాకిరణ్, రఫి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement