breaking news
-
కులగణనతో ఏ ఇబ్బంది ఉండదు, ఎవరి రిజర్వేషన్లు తొలగించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్న సీఎం.. అన్ని వర్సీటీలకు వీసీలను నియమించామని చెప్పారు. రూ. 650 కోట్లతో పాఠశాలలను బాగు చేస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం సందరర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్ధులే బాగస్వాములు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితమైన ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం భోజనం పెట్టిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తాం. నాణ్యమైన బోజనాన్ని విద్యార్థులకు అందించాలి. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. మసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల మూసివేతతో విద్యకు పేదలు దూరమయ్యారు.చదవండి: అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కుల గణన జరగాలి. కేంద్రం మెడలు వంచి కుల గణన జరిపి రిజర్వేషన్తు తీసుకొస్తాం. కుల గణనతో ఎవరి రిజర్వేషన్లు తొలగించం. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెంచడం కోసమే. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలికొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాను. కులగణను అడ్డువచ్చే ద్రోహులను సమాజంలోకి రానివ్వొద్దు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి.’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
‘నన్ను అరెస్ట్ చేస్తారా.. చేస్కోండి’: కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: నేను ఏ తప్పు చేయలే .. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చిట్‌చాట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..ఎస్పీ నారాయణ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్ని వదిలేసి బీఆర్ఎస్ శ్రేణుల్ని కొట్టారు. దీనిపై మేధావులు ఎవరు మాట్లాడలేదు. పోలీసుల తీరు సరిగా లేదు. పోలీసులు వైఫల్యం ఉంది. ఇంటిజెన్స్ వ్యవస్థ అట్టర్ ప్లాప్ అయింది. రేవంత్‌రెడ్డి సైన్యంలా పరిస్థితి తయారైంది. రైతులు,బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లు చేస్తున్నారు. నేను ఊరుకోను. రేవంత్ రెడ్డి నీ సంగతి తేలు. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తా. నేను ఏ తప్పు చేయలే.. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశా. నీ కుర్చీ కాపాడుకో. ఎన్ని రోజులు ఉంటావో. ఉత్తమ్, భట్టీ నీ కుర్చిలో కూర్చుంటారు. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీలోనే. మూసీ కోసం రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. డబ్బు దండుకోవడమే. డీపీఆర్ లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఎలా అవుతాయ్ రేవంత్. ఢిల్లీకి డబ్భులు పంపాలని ప్లాన్ చేశారు. నీ నియోజకవర్గంలో సమస్యనే పరిష్కరించలేని నువ్వు ఓ ముఖ్యమంత్రివి. నీదో కథ’ అని కేటీఆర్ చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ పేరు చెప్పలేదు.. చర్లపల్లి జైలు నుంచి పట్నం లేఖ
సాక్షి, హైదరాబాద్: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా గురించి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు. చెప్పనిది చెప్పినట్లు రాశారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చిన పోలీసులు.. దాడి వెనుక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్‌రెడ్డి అంగీకరించాడంటూ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోరుతూ వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవాలని పోలీసులు కోరారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును నరేందర్‌రెడ్డి ప్రస్తావించారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంలో కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్? -
కేటీఆర్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,సంగారెడ్డి జిల్లా: ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జహీరాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అభివృద్ధిని విస్మరించి స్నో, పౌడర్ ఖర్చులకు 50 వేల కోట్లు అప్పులు చేశారు. అధికారం పోయిన రెండో రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక బీఆర్ఎస్ శ్రేణులు కుట్ర ఉంది. కలెక్టర్‌పై దాడి చేసిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.పైసా పైసాకు కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జహీరాబాద్‌లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. -
మా తడాకా చూపిస్తాం.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్‌ను చంపాలని బీఆర్ఎస్ కుట్ర చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయనన కాపాడారన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పథకం ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ నేతలకు మా తడాకా ఏంటో చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు.మరోవైపు, బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్ -
ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తనను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ నేపథ్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో నేడు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో దీనిపై పార్టీ నేతలు చర్చించారు. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసింది. నన్ను అరెస్ట్ చేసేందుకు పలు డ్రామాలకు తెరలేపుతున్నారు. ఏదో ఒక కేసులో నన్ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. పోరాటాలు మనకేమీ కొత్త కాదు అని నేతలకు సూచించారు.మరోవైపు.. లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం. మీకు ఓటేస్తే మేలు జరుగుతుందనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా?. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు వల్లే వేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా బీఆర్ఎస్పై పెడుతున్నారన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్ఎస్ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని మండిపడ్డారు. -
కేటీఆర్.. ఏది వైఫల్యం: భట్టి సీరియస్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోయాయని అమాయకులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే, కేటీఆర్.. మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలను బలి చేయకండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ కేవలం విమర్శలనే ఎజెండా పెట్టుకుందని మండిపడ్డారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడం ప్రభుత్వ వైఫల్యమా?. ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా? లేక రుణమాఫీ ఇవ్వడమా?. ఏది ప్రభుత్వ వైఫల్యమో కేటీఆర్ చెప్పాలి. కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు పోయాయని అమాయకులను రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ మీ రాజకీయ లబ్ధి కోసం సామాన్య ప్రజలను బలిచేయకండి. పొల్యూషన్ సమస్య రాకూడదనే క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండరు. బీఆర్ఎస్ కేవలం విమర్శలు చేయడమే ఎజెండా పెట్టుకుంది.జవహర్లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలు దేశంలో సమానత్వానికి నాంది పలికాయి. పంచవర్ష ప్రణాళికలు ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి. కొంతమంది కూహనా మేధావులు ఏమీ తెలియకుండా నెహ్రూపై విమర్శలు చేస్తున్నారు. సైన్స్ అభివృద్ధికి కూడా నెహ్రూ బాటలు వేసారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: మొదటి ముద్దాయి కేటీఆర్.. శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్ -
కేటీఆర్‌కు శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: అధికారులపై దాడి అనేది హేయమైన చర్య.. ఈ కేసులో కేటీఆర్‌కు శిక్ష తప్పదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. అధికారులపై దాడి హేయమైన చర్య.. కేటీఆర్‌కు శిక్ష తప్పదు. లగచర్లలో భూమిలేని వారు కలెక్టర్‌పై దాడి చేశారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది.అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్. ఈ ఫార్ములా రేసులో డబ్బులు చేతులు మారాయి.. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలి. నిందితులను శిక్షించండి.ప్రభుత్వ ఉత్సవాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలి. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం. ఈనెల 16 నుంచి జిల్లాల పర్యటన చేస్తాను. మొదట కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తాను’ అని చెప్పారు. -
కేటీఆర్ ఇంటికి హరీష్, బీఆర్ఎస్ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఇంటికి హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అనుమానంతో కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో, నందినగర్‌లోని కేటీఆర్ నివాసం గులాబీమయం అయ్యింది. -
ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావు
Updates..ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన భుజంగరావుమధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరిన భుజంగరావుఇదివరకు భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టుఈరోజు సాయంత్రంతో ముగిసిన మద్యంతర బెయిల్ గడువుదీంతో హైకోర్టును ఆశ్రయించిన అదనపు ఎస్పీ భుజంగరావుసోమవారం సాయంత్రం వరకు మధ్యంతర బెయిలు గడువును పొడిగించిన హైకోర్టువిచారణ సోమవారానికి వాయిదాహైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతదుపరి విచారణ సోమవారానికి వాయిదాఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్య ముగిసిన విచారణఅడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడిన కాల్స్‌పైన విచారణ చేసిన పోలీసులుచినమర్ధి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే :-పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానుతనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న తో మాట్లాడనుమదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగాడువారి ఇద్దరు ఫోన్ నంబర్స్ మా అనుచరు తో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపత కి ఇచ్చానుఈ నంబర్స్ ఎందుకు ఆడిగావ్ అని తిరుపతన్నను ప్రశ్నించాను.మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని నన్ను తిరుపతన్న అడిగాడు.ప్రచారం బాగా జరుగుతుందని నేను ఫోన్లో మాట్లాడానువేముల వీరేశం అనుచరులు ఫోన్ టాప్ చేశాననేది అవాస్తవంమీడియాలో ఎక్స్పోజ్ అవ్వాలని ఉద్దేశంతో కొంతమంది నా పైన కామెంట్స్ చేస్తున్నారుఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా నేను పోలీసులకు సహకరిస్తానుఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు.తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు.పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని నేను భావిస్తున్నా.నా స్టేట్మెంట్ ను వీడియో రికార్డ్ చేశారు.ఎప్పుడు విచారణకు పిలిచిన వస్తాను. పోలీసులకు సహకరిస్తాను 👉 జూబ్లీహిల్స్ పీఎస్‌కు చిరుమర్తి లింగయ్య చేరుకున్నారు. 👉ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య విచారణకు హాజరయ్యారు. 👉జూబ్లీహిల్స్ పీఎస్‌లో మిర్యాలగూడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు. 👉ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నా పర్సనల్ పని మీద వచ్చానని చెప్పారు. అనంతరం, పీఎస్ నుంచి వెళ్లిపోయారు.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా ఓ రాజకీయ నేత విచారణకు హాజరు కావడం ఇదే ప్రథమం. 👉చిరుమర్తి లింగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నాకు నోటీసులు ఇచ్చారు. ఈనెల తొమ్మిదో తేదీన నాకు నోటీసులు అందాయి. నేడు విచారణకు హాజరవుతున్నాను. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడటానికి నేనేమీ అధికారిని కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు నాకు నోటీసులు ఇచ్చారు. విచారణ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. 👉తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పోలీసుల ద్వారా డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లింక్‌లు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఉప ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి.. పోలీసులతో డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల తరలింపులో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.👉ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు చెందిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు.. వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. అయితే, తిరుపతన్న ఫోన్ డేటా రిట్రీవ్తో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ సీడీఆర్ ఆధారంగా చేసుకునే బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.👉ఇక, అంతకుముందు.. చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే. నవంబర్11న జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే.. ఆ సమయంలో అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని పోలీసులకు తెలిపారు. నేడు (నవంబర్ 14) విచారణకు హాజరవుతాని చిరుమర్తి లింగయ్య కోరాడు. ఈమేరకు గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరు కానున్నారు. ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం! -
నన్ను అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలకు భయపడేవారు ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్.. నన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు అంటూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర?నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా?నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా?గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా?నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర?పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర!మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర?50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది?నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు! రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతాను!నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి!చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో!!’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో, అన్న కోసమో…రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి,…— KTR (@KTRBRS) November 14, 2024 -
‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును ప్రస్తావించడం కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులపై దాడిని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని, ఇందులో ఎంతటివారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో, ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అరెస్టు ప్రచారం.. కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్.. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అయితే లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలు pic.twitter.com/FYP4USvaop— Telugu Scribe (@TeluguScribe) November 13, 2024Video Credits: Telugu Scribeమాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్తీక్‌రెడ్డి తదితర నేతలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అక్కడే వేచి ఉన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నందినగర్ నివాసానికి చేరుకుని కేటీఆర్‌తో భేటీ అయ్యారు. లగచర్ల ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదని.. బలవంతంగా భూసేకరణ చేస్తుండడంతో కడుపు మండిన రైతులు తిరగబడ్డారే తప్ప మరొకటి కాదని నేతలు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలని భావిస్తున్నారు. కాగా కలెక్టర్, ఇతర అధికారులపై దాడిని పలు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. -
దాడి బీఆర్ఎస్ కుట్రే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, వారితో చర్చించడం, న్యాయ స్థానాలకు వెళ్లడం వంటి అవకాశాలుండగా, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. భట్టి బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని, అభివృద్ధి జరగొద్దనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ కోసం భూసేకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా రైతుల పక్షాన గొంతెత్తాం. అధికారులను కలిశాం. న్యాయస్థానాలకు వెళ్లాం. పత్రికల ద్వారా నిరసనను తెలియజేశాం. కానీ ఏనాడు ఇలా దాడులకు తెగబడలేదు’అని భట్టి అన్నారు. ఇలా దాడులు చేయించడం సబబేనా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుట్రపూరిత దాడుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులు అధైర్యపడకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని హితవు పలికారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు... ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అత్యంత వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేసి పరిశ్రమల అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి.. ఇక్కడికొచ్చే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంలో భాగంగానే రీజినల్ రింగ్ రోడ్– ఔటర్ రింగ్ రోడ్ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ పెద్దలతో కేటీఆర్ ఒప్పందం ఫార్ములా ఈ–రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నాడని భట్టి ఆరోపించారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిచ్చి బీజేపీకి ఓటేయాలని కేటీఆర్ పరోక్షంగా చెప్పారని ఆరోపించారు. గవర్నర్‌పై సంపూర్ణమైన విశ్వాసం ఉందని, ఫార్ములా ఈ–రేస్ కేసు విచారణకు ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారని, అధికారులపై దాడిని వారు కనీసం ఖండించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
సర్కారుపై బీజేపీ సమరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు బీజేపీ వేగంగా కార్యాచరణను రూపొందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే ఈ నెల 9, 11, 13 తేదీల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు మద్దతు ప్రకటించిన ఆ పార్టీ నేతలు, 16, 17 తేదీల్లో మూసీ ప్రాజెక్టు బాధితుల సమస్యలు తెలుసుకొనేందుకు ‘మూసీ నిద్ర’కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. దానికి కొనసాగింపుగా మరో భారీ కార్యాచరణను సిద్ధం చేశారు.రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు వారంపాటు ఈ పాదయాత్రలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నాయకత్వం వహించనుండగా, బీజేపీలోని కింది స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నేత వరకు అందరూ తప్పనిసరిగా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా: 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, ఇప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు వరుస కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే పోరాట కార్యాచరణ చేపడుతున్నది.పాదయాత్రలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే బీజేపీ నేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలకు చేరుకునే వీలును బట్టి ఐదు నుంచి ఏడురోజుల పాటు పాదయాత్రలు నిర్వహించనున్నారు. రోజుకు 15 నుంచి 17 కి.మీ. యాత్ర నియోజకవర్గాల్లో రోజుకు 15 నుంచి 17 కి.మీ. దూరం పాదయాత్ర కొనసాగేలా రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో రోజుకు అంతకంటే ఎక్కువ దూరం యాత్ర చేసే వీలుండటంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కొందరు నాయకులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేసి పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు. ప్రతిరోజు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా యాత్ర నిర్వహించాలి? నైట్ హాల్ట్ ఎక్కడ ఉండాలి? అనే అంశాలన్నింటినీ ఈ బృందాలు చూసుకొంటాయి. వచ్చే నాలుగేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజాసమస్యలపై పోరాడేందుకు పార్టీ పరంగా వివిధ రూపాల్లో చేపట్టబోయే నిరసనలు, ఆందోళ నలకు ఈ పాదయాత్ర పూర్వరంగంగా ఉపయోగ పడుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభు త్వం మొగ్గుచూపినా, చూపకపోయినా... గ్రామ, మండల స్థాయిల్లో బీజేపీ బలపడేందుకు ఈ పాదయాత్రలు దోహదపడతాయని భావిస్తున్నారు.25 ప్రాంతాల్లో మూసీ నిద్ర ఈ నెల 16 నుంచి 17వ తేదీ ఉదయం వరకు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని 25 ప్రాంతాల్లో మూసీ నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలతో కలిసి భోజనం చేసి బస చేస్తామని వెల్లడించారు. ప్రక్షాళన పేరుతో ఇళ్లను కూలి్చతే ఊరుకోబోమని హెచ్చరించారు. బుల్డోజర్లను తమపై నుంచి ఎక్కించిన తర్వాతే ప్రజల ఇళ్లను ముట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు. -
కలెక్టర్‌పై దాడిని కేటీఆర్, డీకే అరుణ సమర్థిస్తారా?: మంత్రి పొన్నం
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షాలకు ప్రతి అంశంపై నిరసన తెలిపే హక్కు ఉంటుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం(నవంబర్ 13) సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద పొన్నం మీడియాతో మాట్లాడారు.‘ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.బీజేపీ,బీఆర్ఎస్ నాయకులు అయినా చట్టం లోబడే పనిచేయాలి.ప్రతిపక్ష నేతలు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు.అధికారుల పై దాడి జరిగితే ఖందించాల్సింది పోయి..సమర్ధించినట్లు డీకే అరుణ,కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు ఉంటే సహించేది లేదు.ప్రజా స్వామ్యన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా’అని పొన్నం కోరారు.ఇదీ చదవండి: కలెక్టర్‌పై దాడి.. పట్నంకు 14 రోజుల రిమాండ్ -
రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11 నెలలుగా అరాచక పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుందని సెటైర్లు వేశారు. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేవంత్ పదవి పోవడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతామని, కొడంగల్‌లో రేవంత్ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని తెలిపారు. కొడంగల్‌లో అరెస్టు చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.జూబ్లీహిల్స్‌లోని నివాసంలో పట్నం నరేందర్ రెడ్డి తల్లి, సతీమణీలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ,మహమూద్ అలీ, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కలిసి పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారురేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. రిమాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని కేటీఆర్ తెలిపారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడని విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడని దుయ్యబట్టారు.. ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని, అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారని మండిపడ్డారు.మాపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ చెబుతున్నాడు. ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారు. కానీ ఇది ఇంటలిజెన్స్ వైఫల్యం. కేసులు ఎందుకు పెట్టారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేశారు. దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏదీ? ఉద్దేశ పూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్‌ల ఫార్మూలా మాత్రమే తెలుసు. ఈయనకు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా..? ఏ అర్హత లేకున్నా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి లగుచర్ల గ్రామం వెళ్లి గ్రామస్థూలను బెదిరిస్తున్నారు. రైతులను అరెస్టు చేసి కొట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్న పోలీసులు ఉన్నారా రేవంత్ రెడ్డికి ప్రయివేటు సైన్యంలా ఉన్నారా?. రేవంత్ రెడ్డి అల్లుడి కోసం పేదల భూములు గుంజుకుంటున్నారు. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్తాం. రాష్ట్రంలో ఉన్న ప్రజాసంఘాలు మానవ హక్కుల సంఘాలు స్పందించాలి. కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ,ఇతర పార్టీలు స్పందించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
లిక్కర్ అమ్మకాలపై రేవంత్‌రెడ్డికి ప్రేమ ఎక్కువైంది: హరీశ్‌రావు
సాక్షి,నల్గొండజిల్లా: ాన్యం సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు బుధవారం(నవంబర్ 13) పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘రైతులు రూ.1800లకు క్వింటాల్ చొప్పున ధాన్యం దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రైతుల ధాన్యం లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి. ధాన్యానికి మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశారు.కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న ధాన్యాన్ని కొనలేదు.ముఖ్యమంత్రికి మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది.మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు.25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు.తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.మహిళల పుస్తెలు తెంపుతున్నారు.రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసావ్.రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు.ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రూపాయల రైతుబంధు రైతులకు వెంటనే ఇవ్వాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి -
కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి
హైదరాబాద్, సాక్షి: వికారబాద్ ఐఏఎస్‌పై దాడి కేసీఆర్,కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని అన్నారు. -
సురేష్ మా పార్టీవాడే: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో సాగుతోంది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిర ఎమర్జెన్సీ పాలన అంటూ తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే.. పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని ఆరోపించారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలడుతున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాల వలనే లగచర్ల ఘటన జరిగింది. కొడంగల్ నుంచే సీఎం రేవంత్ రెడ్డి భరతం పడుతాం. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్. సీఎం సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్. సీఎం అల్లుడు సత్యనారాయణరెడ్డి, శరత్‌ల ఫార్మా కంపెనీలను విస్తరించటం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది.తన ఏడు ఎకరాల భూమి కోల్పోతున్న కారణంగానే సురేష్ కలెక్టర్‌ను అడిగాడు. సురేష్ అనే వ్యక్తి.. బరాబర్ బీఆర్ఎస్ నాయకుడే. నిఘా వ్యవస్థ వైఫల్యం వలనే లగచర్ల ఘటన.. కలెక్టర్ గన్ మెన్లు ఎక్కడ?. ప్రభుత్వ కుట్రకు పోలీస్ ఉన్నతాధికారుల బలికావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు సురేష్ పద్దతిగా.. మర్యాదగా చెప్తే తప్పా?. సొంత పార్టీ కార్యకర్తలతో మా నేతలు మాట్లాడితే తప్పా?. సురేష్ మమల్ని కలవటం తప్పు అయితే.. రాహుల్ గాంధీ రోజూ తిట్టే అదానీని రేవంత్ కలవటం కూడా తప్పే. హైకోర్టులో పిటిషన్లు వేసి ప్రభుత్వం జడ్జీలను కూడా తప్పుదోవ పట్టిస్తోంది. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పాలన.రేవంత్ పిచ్చి నిర్ణయాల వలనే కొడంగల్ రగులుతున్నది. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్.. మహారాష్ట్రకు మూటలు మోస్తున్నాడు. రైతుల అక్రమ అరెస్ట్‌లు జరుగుతుంటే సీఎం ఎక్కడ?. షోలాపూర్ చౌరస్తాలో నిలబడినా.. రేవంత్‌ను ఎవరూ గుర్తుపట్టరు. కనీసం ఆయన సతీమణికి కూడా సమాచారం ఇవ్వకుండా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తీవ్రవాదుల మాదిరిగా రైతులను పొలాల వెంబడి తరుముతున్నారు. ఫార్మా విలేజ్ వలన వచ్చే లాభమెంటో ముఖ్యమంత్రి చెప్పాలి. రైతులు తిరుపతి రెడ్డికి ఫోన్ చేసి అడిగితే.. తన్ని భూములు తీసుకుంటామని హెచ్చరించలేదా?. కేంద్ర పెద్దలను నేను కలవటం తప్పు అయితే.. సీఎం గవర్నర్‌ను కలవటం కూడా తప్పే. ఫార్మా సిటీని రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అనలేదా?. అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు అని.. మళ్ళీ యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెప్తుంటే.. ఐజీ దాడి జరిగిందంటున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
నరేందర్‌రెడ్డిని తొక్కేయాలని రేవంత్ కుట్ర: సబితా
హైదరాబాద్, సాక్షి: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ లగచర్లలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారులపై జరిగిన ఘటన కూడా బాధాకరం. అహంకారంగా భూమి లాక్కోవడం ఎంతవరకు సమంజసం. అహంకారంతో భూమి లాక్కుంటే ప్రతిఘటన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్?. మాజీ శాసనసభ్యుడు కాబట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు. ప్రతిసారి ఇష్యూను సీఎం రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి ఘటనలో బీఆర్ఎస్ నేతలే కాదు.. కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మూసి దగ్గర సమస్య వచ్చినప్పుడు అక్కడున్న ఇల్లు కూలగొడతామన్నారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కారం చేయకుండా ప్రతిపక్షాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్‌లో గతంలో రేవంత్ రెడ్డిని ఓడగోట్టాడు కాబట్టే రాజకీయ ప్రత్యర్థిని తొక్కేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు’’ అని అన్నారు. -
అజహరుద్దీన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు మాగంటి గోపీనాథ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక అంశం కోర్టుకు చేరింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో అజారుద్దీన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి ఆరో తేదీ వరకు రిజయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. -
పట్నం అరెస్ట్‌పై స్పందించిన కేటీఆర్.. మరో ఉద్యమం తప్పదంటూ..
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అంటూ హెచ్చరించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది.ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు.పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు తప్పవని బెదిరిస్తున్నారుప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది.రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది.ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం.పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా.వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం.తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్రకార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు…— KTR (@KTRBRS) November 13, 2024 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మా సిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా?. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా?…— Harish Rao Thanneeru (@BRSHarish) November 13, 2024 మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ..‘కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అది తప్పా?’ అని ప్రశ్నించారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ ఖండిస్తున్నాను. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల యొక్క బాధ్యత. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారింది. ప్రభుత్వం బాధ్యతని మరిచినప్పుడు ప్రతిపక్షం…— Sabitha Reddy (@BrsSabithaIndra) November 13, 2024