అప్పుల భారం మరో రైతు ఉసురు తీసింది.
అప్పుల భారం మరో రైతు ఉసురు తీసింది. మెదక్ జిల్లా టేక్‌మాల్ మండలం బర్దిపూర్‌లో మూడ నరసింహులు (38) అప్పుల భారంతో మనస్తాపం చెంది.. మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మృతి చెందాడు.