breaking news
-
పాపపు పాలనలో ప్రతీ బిడ్డా ఆగమే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకి వచ్చారని కామెంట్స్ చేశారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే. సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే. అడ్డగోలు సాకులతో సస్పెన్షన్లు-హక్కులు అడిగితే వేటేయ్యడాలు. రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు-ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్. 165 ఏఈవో లు 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం.బీఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం-కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. -
ఎలాంటి ఆధారాలూ లేకుండా దిగజారి మాట్లాడారు: కేటీఆర్
సిటీ కోర్టులు (హైదరాబాద్): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు, తమ పార్టీకి కూడా తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని, వాటిని విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. తనపై సురేఖ చేసిన కామెంట్లను చూసి పలువురు సాక్షులు తనకు ఫోన్ చేశారని తెలిపారు. కొండా సురేఖ తనపై అసత్య ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ బుధవారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్, ఎక్సైజ్ కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ తన వాంగ్మూలం ఇచ్చారు. వాస్తవానికి గత వారం విచారణలోనే కేటీఆర్ తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సి ఉండగా..ఆయన కోర్టుకు రాలేకపోవడంతో న్యాయవాదులు వాయిదా కోరారు. జడ్జి ఎస్.శ్రీదేవి విచారణను బుధవారానికి వాయిదా వేయగా కేటీఆర్ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. కేటీఆర్‌తో పాటు సాక్షులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్, తుల ఉమా, బాల్క సుమన్ కూడా తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు. అయితే సమయం లేకపోవడంతో శ్రవణ్‌కుమార్ వాంగ్మూలం మాత్రమే కోర్టు రికార్డు చేసింది. మిగతావారి వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బుధవారం నాటి విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు సురేందర్, అరవింద్, సిద్ధార్థ, బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ హాజరయ్యారు. తదుపరి విచారణకు సాక్షులు అందరూ హాజరుకావాలని ఆరోజు వారి వాంగ్మూలం తీసుకుంటామని జడ్జి శ్రీదేవి తెలిపారు. కేటీఆర్ వాంగ్మూలం ఇలా.. ‘డబుల్ పీజీ చేసిన నేను తొలుత అమెరికాలో ఉద్యోగం చేశా. 2006లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్ సారథ్యంలో ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశా. ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా. ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించా. వివిధ దేశాల నుంచి కంపెనీలు తీసుకువచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేశా. కేవలం తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా. అలాంటి నాపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. దాదాపు 18 ఏళ్లుగా రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవచేస్తున్న నాపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంతో, నా గురించి తెలిసిన చాలామంది బాధపడ్డారు. సురేఖ బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి అత్యంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా, తీవ్ర ఆవేదన కలిగించేలా ఉన్నాయి. నేను డ్రగ్ అడిక్ట్నని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని, ఇతరులకు డ్రగ్స్ అలవాటు చేస్తానని, సినీ, రాజకీయ నేతలు చాలామంది విడాకులకు నేనే కారణమని.. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం పబ్లిసిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను అన్నీ చెప్పలేకపోతున్నా. ఫిర్యాదులో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోండి. సురేఖ చేసిన కామెంట్ల వీడియోలను కూడా కోర్టుకు సమర్పించా. నాపై అసత్య ఆరోపణలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని కేటీఆర్ కోర్టును కోరారు. సురేఖ అనుచిత వ్యాఖ్యలతో బాధపడ్డా.. ‘కేటీఆర్ నాకు 2007 నుంచి తెలుసు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశా. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో చాలా బాధపడ్డా. మా నాయకుడిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోండి..’ అని శ్రవణ్‌కుమార్ తన వాంగ్మూలంలో కోరారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు బుధవారం కోర్టుకు వచ్చారు. -
బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్‌రెడ్డి?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం వేగిరం చేసింది. డిసెంబర్ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాల యూనిట్లను ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని, తద్వారా అక్కడ పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటా యని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్‌షాప్ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. దక్షిణాదికే అవకాశమెక్కువ.. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసినా సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు శివరాజ్‌సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), సునీల్ భూపేంద్ర యాదవ్ (రాజస్తాన్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్ (ఒడిశా)ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో అధినాయకత్వం ఉంది. -
రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి: మంత్రి పొంగులేటి
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నేతలు ఉంటారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతోపాటు ఎనిమిది నుంచి 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందు ఉంచబోతున్నాం’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన బుధ వారం సియోల్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పు చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లు అయినా వదలం.. అది విదేశీ కంపెనీయా? వారిని ఎలా ట్రేసవుట్ చేయాలి? వారి వెనుక ఉన్న తొత్తులు ఎవరు? వారి మధ్య జరిగిన లావాదేవీలేమిటి?.. ఇలా అన్నింటినీ నిగ్గుతేల్చి మా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టనుంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయికాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు అంటూ ఆరోపణలు చేయ డమే తప్ప, ఇప్పటివరకు ఎలాంటి రుజువులు చూపలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోందని మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం సియోల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత రోజు తెల్లారో,మరోనాడో ఒకటో, రెండో బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నాయకులే ఉంటారు. ఈ ధరణికి సంబంధించి, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఇతరత్రా ఏవైతే ఎనిమిదో, పదో అంశాలు ఉన్నాయో.. తొందరపడో, ఉత్త పుణ్యానికో, అన్యాయంగానో వారిపై వేయాలన్నది కాదు. ఆధారాలతో సహా నిరూపిస్తాం. కాళేశ్వరంపై కమిషన్ వేశాం. త్వరలో దాని నివేదిక వస్తుంది. ధరణికి సంబంధించిన సమాచారం కూడా వస్తోంది. ఆల్రెడీ రెండు ట్రాక్‌లో ఉన్నాయి. ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి’’ అని తెలిపారు.కొత్త కాన్సెప్ట్‌లో ధరణి..రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఒకే కాలమ్‌లో పేరు ఉంటే రైతుకు భూమి ఉన్నట్లు లేదంటే భూమి లేనట్లు అయిపోయిందని మంత్రి పొంగులేటి చెప్పారు. అదే ఇప్పుడు తాము 12 నుంచి 14 కాలాలు తీసుకొచ్చి.. ఆ భూమి స్వభావం, గతంలో ఎవరి దగ్గర ఉంది వంటి వివరాలన్నీ నమోదు చేస్తామని తెలిపారు. ‘‘భవిష్యత్తులో డాక్యుమెంట్లో ఎలాంటి అపార్థాలు లేకుండా ఉండేలా కాలాలు ఉంటాయి. ధరణి పేరు కూడా మార్చబోతున్నాం. కొత్త కాన్సెప్ట్‌లో భూమి ఉన్న ప్రతి ఆసామికి పూర్తిగా క్లియర్ టైటిల్‌తో డాక్యుమెంట్ ఉండబోతోంది. ధరణిలో మొత్తం 35 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏదైనా భూసమస్యపై దరఖాస్తు చేయాల్సి వచ్చినప్పుడు.. తెలిసో, తెలియకో ఒక మాడ్యూల్ బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తు చేస్తే.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతుంది. మేం 35 మాడ్యూల్స్‌కు బదులు సింగిల్ డిజిట్లో మాడ్యూల్స్‌తో కొత్త కాన్సెప్ట్‌ను తీసుకురాబోతున్నాం..’’ అని పొంగులేటి తెలిపారు. విదేశీ సంస్థ చేతుల్లో నుంచి భూరికార్డుల నిర్వహణను తప్పించి.. భారత ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి ఇచ్చామని చెప్పారు. 2024 రెవెన్యూ యాక్ట్‌ను ప్రజలకు అనుకూలంగా ఉండేలా తీసుకొచ్చామని.. అభద్రతతో ఉన్న లక్షల మంది రైతులు, భూములున్న ఆసాములకు భరోసాను కల్పించబోతున్నామని పేర్కొన్నారు. -
జీవన్‌రెడ్డి అలక.. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(అక్టోబర్ 23) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదన్నారు. జిల్లా ఎస్పీతో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడామన్నారు. ‘జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారు. జీవన్‌రెడ్డితో నేను కూడా మాట్లాడుతా. జీవన్‌రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత.. ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. చనిపోయిన గంగారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అందరితో సమన్యాయం చేసుకోని మాట్లాడాలని పీసీసీ చీఫ్ నాకు సూచించారు’అని శ్రీధర్‌బాబు తెలిపారు.ఇదీ చదవండి: అవమానాలు చాలు ఇకనైనా బతకనివ్వండి : జీవన్‌రెడ్డి -
మోదీ బాటలోనే నడుస్తా: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కేటీఆర్ నోటీసులకు భయపడేది లేదన్న కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్ తనకు లీగల్ నోటీసులు ఇస్తే, తాను మళ్లీ మళ్లీ లీగల్ నోటీసులు పంపిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ బుధవారం(అక్టోబర్ 23) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ లీగల్ నోటీసులు ఇవ్వలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. లీగల్ నోటీసుల విషయంలో మోదీ బాటలోనే నడుస్తానని కేటీఆర్ చెప్పారు. కాగా, తనపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని అందులో పేర్కొన్నారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ ఇలాంటి తాటాకు చప్పుల్లకు భయపడేది లేదన్నారు. ఇదీ చదవండి: కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు -
సీఎం రేవంత్.. ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఎమ్మెల్యే ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్యగా చెబుతున్నారని, దీనిపై రేవంత్ లెంపలేసుకుంటారా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని సూటిగా వేలెత్తి చూపుతున్నారని తెలిపారు. తమ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారని అన్నారు.ఈ మేరకు ఎక్స్‌లో స్పందించిన కేటీఆర్.. ‘ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా? క్షమాపణ చెబుతారా? మీరు గడప గడపకు వెళ్లి.. చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా ?ప్రోత్సహించిన మిమ్ములనా ?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే.. మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు.. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ?జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు… pic.twitter.com/D9CTnAl6Ci— KTR (@KTRBRS) October 23, 2024కాగా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. -
కేటీఆర్ లీగల్ నోటీసులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ కేటీఆర్‌కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్..‘కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశాను. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడాను. ఆయన మంచి వాడు అనుకుంటన్నాడు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళ్తాం’ అంటూ కామెంట్స్ చేశారు.అలాగే, కేటీఆర్ నోటీసులపై తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. లీగల్ నోటీసులతో కేటీఆర్ రాజకీయ జీవితానికి చరమ గీతం పడటం ఖాయం. దద్దమ్మ, సన్యాసి అంటూ కేసీఆర్, కేటీఆర్ కొన్ని వందల సార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పారిపోయే రోజులు వచ్చాయి. లీగల్ నోటీసులతో ఆట మీరు మొదలుపెట్టారు. రోజు లీగల్ నోటీసులు అందుకోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ..‘లీగల్ నోటీసులకు బండి సంజయ్ భయపడరు. బండి సంజయ్‌ను ఎన్నో సార్లు కేసీఆర్, కేటీఆర్ అవమానించారు. భాషను మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. -
రేవంత్.. నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేసే దమ్ముందా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా రామన్నపేటలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని సవాల్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యనల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్. , మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, లను హౌజ్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్యలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం నియంతృత్వం కాక మరేంటి?. వీరితో పాటు ప్రజాసంఘాల ప్రతినిధులు, పర్యావరణవేత్తలను ముందస్తు అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురిచేయడం రేవంత్ సర్కారు అణచివేత విధానాలకు నిదర్శనం.ఇంతటి నిర్బంధ పరిస్థితులను సృష్టించి నిర్వహించే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు విలువ ఉండదు. ఇదీ ముమ్మాటికీ అదానీ ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ సాగిస్తున్న అరాచక పర్వం. అక్రమంగా నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులతోపాటు ప్రజాసంఘాల నేతలను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఎలాంటి నిర్బంధాలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. అప్పుడే గుండె పగిలిన రైతుల ఆవేదన, చుట్టుపక్కల ప్రజల ఆక్రందన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. నియంతృత్వ విధానాలతో ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపించి అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ సర్కారుకు ప్రజలే మరణశాసనం రాస్తారు. జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. రామన్నపేటలో దొంగచాటుగా నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవడం, హౌజ్ అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్యనల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర…— KTR (@KTRBRS) October 23, 2024 -
25న ఇందిరాపార్క్ ధర్నాను విరమించుకోండి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు ఈ నెల 25న ఇందిరాపార్కు వద్ద తలపె ట్టిన ధర్నాను విరమించుకోవాలని, గత పదేళ్లలో మూసీ ప్రక్షాళనకు, మూసీ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధికి నయా పైసా కేటాయించని కేంద్రం ఎదుట ధర్నా చేయాలని మంత్రి సీతక్క హితవు పలికారు. యూపీఏ హయాంలో మూసీ ప్రక్షాళనకు రూ.335 కోట్లు మంజూరు చేస్తే, మోదీ పాలనలో పైసా మంజూరు కాకపోయినా కిషన్‌రెడ్డి ఎందుకు పెదవి విప్పలేదని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు. ఇతర నదుల ప్రక్షాళన కు నిధులిచ్చి మూసీ ప్రక్షాళనకు పైసా కేటాయించకపోవడం తెలంగాణపై కేంద్రం వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.సొంత నియోజకవర్గం మీదుగా మూసీ పారు తున్నా ఏనాడూ కేంద్రం నుంచి నిధులు తీసుకురాని కిషన్‌రెడ్డి ఇప్పుడు ధర్నాకు పిలుపునివ్వడం ఏమిటో ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఒక కేంద్రమంత్రి ప్రాతిని ధ్యం వహిస్తున్నందున.. కేంద్రంతో చర్చించి హైదరాబాద్ జీవనరేఖగా భావించే మూసీ పునరుజ్జీవానికి రూ.10 వేల కోట్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సమర్థిస్తున్న బీజేపీ ఇక్కడ మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. -
దివాళా అంటూ దిక్కుమాలిన ప్రచారం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం దివాళా అంటూ దిక్కుమాలిన ప్రచారం చేస్తోందని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో మండిపడ్డారు. వనరులు.. అప్పులు.. ఆర్థిక నిర్వహణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సూచీలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేక కేసీఆర్‌పై కాంగ్రెస్ బురద చల్లుతోందన్నారు.తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అర్థం లేని వ్యాఖ్యలతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ రిజర్వు బ్యాంకు నివేదికలు, కాగ్ గణాంకాలు, ఆర్థిక మండలి నివేదికలు, ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ తెలంగాణ ఆర్థిక సౌష్టవం, పటిష్టతను పదేపదే నిరూపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో కూడా పదేళ్లుగా తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలో అగ్రస్థానంలోనే ఉందన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటకుండా అప్పుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించిందన్నారు. నీచ ప్రచారాలను సహించేది లేదుతన వ్యక్తిత్వంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న వారిని వదిలి పెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. తన వ్యక్తిత్వ హననం చేసేలా ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో చేసే నీచ ప్రయత్నాలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. రాజకీయ విమర్శల పేరిట ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసేవారికి కొండా సురేఖపై వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా, కాంగ్రెస్ నాయకుల ఆదాయం భారీగా పెరుగుతోందన్నారు. అదుపు తప్పిన శాంతిభద్రతలుకొద్ది నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని జనం చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇకనైనా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని చెప్పారు. పోలీసు ఉన్న తాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోపాటు సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గతేడాది అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఐటీ పార్క్ టవర్ పనులు 11 నెలలుగా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదన్నారు. -
ఇది కుట్రా... లేక ద్వేషమా?
సాక్షి, హైదరాబాద్: వివిధ హిందూ సంస్థల కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. హిందూ సంస్థల పట్ల, ఆ సంస్థల కార్యకర్తలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఇది కుట్రా? లేక ద్వేషమా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి’అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.‘ముందుగా...భారతీయ న్యాయసంహిత సెక్షన్ 176, సెక్షన్ 173 నిబంధన కింద 3 క్రిమినల్ కేసులకింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన పోలీసులు..సోమవారం అర్ధరాత్రి సమయంలో..ఆ ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి సెక్షన్ 109 (హత్యాయత్నం)ను చేర్చారు. ఇది హిందూ సంస్థల సభ్యులను హింసించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనను తెలియజేస్తోంది’అని ఎక్స్‌లో పేర్కొన్నారు. -
TG: జీవన్‌రెడ్డి వ్యవహారంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గంగారెడ్డి హత్యను పార్టీ సీరియస్‌గా తీసుకుందని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయమై మహేష్‌కుమార్ గౌడ్ మంగళవారం(అక్టోబర్ 22) మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ నేత గంగారెడ్డి హత్య వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టేది లేదు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడాను.జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు హత్యకు గురికావడంతో ఆయన ఆవేదనతో ఉన్నారు.జీవన్ రెడ్డి పార్టీ సీనియర్ నేత ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటాం. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవన్నీ త్వరలో పరిష్కారమవుతాయి. జీవన్‌రెడ్డి అంశాన్ని మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగించాం. ఆయన త్వరలో అన్ని సర్దుకునేలా చేస్తారు’అని మహేష్‌కుమార్ గౌడ్ చెప్పారు.ఇదీ చదవండి: జగిత్యాలలో కాంగ్రెస్ నేత దారుణ హత్య -
శాంతిభద్రతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే నేడు జీవన్‌రెడ్డి అంటున్నారని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో...రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి జనం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా ఆవేదనతో చెబుతున్నారని పేర్కొన్నారు.ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలని కేటీఆర్ కోరారు. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని సూచించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని.. వారి పని వారిని చేసుకొనిస్తే శాంతి భద్రతలు, రాష్ట్రంలో సామరస్యాన్ని కాపాడగలుగుతారని అన్నారు.A senior congress leader & a Former Minister, MLC Jeevan Reddy Garu today is echoing what the rest of Telangana has been saying since the last few months Law & Order in Telangana has been a major concern. Without a full time Home Minister and more importantly with police being…— KTR (@KTRBRS) October 22, 2024 -
సీఎం రేవంత్‌కు ఎంపీ ఈటల హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్:సర్వేజన సుఖీనోభవ అన్నది తమ సిద్ధాంతమని,తమ సంస్థల పట్ల సీఎం రేవంత్ ద్వేషబావంతో ఉన్నారని బీజేపీ సీనియర్‌నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. మంగళవారం(అక్టోబర్22) ఈటల మీడియాతో మాట్లాడారు.‘కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదం పేరుతో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తున్నారు.కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. సీఎంను దించడానికి మత కల్లోలాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు. మర్రి చెన్నారెడ్డిని దించడానికి,కోట్ల విజయభాస్కర్ రెడ్డిని దించడానికి మతకల్లోల్లాలు సృష్టించారు.శవాల మీద రాజకీయాలు చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. గుడిపై దాడిచేసిన వారిని పట్టుకునే దమ్ములేక ఓట్ల రాజకీయం కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. స్లీపర్ సెల్స్ ఉన్నాయని,రోహింగ్యాలు ఉన్నారని కేంద్రం హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నివారించలేకపోతోంది.టెర్రరిస్టులు ఎవరు ? రెచ్చగొట్టేవారు ఎవరు ? సంఘ విద్రోహ శక్తులు ఎవరో తేల్చాలి.హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో రేవంత్ విఫలమయ్యారు.శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బీజేపీ పనిచేస్తోంది. హిందూ కార్యకర్తల అరెస్టులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్న.చేతులు ముడుచుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేము’అని ఈటల హెచ్చరించారు.ఇదీ చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ -
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్‌హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పిరికిపందల మాదిరి తన వ్యక్తిత్వంపైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్.. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా, ఇక పైన మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ప్రజల తాలూకు అంశాలకే తాను ప్రాధాన్యత ఇచ్చాను. ఇతరులపై వ్యక్తిగత ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు ఏనాడూ చేయలేదు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నీచమైన వ్యాఖ్యలు చేస్తామంటే ఊరుకునేది లేదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.రాజకీయ విమర్శలపేరు చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేసే వారికి కొండా సురేఖపై వేసిన రూ. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలి. న్యాయస్థానాల్లో సత్యం గెలుస్తుందన్న నమ్మకం నాకున్నది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఝలక్ -
మూసీపై సీఎంది పూటకోమాట: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మూ సీ నది ప్రక్షాళనపై ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూటకోమాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ‘ఎ క్స్’ వేదికగా విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం రూ. 1.50 లక్షల కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జూలై 20న సీఎం ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అలాగే సెప్టెంబర్ 6న సీఎం విడుదల చేసిన ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ: దిరోడ్ టు వన్ ట్రిలియన్ డాలర్ ఎకాన మీ’ అనే విజన్ డాక్యుమెంట్లోనూ ఇదే విష యాన్ని పొందుపరిచారని పేర్కొన్నారు. కానీ దీనిపై విపక్షాలు ప్రశి్నస్తే తాను ఎన్నడూ రూ. 1.50 లక్షల కోట్ల ఖర్చవుతుందని చెప్పలేదంటూ సీఎం ఆవేశంతో ఊగిపోతున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట ప్ర జాధనం లూటీ చేయాలనుకొనే ప్రభుత్వ కు ట్రను బట్టబయలు చేస్తామనిస్పష్టం చేశారు. ప్రవీణ్‌ను ఆహ్వానించి అరెస్టు చేస్తారా? గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరుల సంస్మరణ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి, తమ పార్టీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను ఓవైపు ఆహా్వనించి మరోవైపు హౌస్ అరెస్ట్ చేయడాన్ని హరీశ్‌రావు ఖండించారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రకటన చేశారని.. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమని హరీశ్‌రావు ఓ ప్రకటనలో మండిపడ్డారు. -
రేవంత్,బండి సంజయ్ రహస్య మిత్రులు: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.‘రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్ఎస్కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.గ్రూప్ వన్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..‘గ్రూప్ వన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్‌పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు -
సమాజ్‌వాదీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలి
గ్రేటర్ హైదరాబాద్‌లో సమాజ్‌వాదీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని ఏపీ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు పాశం వెంకటేష్ సూచించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ సమాజ్‌వాదీ పార్టీ నేత, సామాజిక కార్యకర్త దండుబోయిన కళ్యాణ్ యాదవ్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు మదిరె నర్సింగ్‌రావుతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల పార్టీలో చేరిన నేతలు వారి వారి ప్రాంతాల్లో శ్రేణులను ఐక్యం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించారు. త్వరలోనే సమాజ్‌వాదీపార్టీ జాతీయ అద్యక్షుడు అఖిలేష్ యాదవ్ సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో కమిటీలు వేస్తామని పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ నమోదును నిర్వహిస్తామని తెలిపారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో ఏ విధంగా అయితే సమాజ్‌వాదీ విజయం సాధించిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు రాబట్టి యూపీలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. -
రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు ఎగిరపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధు కావాలా..? రాబందు కావాలా?. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా?. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి... ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారు!. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే..!. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు.. ఇప్పుడు ఇంకొకటి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!పంట పెట్టుబడి… pic.twitter.com/fGpgRLZDB3— KTR (@KTRBRS) October 21, 2024 -
పరీక్షలను రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్–1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్ మేరకు మార్పులు చేయాలన్నారు.జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థులను.. రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు. -
'గ్రూప్–1'పై ఆదుర్దా.. ఆందోళన..
‘‘మేం రాజకీయాలకు అతీతం.. మా చివరి అవకాశాన్ని వృ«థా చేయకండి. ఆర్థికంగా, మానసికంగా నష్టపోయి ఉన్న మా బాధ వినండి. పరీక్షలు వాయిదా వేయండి’’.. – ఇదీ నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన ‘‘అంతా సవ్యంగానే ఉంది. జీవో 29 విషయంలో గానీ, మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల విషయంలోగానీ నిరుద్యోగులకు ఎలాంటి నష్టం లేదు. అపోహలకు పోకుండా పరీక్షలు రాయండి. అన్ని ఏర్పాట్లు చేశాం’’.. – ఇదీ పరీక్షలు నిర్వహించేయాలన్న ఆదుర్దాలో రాష్ట్ర ప్రభుత్వం సూచన.సాక్షి, హైదరాబాద్: .. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల విషయంలో ఇరుపక్షాలు పట్టువీడని పరిస్థితి. పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు ఓ వైపు ఆందోళనలను కొనసాగిస్తుండగానే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసేసింది. జీవో 29 కారణంగా రిజర్వుడ్ కేటగిరీల వారికి నష్టం జరుగుతుందని అభ్యర్థులు మొత్తుకుంటుంటే.. అలాంటిదేమీ లేదంటూ ప్రభుత్వం ముందుకెళుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాల్సిందేనంటూ ఆదివారం నిరుద్యోగులు, అభ్యర్థులు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలో బైఠాయించినా.. గాందీభవన్ ముట్టడికి ప్రయత్నించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కనీసం అభ్యర్థులు ప్రెస్‌మీట్ పెట్టి తమ ఆవేదన చెప్పుకొనేందుకు కూడా అనుమతించలేదు. ప్రతిపక్షాల మద్దతుతో.. ఆందోళన తెలుపుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులకు ప్రతిపక్షాలు బాసటగా నిలిచాయి. గ్రూప్–1 పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నించారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ నిరుద్యోగ యువతకు చెప్పిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు చేస్తోందేమిటని నిలదీశారు. ఇక బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోవడం ఎందుకని, పరీక్షలను వాయిదా వేసి తప్పులను సరిదిద్దితే వచ్చిన నష్టమేంటని నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించారు. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో ఏ ఒక్క వర్గానికీ నష్టం జరగలేదని, భవిష్యత్తులోనూ నష్టం జరగకుండా చూస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో భరోసా ఇస్తున్నానని ప్రకటించారు. ఇక నిరుద్యోగుల ఆందోళనలను పట్టించుకోకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సోమవారం నుంచి గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో.. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకంటూ పరీక్షా కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు సుప్రీంకోర్టులో విచారణ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు, అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. అటు విద్యార్థుల ఆందోళన, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. -
బీఆర్ఎస్,బీజేపీ రెచ్చగొడుతున్నాయి: పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ వన్ పరీక్షపై బీఆర్ఎస్,బీజేపీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.గాంధీభవన్‌లో ఆదివారం (అక్టోబర్20) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్,బీజేపీ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నా.సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదు. జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బండి సంజయ్ చెప్పాలి.బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు’అని మహేశ్‌గౌడ్ మండిపడ్డారు.ఇదీ చదవండి: న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి