వెంటాడుతున్న పాపం | 11 people charged in singitam balancing reservoir irregularities | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న పాపం

Sep 10 2014 2:33 AM | Updated on Oct 17 2018 6:06 PM

1994-96 మధ్యన రూ.500 కోట్లతో చేపట్టిన సింగితం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్...

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 1994-96 మధ్యన రూ.500 కోట్లతో చేపట్టిన సింగితం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులలో భారీగా అవకతవకలు జరిగాయని, అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎస్‌ఈ, ఇన్‌చార్జ్ డీఎస్‌ఈ డి.సుబ్బయ్య సహా 11 మంది ఇంజినీరింగ్ అధికారులపై అభియోగాలు నమోదయ్యాయి. ఇందులో తొమ్మిది మంది అధికారులు పదవీ విరమణ పొందారు.

మిగిలిన ఇద్దరిలో డి. దేవేందర్ నిజామాబాద్‌లోనే ఇన్‌చార్జి ఎన్‌టీపీఏగా,ఎస్.మాధవి సీని యర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 11 మందిపై ప్రభుత్వం తాజాగా విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా కరీంనగర్ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీరు (ప్రాజెక్ట్స్)ను నియమిం చింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శైలేం ద్రకుమార్ జోషి జీఓ నంబర్ 111 జారీ చేశారు.

 అసలు కథ ఇదీ
 నిజాంసాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టుదారులకు సాగునీరు అందించేందుకు నిజాంసాగర్ మండలం లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలని అప్ప టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1996లో రూ. 321.15 కోట్లు మంజూరు చేసింది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌తోపాటు 1.5 కిలోమీటర్ల వరద కాల్వ నిర్మాణం కోసం మరిన్ని నిధులు ఆవసరమని భా వించి నిధులను రూ.500 కోట్లకు పెంచింది. ఈ పనులను చేపట్టిన కాంట్రాక్టర్  పనులలో నిబంధనలను తుంగలో తొక్కారన్న ఆరోపణలు వచ్చాయి.

 ఈ నేపథ్యంలో బాలెన్సింగ్ రిజర్వాయర్‌తోపాటు కాల్వల నిర్మాణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశిం చారు. సుమారు 15 రోజుల పాటు పనులను తని ఖీ చేసిన విజిలెన్స్ అధికారులు అక్రమాలపై నివేది క సమర్పించారు. కాల్వల లైనింగ్ సిమెంట్ కాంక్రీ ట్ (సీసీ) పనుల్లో నిబంధనలను పూర్తిగా విస్మరిం చారని తేల్చారు. 10 ఎం.ఎం. కంకరకు బదులు 20 ఎం.ఎం. కంకరను ఉపయోగించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినా, ఈ పనులను పర్యవేక్షిం చాల్సిన పర్యవేక్షక ఇంజినీరుతోపాటు 11 మంది అసాధారణ జాప్యాన్ని ప్రదర్శించారని పేర్కొన్నా రు. రూ.80 లక్షల వరకు కాంట్రాక్టర్‌కు చెల్లింపులు నిలిపివేయాలని కూడా సూచించారు. ఇదేమీ పట్ట ని అధికారులు మొత్తం సొమ్మును చెల్లించినట్లు రికార్డులు నమోదు చేశారు.

 తాజా ఆదేశాలతో కలవరం
 20 ఏళ్ల కిందట జరిగిన అవినీతి అక్రమాలపై తా జాగా విచారణకు ఆదేశించడం ఇంజినీరింగ్ వర్గా ల్లో కలకలం రేపుతోంది. విజిలెన్స్ విచారణ బట్టబయలు చేసిన అక్రమాల బాగోతం ఇంజినీరింగ్ అధికారులు పదవీ విరమణ చేసినా వారిని వెంటాడుతూనే ఉంది. ఈ పనులు జరిగిన సమయంలో ఎస్‌ఈ, ఇన్‌ఛార్జ్ డీఎస్‌ఈలుగా డి.సుబ్బయ్య, సి. జయదేవ్, డెప్యూటీఎస్‌ఈలుగా టి.అనంతస్వామి, ఆర్.వసంతంలు, ఎన్‌టీపీఏగా ఎం.లియాఖత్ అ లీఖాన్, సూపరింటెండెంట్లుగా ఎన్.డి.ఆశీర్వాదం, జి.దీన్‌దయాల్, జి.రాజనర్సయ్య, వై.లక్ష్మీనారాయణ, ఎం.దేవేందర్, ఎస్.మాధవి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement