విద్యుదాఘాతంతో రైతు మృతి | electric shock kills farmer in karimnagar | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jun 27 2015 11:25 AM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

కరీంనగర్: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి(43) బావి వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement