breaking news
-
ఆ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ చీకటి ఒప్పందం: బండి సంజయ్
సాక్షి, వికారాబాద్: కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చాలా దుర్మార్గమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉందంటూ దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేశారు.. అది ఏమైంది?. మళ్లీ గణన ఎందుకు..? ఆ రిపోర్ట్ వాళ్లు బయట పెట్టలేదు. ఈ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి..?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.‘‘కుల గణన సర్వే ఫేక్. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామని గ్రహించి తప్పించుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. రూ.150 కోట్ల రూపాయలతో కుల గణన సర్వే అంటూ ప్రభుత్వం డైవర్షన్ చేస్తోంది. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు బయటపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏంటి..?’’ అని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: హైడ్రా బాస్‌తో భేటీ.. ఎవరీ ఆనంద్ మల్లిగవాడ్ -
పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన హరీష్ రావు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకుని చీఫ్ విప్ పదవి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు?.అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్నం మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛైర్మన్ దగ్గర పెండింగ్‌లో ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది. అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు..పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని’ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ సందడి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఉపాధ్యాయ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు, పట్టభద్రుల కోటాలో ఒక ఎమ్మెల్సీ ఆరేళ్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఖాళీ అయ్యే స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బరిలో నిలించేందుకు బీఆర్ఎస్ నుంచి ఔత్సాహికులు ఇప్పటి నుంచే సందడి చేస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో.. ఆశావహులు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల పేరిట జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటూ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు పేరిట ప్రచారం చేసుకుంటున్నారు. తద్వారా తాము పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సంకేతాలు పంపుతున్నారు. ఉపాధ్యాయ కోటాపై అనాసక్తి వచ్చే ఏడాది మార్చిలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి(పీఆర్టీయూ)తోపాటు ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(యూటీఎఫ్) పదవీకాలం ముగుస్తుంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను బరిలోకి దించలేదు. పీఆర్టీయూకు పరోక్షంగా మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం బీఆర్ఎస్తో పీఆర్టీయూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందరి దృష్టి పట్టభద్రుల స్థానంపైనే ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసక్తి చూపుతున్నారు. 13 జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. ఓటర్లను చేరుకునేందుకు ఇప్పటి నుంచే ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి రాజారాంయాదవ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ మద్దతుదారులను రంగంలోకి దించి ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ గతంలోనే తనకు హామీ ఇచి్చనట్టు రవీందర్ సింగ్ చెబుతున్నారు. గతంలో.. బలమున్నా బరికి దూరం మండలి పట్టభద్రుల కోటా 2019 ఎన్నికల సందర్భంలో ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్– నిజామాబాద్’నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి) మాత్రమే ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్యను కలుపుకొని 40 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.జీవన్‌రెడ్డి పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు.. కీలక నేతలందరూ ఇక్కడే ప్రస్తుతం ‘మెదక్–కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్’పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 42 మంది ఎమ్మెల్యేలకుగాను కాంగ్రెస్‌కు 19, బీఆర్ఎస్కు 16, బీజేపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), సంజయ్ (జగిత్యాల), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ) కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్ తదితరులు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉందని, పార్టీ అవకాశమిస్తే గెలుపు సాధిస్తామనే ధీమా ఆశావహుల్లో కనిపిస్తోంది. -
13 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: సభ్యత్వ నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీతో రాష్ట్రస్థాయిలో సభ్యత్వ నమోదు ముగించాల్సి ఉంది. సభ్యత్వ నమోదు టార్గెట్ 50 లక్షలు కాగా, శుక్రవారం నాటికి రాష్ట్రంలో 20 లక్షల మంది (5 లక్షల దాకా మిస్డ్‌కాల్‌తో నమోదు, అసంపూర్తి వివరాలు) పార్టీ సభ్యులుగా చేరినట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సభ్యుల్లో 15 లక్షల మంది పూర్తి వివరాలు నమోదు చేయగా, మిగతా వారికి సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాల్సి ఉన్నట్టుగా తేలింది. దీంతో దసరా పండుగ తర్వాతి మూడురోజులు ‘స్పెషల్ డ్రైవ్’పేరుతో సభ్యత్వ నమోదు ఉధృతంగా చేపట్టాలని బీజేపీ ముఖ్యనేతలు నిర్ణయించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రంలోని 36 వేల పోలింగ్ బూత్‌లలో ఒక్కోదాంట్లో కనీసం వంద మంది సభ్యులను చేరి్పంచడం ద్వారా మరో పది లక్షలకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15 తర్వాత వంద మంది సభ్యులను చేరి్పంచిన వారితో క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేస్తారు. క్రియాశీల సభ్యులుగా ఉన్నవారే పార్టీ బూత్, మండల, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 15 నాటికి ‘యాక్టివ్ మెంబర్íÙప్’పూర్తయ్యాక, ఆ తర్వాత బూత్ కమిటీల ఎన్నిక, ఆపై మండల అధ్యక్షులు, మళ్లీ వారు జిల్లా అధ్యక్షులను, ఆ తర్వాత వారంతా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల మంది ఓటు వేయగా, ఈ ఓట్లలో 75 శాతం అంటే 50 లక్షల దాకానైనా సభ్యులుగా చేర్పించేలా ప్రయతి్నంచాలని బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది. సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరుపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ సభ్యత్వ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్రపార్టీ సభ్యత్వ కార్యక్రమ కనీ్వనర్ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
దీపావళిలోపు కార్పొరేషన్ పదవులు
సాక్షి, హైదరాబాద్: దీపావళిలోపు రెండోదఫా కార్పొరేషన్ పదవులు ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. దసరాలోపు చేద్దామని అనుకున్నా హరియాణా, కశ్మీర్ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదని, ఏఐసీసీ నాయకత్వం కూడా బిజీగా ఉండడంతో మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ, టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటులోనూ జాప్యం జరిగిందన్నారు. శుక్రవారం గాం«దీభవన్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ⇒ ఎంఐఎంతో స్నేహం వేరు. శాంతిభద్రతల సమస్య వేరు. నాంపల్లి నియోజకవర్గంలో మా పార్టీ నేత ఫిరోజ్‌ఖాన్‌పై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుంటాం. విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. ⇒ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నియోజకవర్గాల్లో కొంత ఇబ్బంది అవుతోంది. అందుకే చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ వేశాం. కానీ బీఆర్ఎస్కు చెందిన చాలామంది మాతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ చేరికలు ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ⇒ సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ కావాలని మాట్లాడలేదు. కేటీఆర్ వ్యవహారశైలి కారణంగానే అలా మాట్లాడారని అనుకుంటున్నా. అయినా అలా మాట్లాడాల్సింది కాదు. నాగార్జున కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెబుతుందో చూడాలి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఈ విషయంలో అధిష్టానం మమ్మల్ని ఎలాంటి వివరణ అడగలేదు. అయినా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పారు. ఆ రోజే ఆ విషయం క్లోజ్ అయ్యింది. ⇒ పేదలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. మూసీ, హైడ్రాలు భావితరాల కోసమే చేపట్టాం. ⇒ బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది. మమ్మల్ని ఎదుర్కోవడమే ఆ రెండు పార్టీల టార్గెట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశముంది. అయినా మాకేం నష్టం లేదు. ⇒ సోషల్ మీడియాను ఉపయోగించుకొని బీఆర్ఎస్ మా మీద దు్రష్పచారం చేస్తోంది. దుబాయి నుంచి ఖాతాలు తెరిచి మరీ నడిపిస్తున్నారు. రూ. వందల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియాను దురి్వనియోగం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ⇒ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల పక్షాన మాట్లాడుతున్నారు. బీసీల పక్షాన మాట్లాడితే పార్టీ లైన్ తప్పారని అనలేం. అయితే, కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి అని మల్లన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. ⇒ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, బీజేపీ మతతత్వ పార్టీ. రెండు పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎంత దు్రష్పచారం చేసినా ప్రజలు నమ్మరు. ⇒ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు ఉన్నాయి. నెలరోజుల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతా. -
కేసీఆర్ కట్టింది గడీలు.. మేం కట్టేది బడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘గత ముఖ్యమంత్రి గడీలు, పార్టీ ఆఫీసులు కడితే.. మేము పేద పిల్లల కోసం సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాం. తెలంగాణలోని 28 నియోజకవర్గాల్లో వీటిని కడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా కుల రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యం..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 25 ఎకరాల్లో, రూ.125 కోట్ల అంచనా వ్యయంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో అత్యాధునిక హంగులతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అయినవాళ్లకు పదవులు..పేదలకు బర్రెలు‘కేసీఆర్ గత పదేళ్లలో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కానీ విద్యాలయాలకు పైసా విదల్చలేదు. పైగా ఐదు వేలకుపైగా స్కూళ్లను మూసి వేయించారు. ఒక నియోజకవర్గానికో, ఒక కులానికో గురుకులాన్ని ఏర్పాటు చేసినా వాటిలో కనీస సదుపాయాలు కల్పించలేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 40 మంది పిల్లలను కుక్కారు. చదువుకున్నోళ్లకు ఎవరైనా ఆయా రంగాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలి్పంచాలి. కానీ ఆయన మాత్రం తన కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, కూతురుకు ఎమ్మెల్సీ, మరో కొడుక్కి రాజ్యసభ పదవులు కట్టబెట్టాడు. నమ్ముకున్న పేదలకు మాత్రం గొర్రెలు, బర్రెలు, పందులు పంచి పెట్టాడు.నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను బర్రెలు, గొర్రెలు కాయడానికి పంపుతావా? పేదోడు చదువుకుంటే ఎక్కడ వారిలో చైతన్యం వస్తుందో అని, ఎక్కడ తన తప్పులను ప్రశి్నస్తారో అని భయపడి చదువుకు దూరం చేసి, వారిని బానిసలుగా చూశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ విడదీసి ఒకేచోట కలిసి మెలసి ఉండాల్సిన పిల్లల మెదడులో విషం నింపాడు. సమాజ విచ్ఛిన్నానికి కుట్రపన్నాడు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించాడు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి నిర్మాణాలు చేపట్టాడు. కానీ పేదలకు స్కూళ్లు, ఆస్పత్రులు కట్టేందుకు మాత్రం ఆయనకు మనసు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారు. అయినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదు..’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రవీణ్‌కుమార్ కూడా దొరలాగే మాట్లాడుతున్నాడు ‘ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. అణగారిన కులం నుంచి వచ్చి ఐపీఎస్ అయినందుకు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా. బీఎస్పీలో ఉంటారో? బీఆర్ఎస్లో ఉంటారో ఆయన ఇష్టం. ఆయన గురుకులాలకు కార్యదర్శిగా పని చేశారు. షాద్‌నగర్ బిడ్డలకు రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మిస్తుంటే అభినందించాల్సింది పోయి అడ్డుపడుతున్నాడు. కేసీఆర్ చెప్పిందే ఆయన మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన కూడా పేదలు బర్రెలు, గొర్రెలు, పందులు కాసుకోవాలని దొరలాగే సూచిస్తున్నాడు..’అని సీఎం ధ్వజమెత్తారు. సమీకృత స్కూళ్లకు పీవీ ఆద్యుడు ‘నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఇప్పటికే 34 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశాం. 21 వేల మందికి పదోన్నతులు కలి్పంచాం. ఇందులో అధికారుల కృషి అభినందనీయం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఆద్యుడు. ఆయన సర్వేల్, నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన స్కూళ్లలో చదువుకున్న అనేకమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ఒకప్పుడు సర్వేల్ స్కూల్లో చదువుకున్న బుర్ర వెంకటేశం ఐఏఎస్ అయ్యారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు..’అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రాంమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. విద్యార్థులందరిదీ ఒక్కటే కులం కొందుర్గు: విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలందరిదీ ఒక్కటే కులమని, అది విద్యార్థి కులమని కొందుర్గు విద్యార్థి మణికంఠ అన్నాడు. సీఎం పాల్గొన్న సభలో అతను మాట్లాడుతూ.. పేదలు, మధ్య తరగతి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, కుల, మతాలకతీతంగా విద్యార్థులందరూ ఒకేచోట చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నాడు. ‘నేను ప్రమాణం చేసి చెప్తున్నా.. ఈ విషయమై ఎప్పుడూ సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం..’అని చెప్పాడు. ఈ సందర్భంగా మణికంఠతో పాటు మరో విద్యార్థి జ్యోతిని ముఖ్యమంత్రి అభినందించారు. -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని తెలిపారు.తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో అసహనం ఏర్పడిందన్న సీఎం.. ఈ ప్రభుత్వం 34 వేల మంది టీచర్లను బదిలీ చేసి, 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు.బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు సీఎం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయలేదని విమర్శలు గుప్పించారు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతో బీఆర్ఎస్ సర్కార్ పనిచేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసిందని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశారు. 1020 రెసిడెన్సియల్ స్కూల్స్‌లో కనీస వసతులు లేవు. టీచర్లతో పెట్టుకుంటే ఏమీ చేయరు కానీ.. పోలింగ్ రోజు బూత్‌లలో చేయాల్సింది చేస్తారు. బర్రెలు, గొర్రెలు ఇవ్వాలని కేసీఆర్ చూశారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండుసున్నా వచ్చినా.. వాళ్ల బుద్ధి మారలేదని విమర్శించారు.ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
కేటీఆర్,హరీశ్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,నల్గొండజిల్లా:కేసీఅర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే కేటీఆర్,హరీష్‌రావు అనే పిల్లలు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని గందంవారి గూడెంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు కోమటిరెడ్డి శుక్రవారం(అక్టోబర్11) శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ‘నేను రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ పదో తరగతి చదువుతున్నాడు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. పదేళ్లలో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్లు అప్పు చేశాడు.రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే మాఫీ చేస్తాం. రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు. కేసీఆర్ మాటల్ని మేం నిజం చేస్తున్నాం. వైఎస్సార్ హయాంలో ఇచ్చినట్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం’అని కోమటిరెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: ఆశపెట్టి నిరుద్యోగితో ఆడుకున్నారు -
జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్‌రెడ్డి ప్రశ్న
సాక్షి,హైదరాబాద్:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్ ఇంఛార్జ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి శుక్రవారం(అక్టోబర్11) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్లో మరోరకంగా పోలరైజ్ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్‌కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది -
TG: కిషన్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం(అక్టోబర్10) తెలంగాణ బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. తన అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి రావాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారు. వివాహపత్రికను కిషన్‌రెడ్డికి అందించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు.మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే కిషన్‌రెడ్డిని కలిశానని, రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. చంద్రబాబునాయుడు రాజకీయ భిక్ష పెట్టడం వల్లే గతంలో ఎంపీ అయ్యానన్నారు. టీడీపీలో చేరుతున్నారా అన్న ప్రశ్నకు మాత్రం మల్లారెడ్డి సమాధానం దాటవేశారు.కాగా, ఇటీవలే మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి రావాల్సిందిగా ఏపీ సీం చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు. బాబును కలిసిన తర్వాత మల్లారెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే పెళ్లికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని మల్లారెడ్డి ఆ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇదీ చదవండి: మార్కెటింగ్‌లో సీఎం రేవంత్ నెంబర్‌వన్ -
ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి కూడా ప్రచారం చేసుకోకపోవడం వల్లే నష్టపోయామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో వినోద్‌కుమార్ గురువారం(అక్టోబర్10) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. మార్కెటింగ్‌లో మాత్రం ఆయనను మించినవాడు లేడు. మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన చరిత్ర నాకుంది. నాకెవవరూ ఉద్యోగం ఇవ్వలేదు. నేను స్వయంగా అడ్వకేట్‌ను. నేను తెలంగాణ వాదిని. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని రేవంత్‌రెడ్డి గతంలో చెప్పాడు. ఎన్నికల హామీ మేరకు డిసెంబర్ నాటికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం లక్షా 60వేల ఉద్యోగాలు నింపలేదని భట్టి చెప్పగలరా? ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించే బాధ్యతను ఎమ్మెల్సీ కోదండరాం తీసుకోవాలి.జేఏసీని నడిపిన అనుభవం ఉన్న కోదండరాం.. సీఎం రేవంత్‌కు ఉద్యోగాలపై సమాచారం ఇవ్వాలి. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రాజకీయ సభల మాదిరి నిర్వహిస్తున్నారు.ఉద్యోగాల నియామకం ఎలా జరుగుతుందో కూడా మంత్రులు భట్టి, పొన్నంకు తెలియదు.బీఆర్ఎస్ హాయాంలో ఒక లక్షా 61వేల 572మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కేసీఆర్ సీఎంగా ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇస్తున్నారు.కేసీఆర్ హాయాంలో నింపిన ఉద్యోగాల సమాచారం.. మంత్రులకే తెలియకపోవడం దౌర్భాగ్యం’అని వినోద్‌కుమార్ అన్నారు.కేసీఆర్ హయాంలో ‘2014 నుంచి 2023’ వరకు జరిగిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇవే..ఇదీ చదవండి: కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా -
కమీషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: ‘‘సంక్షేమ పథకాల్లో ప్రజల నుంచి కమీషన్లు రావనే ఉద్దేశంతోనే వాటి అమలును పక్కనపెట్టి మూసీ ప్రాజెక్టు పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. మూసీ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు మింగొచ్చని.. రాహుల్‌గాం«దీ, వాళ్ల బావ వాద్రాకు కోట్ల రూపాయలు దోచిపెట్టొచ్చని రేవంత్ భావిస్తున్నారు..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి విధానాలను ప్రజలు గల్లా పట్టి అడిగేంత వరకు ఈ మోసం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలావుద్దీన్ పటేల్ తన అనుచరులతో కలసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పక్కనపెట్టి.. సమస్యలు వస్తే కలెక్టర్ల వద్దకు వెళ్లాలని సీఎం అంటున్నారు. కానీ మనం తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలను నిలదీయాలి. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ తరహాలో గ్యారంటీల పేరిట మోసం చేయాలని చూసిన కాంగ్రెస్‌కు హరియాణా ఓటర్లు సరైన బుద్ధిచెప్పారు. తలవంచకుండా పోరాడాం: ప్రధాని మోదీ మమ్మల్ని బెదిరించాలని చూసి, మా చెల్లెలిని జైల్లో పెట్టారు. అయినా తలవంచకుండా మోదీతో పోరాటం చేశాం. అదే పోరాట స్ఫూర్తితో సెక్యులర్ విధానాలను కొనసాగిస్తూ మనిíÙని మనిషిగా చూసే రాజకీయాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుంది. అరచేతిలో వైకుంఠంతో అధికారంలోకి.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిoది. ఈ పది నెలల్లోనే అన్నివర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో లేరనే బాధ రాష్ట్రంలో ప్రతీ పౌరుడిలోనూ కనిపిస్తోంది. పేదల కోసం పాటుపడిన కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ అధికారంలో లేకపోవడంతో పండుగ కళ తప్పింది. బుల్డోజర్ రాజ్‌తో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్‌లో తహసీల్దార్‌పై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతోంది. రూ.2 లక్షలు రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500,వృద్ధాప్య పెన్షన్ రూ.4వేలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం వంటి హామీలు అటకెక్కాయి. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్రమంగా భూములు లాక్కుంటున్నారు.దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర చేస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడం సరికాదు. సీఎం రేవంత్ గత ప్రభుత్వమిచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. తప్పుడు లెక్కలతో నిరుద్యోగులను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం..’’అని కేటీఆర్ మండిపడ్డారు. -
తెలంగాణ ద్రోహులకు కట్టు బానిస
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ద్రోహులకు సీఎం రేవంత్‌రెడ్డి కట్టు బానిస అని..తాము తెలంగాణ ప్రజలకు బానిసలం అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు అసలు సిసలు కొరివి దెయ్యం రేవంత్ అని, ఆయన నుంచి తెలంగాణను కాపా డే కొర్రాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య లపై హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వేయి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు ఉంది రేవంత్ వైఖరి. డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టుబడిన దొంగ.. ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెప్తుండు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తుండు. ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్‌ను తిట్టేందుకు ఉప యోగిస్తుండు. రేవంత్ లాంటి ఎన్నో కొరివి దెయ్యాలను తుదముట్టించి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. 2014లో పొరపాటున నీలాంటి వారికి అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసేవారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉండటం వల్లే నువ్వు సీఎం అయ్యావు. బిల్లారంగాల గురించి విద్యార్థులకు టీచర్లు బోధించమని చెప్తున్నవా. కవిత ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధుల ఓట్లతోనే ఎన్నికైంది. ఓడిన వారికి కాంగ్రెస్‌లోనూ పదవులు ఇచ్చారు కదా’అని రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ గ్యారంటీలకు హరియాణా ఓటర్ల గొయ్యి తవి్వన రీతిలోనే తెలంగాణలోనూ బొంద తవ్వడం మొదలైంది.’అని హెచ్చరించారు. నిరుద్యోగులను మోసం చేసిన దగాకోరు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను రెచ్చగొట్టి మోసం చేసిన దగా కోరు రేవంత్. కేసీఆర్ హయాంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నేతలే. రేవంత్ మోసాలను అర్థం చేసుకున్న నిరుద్యోగులే కొరివి పెడతారు. 3 నెలల్లో 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే సాధ్యమైంది. కేసీఆర్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం’అని హరీశ్ వెల్లడించారు. -
కొండగల్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, వనపర్తి: తెలంగాణ రాజకీయాల్లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కొత్తకోట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకునే క్రమంలో పోలీసులు నరేందర్ రెడ్డి, నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎమ్మార్వో ఆఫీసు వరకు పాదయాత్ర చేయాలని బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ క్రమంలో పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ తుంకిమెట్ల వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతుల కోసం పాదయాత్ర చేస్తామని మేము ముందే పోలీసులకు చెప్పాము. ప్రశాంతమైన వాతావరణంలో పాదయాత్ర చేసుకోమని వాళ్లు పర్మిషన్ ఇచ్చారు. కొడంగల్‌లో పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు రైతులు తరలి రావడం చూసి సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు. దీంతో, మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి వనపర్తి జిల్లా కొత్తకోట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నా.. మీ సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.హైదరాబాద్‌లో ఫార్మా సిటీ కోసం మహేశ్వరంలో 14వేల ఎకరాలు సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌ను వదిలేసి కొడంగల్‌లో పచ్చని పంటలు పండే మూడు వేల ఎకరాలను ఫార్మా సిటీ కోసం ఎందుకు ఎంపిక చేశారు. మహేశ్వరంలో ఉన్న వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ కోసం ప్లాన్ చేశారా?. ఫార్మా కంపెనీలు కాకుండా కొడంగల్‌కు మంచి కంపెనీలు తీసుకురావాలి. ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టొద్దు. యువతకు ఉపాధినిచ్చే ఐటీ కంపెనీలను తీసుకొస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి వెంటనే ఫార్మా కంపెనీల భూముల విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చివరి వరకు కొడంగల్ రైతుల పక్షాన నిలబడి పోరాడుతాము’ అని చెప్పారు.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..‘రైతులకు మద్దతుగా పాదయాత్ర చేస్తుంటే ప్రభుత్వం ఓర్చుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలు కాకుండా ఏ కంపెనీలు నెలకొల్పినా మాకు అభ్యంతరం లేదు. భూములను తీసుకునేటప్పుడు ఆ గ్రామాల ప్రజలను కూర్చోబెట్టి ఒప్పించి భూములు తీసుకోవాలి. వారికి ఇష్టం లేనిదే వారి భూములు తీసుకోవడం ఎంత వరకు సమంజసం?. యువతకు ఉపయోగపడే కంపెనీలను తీసుకురావాలి. ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతోంది. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం’ అంటా హెచ్చరించారు.ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలనకొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులుఫార్మా కంపెనీ పేరుతో చేసే రియల్ ఎస్టేట్ దందాను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ఎన్ని… pic.twitter.com/cI4mGemzp2— BRS Party (@BRSparty) October 9, 2024 -
నేను బీఆర్ఎస్ చైర్మన్‌ను కాదు: గుత్తా సుఖేందర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం(అక్టోబర్9) శాసన మండలిలో చీఫ్‌విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.మహేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ విప్‌గా చూడాలా? కాంగ్రెస్ విప్‌గా చూడాలా అని మీడియా అడగ్గా మహేందర్ రెడ్డిని అఫిషియల్ విప్‌గా చూడాలని సుఖేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్ కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు.బీఆర్ఎస్పై గుత్తా ఫైర్..ఉద్యోగ నియామకాల మీద బీఆర్ఎస్ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారుఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిదిమూసీపై డీపీఆర్ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు.ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలిఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ మాట ప్రకారం పూర్తి చేస్తున్నారు.నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు.బీఆర్ఎస్ సోషల్ మీడియా వాడుకున్నా ఇంకేమైనా వాడుకున్నా పద్దతిగా ఉండాలిఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దుమూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంహైడ్రా వల్లే రిజిస్ట్రేషన్ లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు.ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది.అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ భాధ్యులే.. ఇదీ చదవండి: ఇంకా మీపై చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్ -
మీపై ఇంకా చర్చ ఎందుకు: కేటీఆర్‌కు పొన్నం కౌంటర్
సాక్షి,హైదరాబాద్:రాహుల్ గాంధీపై సెటైర్స్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.పదేండ్లలో కేసీఆర్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం(అక్టోబర్9) ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘మేం చిత్తశుద్ధితో ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం.విద్యార్థులు, నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారు.విదేశీ విద్యానిధి గత ప్రభుత్వంలో 150 మందికి ఇచ్చారు.మేం 500 మందికి ఇవ్వబోతున్నాం.అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కర్రుకాల్చి వాత పెట్టినా బుద్ధి రావడం లేదు.ప్రజలు ఓడించాక ఇంకా పదేళ్ల పాలన పై చర్చ ఎందుకు’అని పొన్నం అన్నారు. కాగా, యువతకు 2 లక్షల ఉద్యోగాలిచ్చిన రాహుల్‌గాంధీకి హైదరాబాద్ అశోక్‌నగర్‌కు స్వాగతమని ఎక్స్‌లో కేటీఆర్ చేసిన పోస్టుకు పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇదీ చదవండి: రాజకీయ లబ్ధి కోసం మా పరువు తీశారు -
తెలంగాణలో వైఫల్యంతోనే హరియాణాలో కాంగ్రెస్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ‘‘కర్ణాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిట డొల్ల హామీలతో ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్.. హరియాణాలోనూ ఏడు గ్యారంటీల పేరిట మభ్యపెట్టాలని చూసింది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లలో గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి హరియాణాలో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించడమే నిదర్శనం..’’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గ్యారంటీలు ప్రకటిస్తూ వచ్చిన కాంగ్రెస్.. చివరికి బొక్క బోర్లా పడిందని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు చిత్తు కాగితంలా మారాయని, అలవి కాని హామీలతో గద్దెనెక్కాలని భావించిన కాంగ్రె స్కు జనం కర్రు కాల్చి వాత పెట్టారని పేర్కొ న్నారు.తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రజల కు కాంగ్రెస్ గ్యారంటీల డొల్లతనం పూర్తిగా అర్థమైందని.. రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలన వైఫల్యాలే హరియాణాలో ఓటమికి దారితీశాయని విమ ర్శించారు. సోషల్ మీడియా విస్తృతి పెరుగు తున్న ప్రస్తుత సమయంలో ప్రజల నుంచి వాస్తవాలు దాచడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీని ఢీకొట్టే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తోందని.. రాహుల్ బలహీన నాయక త్వం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణ మని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఢీకొని నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి 2029లో కేంద్రంలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌కు మెజారిటీ సాధ్యం కాదని.. బలమైన ప్రాంతీయ పార్టీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని, సమగ్రతను, సెక్యులరిజాన్ని కాపాడాలని కోరుకునే మేధావులు, ప్రజలంతా ప్రాంతీయ పార్టీలకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్‌రాజ్, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే వ్యవహారాలు నడుస్తున్నా రాహుల్ గాంధీ చూసీ చూడనట్టు వ్యవహరించిన తీరును దేశం మొత్తం గమనిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులకు ప్రజాక్షేత్రంలో కాలం చెల్లిందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. పండుగ పూట పస్తులు రాష్ట్రంలో కాంగ్రెస్ దండగగా మారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదని.. ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదారు నెలలుగా వేతనాలు లేవని కేటీఆర్ ఆరోపించారు. పంచాయతీ, మున్సిపల్ కారి్మకులు, ఆస్పత్రుల సిబ్బంది, హాస్టల్ వర్కర్స్, గెస్ట్ లెక్చరర్స్ మొదలుకుని ప్రతీ ప్రభుత్వ శాఖలో వేతనాల్లేక చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని.. దసరా పండుగ వచి్చనా చిరుద్యోగుల చేతిలో చిల్లిగవ్వ లేదని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోతే.. చిరుద్యోగుల బతుకు బండి ఎలా సాగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. -
హర్యానా, కశ్మీర్ ఫలితాలపై హరీష్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గారడీలను హర్యానా ప్రజలు నమ్మలేదని.. అందుకే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని సెటైర్లు వేశారు. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అటు కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదు, హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి…— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024 -
మూసీ లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు మూ టల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాస్‌లతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదినెలల పాలనలో 23మార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచి్చన నిధులు, చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు.సీటు కాపాడుకునేందుకే: అధిష్టానం మెప్పు కోసం తరచూ ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ తన బాస్ లకు జై కొట్టి సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేనందునే పదేపదే ఢిల్లీకి పిలిచి ఆయనకు చివాట్లు పెడుతోందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన తీరు చూస్తే ఐదేళ్లలో ఆయన 125 మార్లు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరీ తప్పదని గతంలో తాము చెప్పిందే వాస్తవమవుతోందన్నారు. నిధులు తెస్తానంటూ మోసగిస్తున్నాడు: కేంద్రంలోని పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెస్తానంటూ నమ్మబలుకుతున్న రేవంత్ ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన నిధుల లెక్క తేల్చాలన్నారు. కేంద్ర బడ్జెట్‌తోపాటు ఇటీవల వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. -
తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నవ్ స్వామి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి.. భయాన్ని సృష్టింస్తున్నారని మండిపడ్డారు. తీరా చూస్తే హైడ్రా హడావిడీతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందన్నారు. హైడ్రా కారణంగా రెండు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని తెలిపారు.రిజిస్ట్రేషన్లు పడిపోయాయని, ఆదాయం తగ్గిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఫర్వాలేదుగానీ, ఉన్నది ఊడగొడుతున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వస్తది? ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అసలేం చేద్దామనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.పనిమంతుడని పందిరేపిస్తే... పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తీరు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతకాక, సామాన్యులపైకి బుల్డోజర్స్ పంపి... భయాన్ని సృష్టించాడు. తీరా చూస్తే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది.… pic.twitter.com/EwPkTPBOP1— KTR (@KTRBRS) October 7, 2024 -
బిడ్డలకు మూసీ పేరు పెట్టుకునేలా చేస్తాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ఫ్రంట్ పథకం ఆగదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూసీ పరీవాహకం పరిధిలో ఉన్న పది వేల కుటుంబాలకు మురికి జీవితం కాకుండా మంచి జీవితం అందించటం కూడా ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్నారు. ‘‘మన ఇళ్లలో ఆడబిడ్డలకు గోదావరి, సరస్వతి, నర్మద, కృష్ణా.. ఇలా నదుల పేర్లు పెట్టుకుంటాం. మరి మూసీ కూడా నది పేరే కదా. ఆ పేరు ఎందుకు పెట్టుకోవటం లేదు. మూసీ అనగానే మురికి కూపమన్న భావన రావడమే దీనికి కారణం. అందుకే ఆ మురికిని ప్రక్షాళన చేసి.. నదిని అద్భుతంగా మార్చుతాం. పిల్లలకు మూసీ అన్న పేరు పెట్టుకునేలా చేస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో గతంలోనే నోటిఫికేషన్లు జారీ అయిన ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘గతంలో ఎన్నో ప్రాజెక్టులకు భూసేకరణ జరిపినప్పుడు లేని ఇబ్బంది మూసీ విషయంలో ఎందుకు? ఆ కుటుంబాలు జీవితాంతం మురికిలోనే ఉండాలా? వారిని బాగు చేసే బాధ్యత ప్రభుత్వంతీసుకుంటుంది. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించటంతోపాటు వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మూసీ పరిధిలో 10వేల కుటుంబాలు ఉన్నాయని 33 బృందాలు ఆరునెలల పాటు సర్వే చేసి తేల్చాయి. బఫర్ జోన్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రాజెక్టును అడ్డుకోవడం కాదు.. కావాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. కాళేశ్వరం కోసం లక్ష కోట్లు తగలబెట్టిన వారికి ఇది తెలియదా? ఇటీవల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నేతల తరహాలోనే మూసీ ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు. ఆయన అంగీ మార్చినా బీఆర్ఎస్ వాసనను వదిలించుకున్నట్టు లేదు. సబర్మతి తరహాలో మూసీని అభివృద్ధి చేద్దాం. కేంద్రం నుంచి ఓ 20 వేల కోట్లు వచ్చేలా బీజేపీ ఎంపీలు చేయలేరా? పరామర్శల పేరుతో మూసీ పరీవాహక ప్రాంతాలకు వచ్చే కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను ఓ వారంపాటు అక్కడే ఉంచితే ఆ ప్రాంత జనం కష్టాలేమిటో తెలిసి వస్తాయి. గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి చేతులెత్తేశారు.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి ప్రభుత్వ పెద్దలు.. నియామకాలను పట్టించుకోలేదు. వీటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించటం తమ బాధ్యతగా భావించకపోవటం వల్ల ఏళ్ల తరబడి నియామకాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే నాటి సీఎం, మంత్రుల కుర్చీల్లో కూర్చున్న వారి ఉద్యోగాలు ఊడాలని విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమంలో చెప్పాను. దాన్ని మీరు చేసి చూపించారు. మా కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూస్తూ.. మేం సీఎంగా, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. ప్రభుత్వం ఏర్పడ్డ 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు కల్పిస్తూ.. నిరుద్యోగ యువత తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూసేలా నియామక పత్రాలను అందించాం. ఇప్పుడు దసరా ముందు 1,635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించటం ద్వారా వారి కుటుంబాలు మరింత ఆనందంగా పండుగ నిర్వహించుకునేలా చేశాం. మరో 11,063 మందికి ఈ నెల 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించబోతున్నాం. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? భాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలం వరకు దశాబ్దాలుగా నిలబడి ఉండేలా కట్టిన నాటి ఇంజినీర్లను, హైదరాబాద్ వెలుపల జంట జలాశయాలకు ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యలను ఆదర్శంగా తీసుకుంటారా? లేక కట్టిన కొన్నేళ్లకే కూలిపోయిన కాళేశ్వరాన్ని నిర్మించిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఉద్యోగులు, ఇంజనీర్లు నిర్ణయించుకోవాలి. కొత్తగా విధుల్లోకి చేరుతున్న ఇంజనీర్ల చేతుల మీదుగా రీజనల్ రింగురోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీ, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతున్నాయి. చెక్‌డ్యామ్‌లు మొదలు కాళేశ్వరం వరకు గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాల నాణ్యత డొల్లతనాన్ని చూపిస్తాం రండి.. నాటి మంత్రులకు ఇదే నా సవాల్. దసరా ముందు సంతోషం నింపాం: మంత్రి కోమటిరెడ్డి మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహనీయ ఇంజనీర్లు పనిచేసిన ఈ నేలమీద ఇప్పుడు కొందరు ఇంజనీర్లు విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి రావటం బాధగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘‘అధికారులు అందించిన ప్లాన్లను పక్కనపెట్టి తానే పెద్ద ఇంజనీర్ అన్నట్టుగా నాటి సీఎం కేసీఆర్ కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినేలా చేశారు. ఏళ్ల క్రితం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. అలా పెండింగు పెట్టిన వాటిని తమ ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వటం ద్వారా దసరా ముందు వారి ఇళ్లలో సంతోషాన్ని నింపుతోంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారు బాధ్యతగా పనిచేయాలి. నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. దశాబ్దాలుగా అద్భుత సేవలందిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టును కొత్త ఇంజినీర్లు ఆదర్శంగా తీసుకోవాలి. కట్టిన మూడేళ్లకే కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టును కాదు’’ అని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.కేశవరావు, నేతలు కోదండరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాల్స్ కట్టి పెద్దలకు ధారాదత్తం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: బ్యూ టిఫికేషన్ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు.మూసీ ప్రక్షాళనకి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? డీపీఆర్ ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? రూ. కోట్ల విలువ చేసే ఇల్లు తీసుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎలా? సబర్మతి నది ప్రక్షాళనకి రూ. 2 వేల కోట్లు, నమోగంగ ప్రాజెక్ట్‌కి 12 ఏళ్లలో రూ. 22 వేల కోట్లు ఖర్చు పెడితే మూసీ ప్రక్షాళనకు రూ. లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు అవుతున్నాయి? ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని ఈటల సీఎంను డిమాండ్ చేశారు.స్టేజీల మీద ప్రకటనలు చేయడం కాకుండా ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం పెడితే తాము ఎక్కడికైనా రావడానికి సిద్ధమన్నారు. ఈ విషయాలపై స్పష్టత వచ్చే వరకు తన ప్రతిఘటన ఉంటుందని తెలిపారు. -
27 రోజుల్లో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగానికి రూ. 2లక్షల రుణమాఫీ ప్రక్రియను మాట ఇచ్చిన ప్రకారం పూర్తి చేశామంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ లో ఆ వివరాలను ప్రస్తావించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు మాఫీ చేయలేదని, ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దంటూ వ్యా ఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ లేఖను ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ హామీ అంటే బంగారు హామీ అని తెలంగాణ రైతులు నమ్మారని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రుణమాఫీ చేసి దేశానికి కొత్త పంథా చూపెట్టామని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ అభివృద్ధికి భవిష్యత్‌లో కేంద్రం నుంచి తగిన సహకారం అందించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. లేఖలో ఏం రాశారంటే...!ప్రధాని మోదీకి రాసిన లేఖలో మూడు దఫాలు గా రైతు రుణమాఫీని తెలంగాణలో అమలు పరిచిన తీరును సీఎం రేవంత్ వివరించారు. ఈ ఏడాది జూలై 18న రూ.లక్ష లోపు రుణమాఫీకి సంబంధించి 11,34,412 రైతు ఖాతాల్లో రూ. 6,034.97 కోట్లు జమ చేశామని, జూలై 30న రూ.1.50 లక్షలలోపు మాఫీ కోసం 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేశామని, ఆగస్టు 15వ తేదీన రూ.2లక్షల వరకు మాఫీ కోసం 4,46,832 మంది ఖాతాల్లో రూ. 5,644.24 కోట్లు జమ చేశామని వెల్లడించారు.మొత్తం కేవలం 27 రోజుల వ్యవధిలో రూ.17,869.22 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు ఆ ఎక్కువ ఉన్న రుణాన్ని బ్యాంకుల్లో కడితే రూ. 2 లక్షలు ప్రభుత్వం చెల్లించేందుకు సిద్ధంగా ఉందని, ఈ ప్రక్రియను కూడా నిర్ణీత గడువులో పూ ర్తి చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లో పారదర్శకత కోసం అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని, అప్పు ల ఊబి నుంచి రైతులను విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేశామని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని వెల్లడించారు. -
గ్యారెంటీలపై నిలదీయండి: యువతకు హరీశ్‌రావు పిలుపు
సాక్షి,హైదరాబాద్:గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం(అక్టోబర్6) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘గ్యారెంటీలు అమలు చేయలేకపోగా,మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు,రైతు బంధును నిలిపివేశారు,రైతు భరోసా దిక్కులేకుండా పోయింది,బోనస్‌ను బోగస్ చేశారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు,పది నెలలు గడిచాయి వాటికి అతీ గతి లేదు.నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారు.ఈ దసరాకు మీ ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు,స్నేహితులతో అలయ్-బలయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించండి.మీ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు,రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్,మైనారిటీ డిక్లరేషన్,బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నిలదీయండి’అని హరీశ్‌రావు యువతకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూఠిఫికేషన్: కేటీఆర్