పని చేసే నాయకుడికే పట్టం కట్టండి | Give power To Good Leader In Election | Sakshi
Sakshi News home page

పని చేసే నాయకుడికే పట్టం కట్టండి

Nov 13 2018 6:39 PM | Updated on Nov 13 2018 6:41 PM

Give power To Good Leader In Election - Sakshi

సాక్షి,బాన్సువాడ: టీఆర్‌ఎస్‌ బీఫారం తీసుకొని బాన్సువాడకు వచ్చిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆయన సతీమణి పుష్పమ్మ మంగళహారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లోనూ విజయం మీదేనని ఇంట్లోకి ఆహ్వానించారు. 


సాక్షి, బాన్సువాడ రూరల్‌: పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి పని చేసే నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఓటేసి పట్టం కట్టాలని దేశాయిపేట్‌ సొసైటీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన హన్మాజిపేట్‌ గ్రామంలో తన తండ్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలని తన కన్న బిడ్డలతో సమానంగా చూసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్న నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నాయకులు అంజిరెడ్డి, ఏజాస్, గంగాధర్, సంగ్రాం, సాయాగౌడ్, బోనాల సాయిలు, సుధాకర్‌రెడ్డి, సాయిరాం, సుుధాకర్, బోనాల సాయిలు, బాల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రచారంలోభాగంగా చాయ్‌ పోస్తున్న పోచారం భాస్కర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement