కేసీఆర్ మాటలు బంగారం... | arikela narsareddy Criticism on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాటలు బంగారం...

Nov 10 2014 3:49 AM | Updated on Sep 29 2018 7:10 PM

కేసీఆర్ మాటలు బంగారం... - Sakshi

కేసీఆర్ మాటలు బంగారం...

తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు బంగారం లాంటివని,కార్యక్రమాలు రోల్డ్‌గోల్డ్‌గా ఉన్నాయని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా కన్వీనర్ అరికెల నర్సారెడ్డి విమర్శించారు.

* కార్యక్రమాలు రోల్డ్‌గోల్డ్
* సమైక్య సీఎంలే మేలు
* కేసీఆర్, పోచారం క్షమాపణ చెప్పాలి
* ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా కన్వీనర్ అరికెల నర్సారెడ్డి

నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు బంగారం లాం టివని,  కార్యక్రమాలు రోల్డ్‌గోల్డ్‌గా ఉన్నాయని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా కన్వీనర్ అరికెల నర్సారెడ్డి విమర్శించారు. ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతో మంది ఆత్మబలిదానాల వల్ల కేసీఆర్ సీఎం అయ్యారని అన్నారు. 1800 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే 450 మంది మాత్రమే అని మాట మార్చుతున్నారని ఆరోపించారు.  

రాష్ట్రంలో రైతులు కరెంటు, గిట్టుబాటు ధర లేక విలవిలలాడితే పట్టించుకునేవా రే లేరన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరు చనిపోలేదని మం త్రి పేర్కొనడం దారుణమన్నారు. వెంటనే శాసన సభలో సీఎం , వ్యవసాయశాఖ మంత్రి రైతుల ఆత్మహత్యలపై  క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలపై మంత్రి పోచారం మీడియా వక్రీకరిస్తోందని పేర్కొనడం విడ్డురంగా ఉందన్నారు. తెయూకు బడ్జెట్‌లో రూ. 24 కోట్లే కేటాయించడం శోచనీయమన్నారు.

సీఎం కేసీఆర్ కంటే సమైక్య సీఎంలే ఎంతో మేలు చేశారన్నారు.  వారి హయాంలో ఎక్కువ  బడ్జెట్ వచ్చిందన్నారు.  కేసీఆర్ ఎవ రి మాట వినడం లేదని మోనార్క్‌ల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్క రోజు సర్వే పెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశాడని, ప్రస్తుతం రేషన్, పింఛన్‌ల కోసం మళ్లీ దరఖాస్తులకు ఇబ్బందులపా లు చేస్తున్నారని అన్నారు.  

కేసీఆర్ ప్రపంచంలో ఎవరు చేయని పనులు చేస్తున్నారని, అవి ఏమిటంటే ఉన్న పథకాలను తగ్గించడం అన్నారు.  రాష్ట్రంలో గతంలో 34 లక్షల పింఛన్లు ఉంటే కేసీఆర్ వచ్చాక 16 లక్షల పిం ఛన్లు మాత్రమే ఉన్నాయన్నారు. 24 లక్షల పింఛన్లు తొలగించారని పేర్కొన్నారు.  తెలంగాణకు అవసరమైన క రెంటు వస్తుందని వినియోగించుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
 
కార్యకర్తలకు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్
టీడీపీ కార్యకర్తలకు ఏదైనా ప్రమా దం జరిగితే వారిని ఆదుకునేందుకు రెండు లక్షల రూపాయల ఇన్సురెన్‌‌స సౌకర్యం కల్పిస్తున్నట్లు అరికెల నర్సారెడ్డి తెలిపారు.  పార్టీ సభ్యత్వ నమోదు ఉత్సహాంగా కొనసాగుతోందన్నారు. టీడీపీ కుటుంబం గట్టిగానే ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement