breaking news
-
కొండా సురేఖపై ట్రోలింగ్.. రఘునందన్ సీరియస్
మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీఆర్ఎస్కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా. .. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు... అసలు బీఆర్ఎస్కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి... నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్ హెచ్చరించారు. -
బీఆర్ఎస్కు కోమటిరెడ్డి సవాల్.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుర్చీల కొట్లాట: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుర్చీల కొట్లాట జరుగుతోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు.మంత్రి తుమ్మల మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుర్చీల కొట్లాట జరుగుతోంది. మీ కుర్చీల కొట్లాట మధ్యలోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు. బీజేపీ అధ్యక్షుడిగా ఈటల అయినా మరెవరినైనా పెట్టుకోండి అంతేకానీ మీ గురించి మాకెందుకు?. నన్న విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతాను. గత ప్రభుత్వంలో కూడా నేను ఉన్నాను. మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు అనేది నాకు తెలుసు.మూసీ ప్రక్షాళన చెయ్యడానికే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మూసీ రివర్ ఫ్రంట్ పెట్టారు కదా?. మూసీ ప్రక్షాళన చెయ్యకుండా.. మూసీ అభివృద్ధి ఎలా చేస్తా అనుకున్నారు?. బీఆర్ఎస్ నేతలకు కుర్చీ ఉంటే ఒకలా?.. కుర్చీ పోతే మరోలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడం కరెక్ట్ కాదు. మా ప్రభుత్వం మూసీ ప్రక్షాళన డీపీఆర్‌ను నేను ఇంకా చూడలేదు. దశలవారీగా మూసీ అభివృద్ధి జరుగుతుంది అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ మంచి చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదా?. 28 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసాం.. కొందరివి ఆగిపోతే హరీష్ రావు పెడబొబ్బలు పెడుతున్నారు. జగదీష్ రెడ్డి ఖబడ్దార్.. మూసీ నది పరిహావాక ప్రాంతంలో తిరిగితే బడితె పూజే. నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధులను.. మూసీ పరివాహక ప్రాంత రైతులు చెట్లకు కట్టేయండి. ప్రభుత్వం మూసీ నదిని బాగుచేస్తుంటే కేటీఆర్, హరీష్ రావులు అడ్డు పడుతున్నారు. డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.మూసీ కింద నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాల భూమి సాగుచేస్తున్నారు. కానీ, మురికి నీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ హాయాంలో మూసీ అభివృద్ధికి చేసింది ఏంటి?. బఫర్ జోన్లో ఇళ్ళు లేని వారి వీడియోలు తీసి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. హైదరాబాద్ పరిధిలో వరదలకు కబ్జాలే కారణం. కబ్జాలకు బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తోంది. హరీష్‌రావు అగ్గిపెట్టె పట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన ఎవరిని బలి తీసుకుంటాడో అని భయపడుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
బుల్డోజర్ను బొంద పెట్టండి: కేటీఆర్ పిలుపు
సాక్షి,హైదరాబాద్:పేదలు దసరా పండగ సంతోషంగా జరుపుకోలేని దుస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం(అక్టోబర్1)అంబర్‌పేట గోల్నాకలోని తులసీరాంనగర్‌లో పర్యటించిన కేటీఆర్ మూసీ కూల్చివేతల బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పది నెలలు అయ్యింది రేవంత్ రెడ్డి వచ్చి. హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా రాలేదని మీ బతుకులు ఆగం చేశాడు. పెన్షన్లు రూ.4వేలు చేస్తా అన్నాడు. ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కాగా ఇనుము కూడా రాలేదు.మూసీలో దోచుకో, ఢిల్లీలో పంచి పెట్టు అన్నట్టుగా కొత్త దుకాణం తెరిచాడు. ఇక్కడ 38 ఇళ్లకు రంగులు వేసాడట. ఏ ఇంటికి కష్టం వచ్చినా పక్కింటి వాళ్ళు అడ్డుకోవాలి. బుల్డోజర్ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూల్చాలని. పేదల ఇల్లు ఎవరికి దోచి పెట్టడానికి కూలుస్తున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం 2400 కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్ట్ రూ. 20 వేల కోట్లతో కేంద్రం చేపట్టింది. కానీ మూసి నదికి లక్షా 50 వేల కోట్లతో శుద్ధి చేస్తానన్న పేరుతో దోచుకోవడానికి రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. -
మీ మేనిఫెస్టోల్లో పెట్టలేదా?
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్‌గౌడ్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారు. మూసీపై ఒక్క గుడిసె కూడా ప్రభుత్వం తొలగించలేదని, అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అందరూ గ్లోబల్ వారి్మంగ్ గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతల మెదళ్లకు మాత్రం ఆ ఆలోచన రావడం లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుíÙతమైన నదిగా మూసీ గుర్తింపు పొందిందని, ఇలాంటి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేయడం వల్ల రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 26 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు సోషల్‌మీడియాను ఉపయోగించి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌కుమార్ విమర్శించారు. సోషల్‌మీడియా కోసం బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ అధికారులను కోరామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల చుట్టూ కాదని, చార్మినార్, మూసీలో జరగాలని అన్నారు.గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఇందులో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసినవేనని ఆరోపించారు. హైదరాబాద్‌ను బీఆర్ఎస్, బీజేపీ నేతలు కబళించారని, ఈ భూబకాసురులే తమ టార్గెట్ అని, పేద ప్రజలు కాదని స్పష్టంచేశారు. సమయం వచి్చనప్పుడు ఈ భూబకాసురుల పేర్లు బయటకు వస్తాయని, వారు వెళ్లే జైలు పేరు కూడా తెలుస్తుందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. హైడ్రాతో భయభ్రాంతులకు గురవుతున్నది బీఆర్ఎస్ నేతలే తప్ప సామాన్య ప్రజలు కాదని అన్నారు. తలో దిక్కు దోచుకున్నారు రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ మల్లన్నసాగర్ కట్టేందుకు సీఆరీ్పఎఫ్ జవాన్లతో కొట్టించి మరీ ప్రజలను ఖాళీ చేయించిందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు తలోదిక్కు దోచుకున్న విషయాన్ని గమనించిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ నేతల్లో ప్రజానాయకులు ఎవరున్నారని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు.నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటే రైతు మోసగాడు ఎవరుంటారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ చేసిన ట్రోలింగ్లతో పద్మశాలీల గుండెలు పగిలిపోతున్నాయని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్టింగ్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ నేతలు సామా రామ్మోహన్‌రెడ్డి, సంధ్యారెడ్డి, భవానీరెడ్డి, బండారి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
నిరంకుశ పాలనకు ప్రతీక బుల్డోజర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్ నిరంకుశ పాలనకు ప్రతీకగా మారిందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పౌర హక్కులను నిరంతరం ధిక్కరిస్తోందన్నారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన ఆపాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాం«దీకి హరీశ్‌రావు సోమవారం బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో అధికార దురి్వనియోగంతో దుష్టపాలన నడుస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతుందని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు.‘హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల పేరిట పేద, మధ్యతరగతి కుటుంబాలను రేవంత్ రోడ్డున పడేస్తున్నారు. ఏళ్లుగా అన్ని చట్టపరమైన పత్రాలతో నివసిస్తున్న వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ బుల్డోజర్ పాలన నడుపుతున్నారు. బుల్డోజర్ విధానం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి ప్రతిరూపంగా మారింది. అడుగడుగునా చట్టాలను తుంగలో తొక్కుతూ, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ మీ పార్టీ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోంది.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సోం, మహారాష్ట్రలో పేదలు, మధ్య తరగతి ప్రజలపై బీజేపీ బుల్డోజర్లను ప్రయోగించిన రీతిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో అదే దారిలో నడుస్తోంది. బుల్డోజర్ కూలి్చవేతలపై సుప్రీం ఆదేశాలు ఉన్నా సర్వేలు, సరైన విధానాలు అనుసరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై విరుచుకుపడుతోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన సహజ న్యాయ సూత్రాలు, చట్టాలను గౌరవించే విధంగా మీ ముఖ్యమంత్రికి సలహా ఇచ్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’అని రాహుల్‌కు రాసిన లేఖలో కోరారు. క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లుతూ వికృత రాజకీయాలకు తెరలేపిందని హరీశ్‌రావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారాన్ని ఆశ్రయిస్తోందన్నారు. తనకు గోల్కొండ కోట, చారి్మనార్లోనూ వాటాలు ఉన్నాయనే రీతిలో కాంగ్రెస్ ప్రచారం చేస్తోందన్నారు. అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. పశు వైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, 1962 అంబులెన్స్ సేవల సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదన్నారు. మూగజీవాల వద్దకు పశు వైద్య సిబ్బంది వెళ్లి తక్షణ సేవలు అందించేందుకు కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని చెప్పారు. వాహన డ్రైవర్, డాక్టర్, ఇతర సిబ్బందికి వేతనాలు అందక కుటుంబపోషణ భారంగా మారిందన్నారు. -
కొండా సురేఖా ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని చెబుతూ.. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు.‘‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరు. బీఆర్ఎస్ అయినా.. వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా’’ అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు పేర్కొన్నారు.మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. మీకు @IKondaSurekha గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత…— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2024ఇదీ చదవండి: కొండా సురేఖ కంటతడి.. సీతక్క వార్నింగ్ -
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్‌పై ఎంపీ రఘునందన్‌రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.‘‘ఇంచార్జీ మినిస్టర్‌గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు. -
నాలాపై ఉన్న జీహెచ్ఎంసీని హైడ్రా కూల్చేస్తుందా?
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ ఏదేదో చెప్పిందని.. తీరా అధికారంలోకి వచ్చాక ఇంకేదో చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. మూసీ సుందరీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని మరోసారి ఆరోపించిన ఆయన.. హైడ్రా బాధితుల తరఫున పోరాడి తీరతామని ఉద్ఘాటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారాయన.తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తోంది?. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంది. కళ్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం అని ప్రకటించింది. ఎన్నికల ముందు తెలంగాణలో చక్కర్లు కొట్టిన రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లారు.హైదరాబాద్ నగరంతో పాటు సూర్యాపేట,ఆదిలాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. పేదల ఇల్లు కూల్చి పెద్దలకు లాభం చేయమని ఏ ఇందిరమ్మ,సోనియమ్మ చెప్పింది. వరి సాగులో తెలంగాణ టాప్ గా నిలిచింది ఇది కాళేశ్వరం ఘనత కాదా?. 2016లో బీఆర్ఎస్ హయాంలో చెరువులు, బఫర్, ఎఫ్.టి.ఎల్ డ్రా చేస్తూ జీవో ఇచ్చాం. మూసీలో మేము పేదల కడుపు కొట్టకుండా బ్యూటిఫికేషన్ చేశాం. ఎస్.టి.పి లు మేము పూర్తి చేశాం. మేము నిర్మాణం చేస్తే మీరు విధ్వంసం చేస్తున్నారుమూసీ కోసం లక్షా 50 వేల కోట్లా?తెలంగాణలో లంకెబిందెలు లేవని అంటున్నారు. మరి మూసీ అభివృద్ధి ఏం ఆశించి చేస్తున్నారు?. మరోవైపు మూసీకి లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడతామని అంటున్నారు. 2,400 కిలోమీటర్ల గంగానది ప్రక్షాళనకు పెట్టిన బడ్జెట్ 40 వేల కోట్లు. సబర్మతి రివర్ ప్రాజెక్టుకు 7,000 కోట్లు ఖర్చు అయింది. యమునా రివర్ ప్రాజెక్టుకు ఖర్చు అయింది వెయ్యి కోట్లు. అలాంటిది 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ అంటున్నారు. మూసీ సుందరీకరణ కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్ బ్యాంకులాగా ఉందా?. మూసీ ప్రాజెక్టుతో మురిసేది ఎంతమంది?. మూసీ సుందరీకరణతో ఒక్క ఎకరానికి అయినా నీళ్లు వస్తాయా?. ఇది స్కామ్ కాక మరి ఏం అవుతుంది.ఇల్లు అనేది పేద ప్రజల కళల సౌధం. మా నానమ్మ,అమ్మమ్మ ఊర్లు ప్రాజెక్టుల్లో మునిగిపోయాయి. 1994 లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని భాదితులు అంటున్నారు.అలాంటప్పుడు లక్షమంది ప్రజలను నిరాశ్రయులను చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు?. ఇళ్లు కూలగొడుతుంటే ప్రజలు ఊరుకుంటారా?. లక్షలాది మంది జీవితం నాశనం చేస్తున్నారు.సెక్రటేరియేట్ కూడా కూలుస్తారేమో!హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎవరి కోసం హైడ్రా తీసుకొచ్చారు?. పేదల ఇళ్లు కూల్చాలని ఎవరు చెప్పారు?. ప్రభుత్వ వైఖరితో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా ఆఫీస్‌నే కూల్చాలి. రెండోదిగా జీహెచ్ఎంసీ ఆఫీసును కూల్చాలి. నాలాపై ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసును కూలుస్తారా?. ఎఫ్.టి.ఎల్ లో సెక్రటేరియట్ ఉందని రేవంత్ రెడ్డి కూలుస్తారేమో అని అనుమానం ఉంది. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. మంత్రులు ఎందుకు మూసీ గురించి చెప్పడం లేదు. అధికారుల వెనక దాక్కుని కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణపై డి.పి.ఆర్ రెడీ కాలేదు. డి.పి.ఆర్ రెడీ కాకుండా ఇళ్ళు ఎందుకు కూలగొడుతున్నారు.చట్ట ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ కు చెప్పిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. ఇప్పటికే మా నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ వాళ్లు మూసీ బాధితుల వద్దకు వెళ్లవద్దు.బాధితులకు మేం అండగా నిలబడతాము. బాధితులకు కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్తాము. సాగరహారం లాంటి ధర్నాలు తెలంగాణలో వచ్చే విధంగా ఉన్నాయి.సావాస దోషంతోనే మంత్రి మాటలు5 వేల రూపాయలకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా పీసీసీ పదవిని అమ్ముకోవడం,సీఎం పదవిని అమ్ముకోవడం తెలంగాణ ప్రజలకు రాదు. సావాస దోషంతో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డికి లక్కీడ్రాలో ముఖ్యమంత్రి పదవి వచ్చింది. 50 కోట్లకు పీసీసీ పదవీ , 500 కోట్లకు సీఎం పదవీ నీ కాంగ్రెస్ అమ్ముకుంది. హామీలేమాయే?సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుండి వచ్చే మురికినీరు ఎక్కడికి పోతుందో రేవంత్ రెడ్డికి తెలుసా?. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇళ్ళు కుంటలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి నివాసం ఎఫ్.టి.ఎల్ లో ఉంది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నీ సోదరుడి ఇళ్ళు కూలగొట్టు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పింఛన్లు పెంచారు. తెలంగాణలో పింఛన్లు ఎందుకు పెంచలేదు. రైతులకు ఇప్పటి వరకురైతు భరోసా ఇవ్వలేదు. ముందు వంద రోజుల్లో చేస్తామని చెప్పిన హామీలు రేవంత్ రెడ్డి అమలు చేయాలి -
పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు.. హైడ్రాపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. అక్రమ నిర్మాణాల విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి అని హై కోర్టు చెప్పిందని అన్నారు. పేదల్ని ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదని తెలిపారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ఒక ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు. గత ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నాం. అనుమతులకు భిన్నంగా అక్రమ నిర్మాణాలు కట్టినవాటి విషయంలో ఆయా శాఖలు స్పందిస్తాయి.నిరుపేదలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. -
కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిజామాబాద్ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సోమవారం(సెప్టెంబర్30)ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్షలో అరవింద్ మాట్లాడారు.‘రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలు అవసరం లేదు. గజ్వేల్‌లో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారట. ఇది అధ్యయనం చేయడానికి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రైతులను పంపించాలని రేవంత్‌కు సలహా ఇస్తున్నా. కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి.కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారు. కేసీఆర్ ఎక్స్పైర్ అయిన మెడిసిన్. జాతిపిత కావాల్సిన కేసీఆర్ పిల్లల అవినీతికి పితగా మారారు’అని అరవింద్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణలు చెప్తారా..?: కేటీఆర్ -
పరువునష్టం దావాకు సిద్ధం కండి: హరీశ్‌రావు వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: తనపై తప్పుడు ఆరోపణలు, బురద జల్లే ప్రయత్నాలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసినవారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని సోమవారం(సెప్టెంబర్30) ఎక్స్(ట్విటర్)లో చేసిన ఒక పోస్టులో హెచ్చరించారు.‘ప్రజా సమస్యలపై పోరాడుతున్న నా పై బురద చల్లె వికృత రాజకీయాలకి తెరలేపినట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత ను డైవర్ట్ చేయడానికి గోబెల్స్ ప్రచారాల్ని ఆశ్రయిస్తున్నట్లున్నారు.గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా హరీశ్‌రావుకు వాటాలు ఉన్నాయి అని అంటారేమో?అబ్బద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు గాను లీగల్ నోటీస్ పంపుతున్నా.బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’అని హరీశ్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు.కాగా, ఆనంద కన్వెన్షన్ సెంటర్లో హరీశ్‌రావుకు వాటాలున్నాయని, దానిని కూల్చకుండా అడ్డుకోవడానికే పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వారిని రెచ్చగొడుతున్నారని రాజ్యసభ ఎంపీ అనిల్‌యాదవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి కౌంటర్‌గా హరీశ్‌రావు పరువునష్టం దావా పోస్టు పెట్టారు. -
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణ చెప్తారా?.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలంటూ ఎక్స్ వేదికగా మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పుడు 300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు,100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు ఇప్పుడు,300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా ? ఢిల్లీ నుండి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా ?… pic.twitter.com/eg4Z0S1Jmv— KTR (@KTRBRS) September 30, 2024 -
మూసీ ప్రక్షాళన పేరుతో అవినీతి: బండి సంజయ్
సాక్షి,కరీంనగర్జిల్లా:తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు అవినీతిమయంగా మారాయని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శించారు.సోమవారం(సెప్టెంబర్30) బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు.‘మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల అవినీతికి తెర లేపారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తోంది.పేదల ఇండ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా. బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుంది.హైడ్రా మానవత్వం కోణంలో ఆలోచించాలి.ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ అక్రమాలకు తెర లేపారు.వారసత్వ, కుటుంబ పార్టీలను బొందపెట్టే సమయం ఆసన్నమైంది.వారసత్వ రాజకీయాలకు బీజెపీ దూరం.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు’అని బండిసంజయ్ హెచ్చరించారు.ఇదీచదవండి: మూసీకి లక్షల జీవితాలు బలి -
రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి
సాక్షి, హైదరాబాద్: ‘రూ. లక్షన్నర కోట్ల మూసీ ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీఫ్ మినిస్టర్’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డిని నిందిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆదివారం సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘గుండెలు పగిలి గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆవేద నతో, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోది స్తోంది. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరా లను నిర్మించి కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నాన ని ఓ తల్లి... అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు కు ఎలా పోతామని మరో తండ్రి గుండెలు బాదు కుంటున్నారు.ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమోనని ఓ తల్లిఆత్మహత్య చేసుకుంది. భార్య కడుపుతో ఉందన్నా కనికరించరా? అని ఓ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నాసి ఇప్పుడు ఎక్కడ పన్నావ్? నాడు అలా – నేడు ఇలా.. నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావ్’అని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజమె త్తారు. ప్రజలు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని.. కోర్టులు, బీఆర్ఎస్ అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు.బావమరిదితో నోటీసు ఇప్పిస్తే..అమృత్ టెండర్ల అంశంలో తాను చేసిన ఆరో పణలపై సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బావ మరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తానని అనుకుంటున్నావా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూ స్తూ ఊరుకోము’అని వ్యాఖ్యానించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలోనే ఆయన బావమరిది శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్ట బెట్టింది నిజమన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13ని సీఎం ఉల్లంఘించారని ఆరోపించారు. శోధ గత రెండే ళ్లుగా కేవలం రూ. 2 కోట్ల లాభాన్నే ఆర్జించిన ఓ చిన్న కంపెనీ అన్నారు. ‘ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమే. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్‌గా దొరి కావు.. రాజీనామా తప్పదు’ అని పోస్ట్ చేశారు. -
ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం
బండ్లగూడ: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. హైదరా బాద్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూ సీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధి తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మాలతీనాగరాజ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ఫోన్ చేయండి.. అరగంటలో మీ ముందుంటామూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీశ్‌రావు చెప్పారు. ‘ఆపదొస్తే ఫోన్ చేయండి... అర్ధ గంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చి నా, జేసీబీలు వచ్చానా ముందు మమ్మల్ని దా టాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘బలిసినోళ్ల కు దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నావ్.. పేదల ఇళ్లను మా త్రం కూలగొడుతున్నావ్. ఇదెక్కడి న్యాయం? రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే.కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు వారి జీవితకా లం కల’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొడంగల్ లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని.. ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్‌కు రావాలని... అర్ధరా త్రి వచ్చినా బాధితులకు ఆశ్రయం ఇస్తామని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.బడి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రాధాన్యత కాదా?ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటే ప్రజలు నమ్మరని హరీశ్‌రావు పేర్కొన్నారు. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రభుత్వ ప్రాధా న్యతా లేక రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేపట్టడం ప్రాధాన్యతో సీఎం చెప్పా లన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆడ పిల్లలకు టాయి లెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నా రని.. వారి కోసం టాయిలెట్స్ కట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు.ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మందుల సరఫరా నిలిచిపోయిందని.. దీంతో రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ సీఎం మాత్రం సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సాయంతో ఫోర్త్‌సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నారని విమర్శించారు. -
అసమ్మతిపై కాంగ్రెస్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయించారు.సమర్థుల కోసం అన్వేషణపీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
అశోక్ చవాన్‌లా దొరికావు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి,హైదరాబాద్:‘బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ అక్రమ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా?’అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం(సెప్టెంబర్29) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్లాా నువ్వు దొరికావు. నీ రాజీనామా తప్పదు.బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం.సీఎం ఆధ్వర్యంలో ఉన్న శాఖలోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7,11,13ని సీఎం ఉల్లంఘించారు.శోద కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ.ఈ కుంభకోణంలో ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా,నిజాయితీగా ఉన్నది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైడ్రా కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన -
‘హైడ్రా’ కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిపశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శ్రీధర్‌బాబు ఆదివారం(సెప్టెంబర్29) మీడియాతో మాట్లాడారు.‘చెరువులు,జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోంది.మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతీ ఒక్కిరికీ ప్రత్యమ్నాయ సదుపాయం కల్పిస్తున్నాం.పేదలకు ఏ రోజూ కాంగ్రెస్ అన్యాయం చేయలేదు.చేయదు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ 2013 చట్టప్రకారం నష్టపరిహారం అందజేస్తాం. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.మూసీలో మంచి నీరు ప్రవహించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం.నందనవనం ప్రాజెక్టు చేపట్టినపుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు.కానీ మేం ఈరోజు పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నాం.పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ది బుల్డోజర్ పాలసీ. మల్లన్నసాగర్ వద్ద బుల్డోజర్లతో పేదలను ఇళ్లను కూల్చారు’అని శ్రీధర్‌బాబు విమర్శించారు.ఇదీ చదవండి: హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వం ఇప్పడికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి రాగానే హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తాం. పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బుల్డోజర్లు ముందుగా మామీద నుండి వెళ్లాలి. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్తాయి. తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తగులుతుంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. భూమి పట్టాలు, లింకు డాక్యుమెంట్స్, గ్రామా పంచాయితీ అనుమతి ఉన్న వారి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న వాళ్లంతా పేదలే. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఇప్పటికైనా హైడ్రాపై ప్రభుత్వం సమీక్ష చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక పిల్లి గంతులు వేస్తున్నారు. బ్యాంకులు 73 లక్షల మందికి రుణాలు ఇచ్చామని చెబుతున్నారు.. 48 లక్షల మందికి అని రేవంత్ రెడ్డి చెప్పారు. 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మేడ్చల్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బీజేపీ దీక్ష చేపట్టింది. అప్పులపాలై రుణమాఫీ కానీ రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి. రైతు బంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రేవంత్ వాలకం చూస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి కలిసికట్టుగా పోరాటం చేద్దాంబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. రేపు ధర్నా చౌక్‌లో రైతు దీక్ష చేపడుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నాం. రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: కూల్చివేతలపై హైడ్రా మరోసారి ఆలోచించాలి: దానం నాగేందర్ -
హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటే ప్రజల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతాను. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా?. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఏడ్చింది.. నాకు చాలా బాధగా అనిపించింది. పేదల విషయంలో హైడ్రా మరోసారి ఆలోచించాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు పది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మా కేసు బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నారు. కాస్త ఆలస్యం అయినా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పక్కా. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తిట్టిస్తున్నారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను’అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా..‘మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్షా కోట్లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: హైడ్రా రంగనాథ్ -
హైడ్రా బాధితులతో బీఆర్ఎస్ బృందం ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం ఆదివారం పర్యటించింది. బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గంధంగూడలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు.. మూసీ ప్రాంత వాసుల ధర్నాలో పాల్గొన్నారు. హడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్‌రావు, సబిత, తలసాని ముఖాముఖిగా మాట్లాడారు.తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ బృందం బయలు దేరింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమ్మద్ హాలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందంలో ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, వివేక్ గౌడ్, కాలేరు వెంకటేష్ , మాధవరం కృష్ణారావు, సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం’‘‘పేదల ఇళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రక్షణ కవచంలా నిలబడతాం. పేదల ఇళ్లు కూల్చాలంటే ముందుగా మా ఎమ్మెల్యేలపై జేసీబీ, బుల్డోజర్లు వెళ్లాలి. దేశాన్ని కాపాడే సైనికులు సైతం తమ ఇంటిని కాపాడుకోలేకపోతున్నారు. కొడంగల్‌లో సర్వే నంబర్ 1138లో ముఖ్యమంత్రి ఇల్లే చెరువులో ఉంది. ముఖ్యమంత్రికి ఒక రూల్.. ఆయన సోదరుడికి ఒక రూల్.. గరీబోళ్లకు మరొక రూలా?. హైడ్రా బలిసినోళ్ల కోసమే పని చేస్తుంది. ఇందిరాగాంధీ పేదరికాన్ని పోగడతానంటే.. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ పేదల బతుకులను కూల్చుతున్నాడు. బుల్డోజర్ రాజ్యం నడవదంటోన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’’ హరీష్‌రావు డిమాండ్ చేశారు.‘‘హస్తం గుర్తు స్థానంలో కాంగ్రెస్.. బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి. హైడ్రా పుణ్యమాని మూడు ప్రాణాలు పోయాయి. లే అవుట్స్‌కు అప్రోవల్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు బలికావాలా ?. సీఎం రేవంత్ రెడ్డి పేదల ఉసురు పోసుకుంటున్నాడు. హామీలను అమలు చేయడానికి లేని డబ్బులు.. మూసీ సుందరీకరణకు నిధులెక్కడవి?. లక్ష కోట్లు డిపాజిట్ చేశాకనే మూసీ సుందరీకరణ చేయాలి. 1908లో మూసీకి వరదలు వస్తే.. నిజాం నవాబ్ గోడ నిర్మించాడు. ప్రభుత్వం చేసే తప్పులను అసెంబ్లీ లోపల, బయట ఎత్తిచూపుతునే ఉంటాం’’ అని హరీష్‌రావు చెప్పారు. -
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే సభ్యత్వ నమోదును కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే లా కృషి చేయాలని సూచించారు. శనివారం బేగంపేటలోని ఓ హోటల్లో సభ్యత్వ నమోదుపై సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో నడ్డా సమావేశమయ్యారు. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానే పార్టీ పరిగణిస్తోందని చెప్పారు. అందువల్ల ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా పార్టీ పటిష్టానికి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల మందిని సభ్యులుగా చేర్చారని.. అక్టోబర్ 15 వరకు చేపడుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా 50 లక్షల మందికిపైగా సభ్యులను చేరి్పంచేలా కృషి చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు రావడంతోపాటు 8 ఎంపీ సీట్లు గెలిచినందున... పడిన ఓట్లలో 75 శాతం మందిని పార్టీ సభ్యులుగా చేర్పించడం పెద్ద కష్టమేమి కాకూడదన్నారు.అత్యధిక సభ్యత్వాలను చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టానికి చేపడుతున్న చర్యలను గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని చేయనందున ఈ నెల 30న పార్టీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన పేరిట దీక్ష నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించారు. ఈ సమావేశం ముగిశాక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని నడ్డా ప్రశంసించారన్నారు. నడ్డాతో భేటీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగే‹Ù, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇస్తోంది బీఆర్ఎస్. శనివారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్లో మూసీ సుందరీకరణ బాధితులతో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.ఈ భేటీలో పలువురు కూల్చివేతలతో తమకు జరుగుతున్న నష్టం గురించి కంటతడి పెట్టుకున్నారు. ‘‘కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. ఈ ప్రభుత్వంతో మీ తరఫున మేం కొట్లాడుతాం. అధైర్యపడొద్దు’’ అని బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్‌కు జ్వరం తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలవాని పార్టీ నాయకులకు, శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట కేటీఆర్ సూచించారు. గత రెండ్రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ్టి తెలంగాణ భవన్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపారాయన.Down with fever, cough and heavy cold since 36 hours. Taking Anti viral, antibiotics, anti histamine as per doctor instructions Hopefully will be better soon Meanwhile, our @BRSparty MLAs and senior leaders along with legal team will support the demolition victims who are…— KTR (@KTRBRS) September 28, 2024ఇక.. హైడ్రా బాధితుల కోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమైంది. ఆదివారం ఉదయం బాధితుల వద్దకే బీఆర్ఎస్ బృందం వెళ్లనుందని సమాచారం. ఈ బృందంలో కేటీఆర్, హరీష్‌రావుతో పాటు నగర ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు ఉండనున్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించి.. పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశంకానున్నారు.