
పొన్నాల లక్ష్మయ్య
నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలపై ధరల దాడి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
హైదరాబాద్: నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలపై ధరల దాడి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. మొన్న రైల్వే, నిన్న పెట్రోల్, డీజీల్ ఛార్జీలు, నేడు గ్యాస్ ధరలు పెరిగాయని వివరించారు. బీజేపీ చెప్పిన మంచిరోజులంటే ఇవేనా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ పాలనలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ నెలరోజుల పాలనలో కూడా ఇచ్చిన హామీలపై నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటించలేదని విమర్శించారు. కానీ, పార్టీ బలోపేతం కోసం ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అంశంపై ఆంటోనీ కమిటీ సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు పొన్నాల లక్ష్మయ్య, పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు ఢిల్లీలో వెళ్లనున్నారు.