మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వాడుతున్న పదజాలం అహంకారంతో, అధికార గర్వంతో ఉందని కాంగ్రెస్ పార్టీ విప్ ఎస్.సంపత్‌కుమార్ అన్నారు.
కేటీఆర్, కవితపై సంపత్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత వాడుతున్న పదజాలం అహంకారంతో, అధికార గర్వంతో ఉందని కాంగ్రెస్ పార్టీ విప్ ఎస్.సంపత్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిందిపోయి పీసీసీ చీఫ్ ఉత్తమ్ గడ్డం గురించి దిగజారి మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. కేటీఆర్, కవితల మాదిరిగా కళ్లు నెత్తికెక్కి మాట్లాడే రాజకీయ నాయకులను 20 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదన్నారు.
స్థాయిని తెలుసుకుని, దానికి తగినట్టు మాట్లాడితే మంచిదన్నారు. గడ్డం పెంచుకుని, దొంగ దీక్ష ద్వారా నిమ్స్ ఆస్పత్రిలో వాళ్ల తండ్రి ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై లిఖితపూర్వక అఫిడవిట్ ద్వారా ఈ నెల 8లోగా సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అసెం బ్లీపై ఉందన్నారు. కుంటి సాకులు చెప్పకుండా, నైతిక విలువలను కాపాడేలా స్పీకర్ వ్యవహరించాలన్నారు.