ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయం | Goal is welfare everybody : Joint Collector Preeti Meena | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయం

Aug 7 2014 2:01 AM | Updated on Sep 2 2017 11:28 AM

ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయం

ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయం

జిల్లాలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతానని నూతన జేసీ ప్రీతి మీనా అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..

 రాంగనర్ :జిల్లాలోని ప్రతి ఒక్కరి సంక్షేమానికి పాటుపడుతానని నూతన జేసీ ప్రీతి మీనా అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా దృష్టి సారిస్తానని తెలిపారు. పథకాలు  క్షేత్ర స్థాయిలో అమలు కావాలంటే ప్రజలందరి సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దళితులకు మూడు ఎకరాలు భూ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాపై తనకు పూర్తి స్థాయి అవగాహన లేనప్పటికీ ప్రతి ఒక్కరి సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. అదే విధంగా రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు అందేలా చూస్తానన్నారు.   
 
 జేసీకి ఉద్యోగ సంఘాల నేతల అభినందనలు
 జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రీతి మీనాకు ఏజేసీతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నేత లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. జేసీకి అభినందనలు తెలి పిన వారిలో టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి, తెలంగాణ వీఆర్‌ఓల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ చాంద్‌పాషా, డీఎస్‌ఓ నాగేశ్వర్‌రావు, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ప్రద్యుమ్న, శ్రీధర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు.
 

Advertisement

పోల్

Advertisement