ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చింతల్‌ఠాణా పరిధిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మేర్గు మహేశ్(24) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.