breaking news
-
బీఆర్ నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?: పోసాని
సాక్షి, హైదరాబాద్: ప్రజల తరఫున టీవీ5, ఈనాడు, ఏబీఎన్ ప్రశ్నించడం మానేశాయని వైఎస్సార్సీపీ నేత పోసాని కృష్ణ మురళి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో అరాచక పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అని ప్రచారం చేశాడు. ఇవ్వడం మానేశాడు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15 వేలు అన్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. హమీల గురించి ప్రశ్నిస్తున్నవారిని అరెస్ట్‌లు చేయిస్తున్నాడు’’ అంటూ పోసాని నిలదీశారు.‘‘నేను రోడ్డు మీదకు వస్తే కార్యకర్తతో చంపించే లెవెల్లో టీవీ 5 కథనాలు ఉన్నాయి. నేను సైకో అని.. పార్టీలు మారతానని ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆరు వందల వాగ్ధానాలు చేశాడు. మేము ఎందుకు ప్రశ్నించకూడదు. నాలాంటి వాళ్లను తిట్టినందుకు టీవీ5 నాయుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. చంద్రబాబు కాళ్ల దగ్గరకు వెళ్లి డబ్బు సంపాదించుకున్నారు. బీఆర్ నాయుడు సినిమా ఇండస్ట్రీని తిట్టించాడు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టించిన బీఆర్‌నాయుడిని ఎందుకు జైలుకు పంపలేదు?’’ అని పోసాని ప్రశ్నించారు.‘‘పని చేయని ప్రభుత్వాన్ని తిట్టేవాళ్లతో ప్రమాదం లేదు. ఓట్లు వేయించుకుని హామీలు నెరవేర్చని వాళ్లతోనే ప్రమాదం. అమ్మాయిలకు ముద్దు పెట్టాలి లేదా కడుపు అయినా చేయాలన్న బాలకృష్ణపై ఎందుకు కేసులు పెట్టలేదు?. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు టీవీ5కి ఇది కనిపించలేదా?. నిజాయితీ గల జర్నలిజం అయితే ఎస్సీల తరపున ప్రశ్నిచావా?. పవన్ కల్యాణ్ తల్లిని లోకేష్ ఘోరంగా తిట్టించాడు. ఈ మాట పవన్ కల్యాణే స్వయంగా చెప్పాడు. మరి లోకేష్, ఆయన అనుచరుల మీద ఎవరైనా కేసులు పెట్టారా?. వైఎస్ జగన్‌ను టీడీపీ నేత తిట్టినప్పుడు టీవీ5 ఏమైంది?’’ ’ అని పోసాని మండిపడ్డారు. -
సీఎం రేవంత్ కాంగ్రెస్‌ను ముంచుతున్నాడు: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం(నవంబర్ 12) జగదీష్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొడంగల్‌లో అధికారులపై జరిగిన దాడి రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నారు.కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు.నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు.ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతోంది.రాష్ట్రంలో మేధావులు కొడంగల్‌కు వెళ్లి రావాలి.కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదు.కొడంగల్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ అనడంలో ఆశ్చర్యం లేదు. 25సార్లు సీఎం రేవంత్ ఢీల్లి వెళ్లి ఎవరి కాళ్ళు మొక్కారో ప్రజలకు తెలుసు. ఉదయం రాహుల్ గాంధీ,కె.సి.వేణుగోపాల్ రాత్రి మోదీ,అమిత్ షా కాళ్ళు రేవంత్‌రెడ్డి పట్టుకుంటున్నారు.కేటీఆర్ ఢీల్లికి వెళ్ళింది కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికే.మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నుంచి రూ. 300 కోట్లు పంపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది బీఆర్ఎస్ నేతలకు నోటీసులిచ్చినా సమాధానమిస్తారు’అని జగదీష్‌రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్..మోదీ ఏం చేస్తున్నారు: కేటీఆర్ -
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్.. మోదీ ఏం చేస్తున్నారు?: కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: అమృత్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని.. అర్హత లేకపోయిన సీఎం బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు కేటాయించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. నేను ఢిల్లీలో ఏ బాంబులు పేల్చడం లేదు. దీపావళి ఎప్పుడో అయిపోయింది. తెలంగాణలో బాంబు అన్నారు. ఏం జరగలేదు. తెలంగాణ కేటాయించిన రూ. 8,888 కోట్ల పనులపై విచారణ జరిపించాలి. అమృత్ టెండర్లో సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారని కేంద్రానికి ఫిర్యాదు చేశాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.‘‘ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అమృతం పంచి.. కొండగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం ఢిల్లీకి వస్తాం.. దేశ ప్రజల దృష్టికి మీ మోసాలను తీసుకొస్తాం. మీ ఆరోపణల మీద మీకు నమ్మకం ఉంటే విచారణ జరిపించండి. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగతా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్’’ అంటే కేటీఆర్ చురకలు అంటించారు. -
ఢిల్లీ హీట్: అటు కేటీఆర్.. ఇటు రేవంత్.. గవర్నర్ కూడా..
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బయలేర్దారు. కాంగ్రెస్ పెద్దలను ఆయన కలవనున్నారు. మరో వైపు సీఎం రేవంత్‌పై కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. ఇద్దరు నేతలు ఒకే సమయంలో ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమృత్ పథకంలో స్కాం జరిగిందని కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో రేవంత్ ఢిల్లీ టూర్‌కు వెళ్లడంతో కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరినట్లు సమాచారం.కాగా, మరోవైపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఢిల్లీ పర్యటన కూడా ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సమయంలో గవర్నర్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్ ఢిల్లీ పర్యటన సస్పెన్స్‌గా మారింది. ఏసీబీ కేసు అనుమతి గురించి చర్చించేందుకా? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది. -
‘పాగల్ పాలనలో తిరగబడ్డ తెలంగాణ’.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, సాక్షి: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన విమర్శలు చేశారు. ఇందుకోసం.. వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఫార్మా కంపెనీ అభిప్రాయసేకరణ సందర్భంగా అధికారులపై గ్రామస్తులు జరిపిన దాడి సంగతిని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు.‘‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. ‘మా భూములు మాకేనని’.. కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది. కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి.... ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు, హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు, మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్ల నిరసన, ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం, ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం, ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర, కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు’’.. అంటూ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోందికుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుందిమా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుందిపసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుందికుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ… pic.twitter.com/liaE7n0Jvb— KTR (@KTRBRS) November 12, 2024ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. అమృత్ పథకంలో అవినీతి జరిగిందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవంత్ పై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి కేటీఆర్ కోరారు.ఇదీ చదవండి: తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా? -
అమృత్ టెండర్లలో సీఎం భారీ అవినీతి!: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ పథకం టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి రూ.1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారన్నారు. కేవలం సీఎం బావమరిది అనే ఒకే ఒక్క అర్హతతో ఇంత పెద్దఎత్తున పనులను కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని విమర్శలు సంధించారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి కేటీఆర్ కేంద్ర మంత్రి ఖట్టర్‌ను కలిసి అమృత్ టెండర్లలో జరిగిన స్కాంపై ఫిర్యాదు చేశారు. అనుభవం, అర్హత లేని కంపెనీకి.. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీ ‘శోధా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’రూ.1,137 కోట్ల పనులను దక్కించుకుందని కేటీఆర్ ఆరోపించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 2.20 కోట్ల లాభాన్ని చూపించిన కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు ఎలా కట్టబెడతారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటే తెర వెనుక భారీ అవినీతి బాగోతం నడిచిందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ఈ వ్యవహారంలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ మొత్తం ప్రాజెక్ట్‌లో 80 శాతం పనులను శోధా సంస్థకు అప్పగించిందన్నారు. ఈ టెండర్లలో సీఎం బావమరిది ప్రధాన భాగస్వామి అని తెలిపారు. ఆ నిబంధన కింద వేటువేయొచ్చు.. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా.. వారిపై వేటు వేయొచ్చని కేటీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా ఆయన ఉదహరించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గనుల కేటాయింపు, 1983లో బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు, 2005లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు, 2001లో జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, 2003లో దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా కేసులను కేటీఆర్ కేంద్రమంత్రికి వివరించారు. 2014లో హరియాణాలో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కేసులనూ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. టెండర్లలో చట్టవిరుద్ధంగా జరిగిన కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడే వణికితే ఎలా? కేంద్ర మంత్రి ఖట్టర్‌తో భేటీ నిమిత్తం కేటీఆర్ ఢిల్లీకి రాగా.. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీకి వెళ్లారంటూ రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి కేటీఆర్ తన ‘ఎక్స్’ఖాతా ద్వారా స్పందించారు. ‘జస్ట్ ఇప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రకంపనలు వస్తున్నాయని విన్నాను. అప్పుడు వణికిపోతే ఎలా?’అంటూ పోస్ట్ చేశారు. -
‘గుంతలు లేని రోడ్లు కోసం వ్యూహాత్మక ప్రణాళిక’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరుకు ప్రయత్నించలేదన్నారు.గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్లు కేసీఆర్ రూలింగ్ చేశారని, తాము ఇప్పుడు రహదారుల మరమ్మత్తుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులపై గుంతలు పూడుస్తామన్నారు. -
‘అమృత్’ స్కామ్.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం(నవంబర్ 11) ఢిల్లీ వెళ్లారు. తెలంగాణలో అమృత్ టెండర్లలో స్కామ్ జరిగిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సూదిని సృజన్‌రెడ్డికి చెందిన శోద కంపెనీకి రూ.1100 కోట్ల రూపాయల టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టారని ఫిర్యాదులో తెలిపారు. రూ.2 కోట్ల లాభం కూడా లేని కంపెనీకి ఇంత పెద్ద టెండర్ ఇవ్వడం వెనుక ఏదో గోల్మాల్ జరిగిందన్నారున. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. టెండర్లు రద్దు చేయాలన్నారు.కాగా, గతంలో అమృత్ స్కామ్‌పై కేటీఆర్ మీడియా సమావేశాలు పెట్టి సీఎం రేవంత్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో బీజేపీ నేతలు కూడా రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: కేసీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్లు -
కేసీఆర్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇటీవల ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం(నవంబర్ 11) ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడాారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడని, ఆయన ఇంట్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని పరోక్షంగా కేసీఆర్‌కు రేవంత్ చురకంటించారు.‘ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఒక కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతోంది.21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు.35వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం,ప్రగతి భవన్ కట్టుకుండు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం.ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం.త్వరలో వారికి నియామకపత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవన్నీ చేసాం.మీరు లేకపోయినా ఏం బాధలేదు.మీతో ప్రజలకేం పని లేదు.తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి.బడి దొంగలను చూసాం కానీ..ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. -
కులగణనపై కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి: పొన్నం
హైదరాబాద్, సాక్షి: బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ పార్టీ గండికొట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీల లెక్క తెలియకపోవటంతో స్థానిక సంస్థల ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘సుప్రీం కోర్టు నియమాల ప్రకారమే బీసీ గణన జరుగుతుంది. కులగణనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం నేరుగా చెప్పాలి. కుల గణన వద్దంటున్నారా నేరుగా చెప్పండి కేటీఆర్. కులగణన సామాజిక బాధ్యతగా జరుగుతోంది. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతున్నది. బీఆర్ఎస్ మాదిరి రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు పని చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పదవులు కుటుంబ సభ్యులకే. బీఆర్ఎస్ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పదవులు ఇచ్చి అప్పుడు మాట్లాడాలి. అంతవరకు బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానుకోవాలి. బీఆర్ఎస్లో బావ, బావమరిది మాత్రమే మాట్లాడాతారా? ఎవరికీ మాట్లాడే స్వేచ్ఛ లేదా?. బీఆర్ఎస్ ఒక నియంతృత్వ పార్టీ’’ అని అన్నారు. -
మహారాష్ట్రలో లబ్ధి కోసమే ఇక్కడ కులగణన డ్రామా
హనుమకొండ/యాదగిరిగుట్ట రూరల్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. కులగణనలో ఆస్తులు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఆదాయం వంటి వివరాలు ఎందుకంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి ఏడాది అవుతున్నా దానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలవుతున్నా దానిని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారని, ఏ ఒక్కరికైనా బోనస్ ఇచ్చినట్లు చూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించాలా..? విజయోత్సవాలు నిర్వహించాలా అనే ఆలోచన చేస్తున్నారని, వారు విజయోత్సవాలు నిర్వహిస్తే.. తాము కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.రేవంత్‌రెడ్డి రాగానే బీసీబంధు, రైతుబంధు, దళితబంధు.. ఇలా అన్నీ బందయ్యాయని కేటీఆర్ అన్నారు. కులగణన పూర్తయిన తర్వాత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ బాంబులు.., ఆ బాంబులు పేలుతాయంటున్న ఆ మంత్రి ఏ ఒక్క బాంబు పేల్చేది లేదని, ఆయన ఏ మంత్రి ఏమోకాని బాంబుల మంత్రి అని పేరు పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అధైర్యపడొద్దు.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సారే రైతులు అధైర్యపడవద్దని, మళ్లీ కేసీఆర్ సారే వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు వెళ్తుండగా, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం వద్ద ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలసి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చొల్లేరు గ్రామానికి చెందిన తోటకూరి వెంకటమ్మ అనే వృద్ధురాలు కేటీఆర్ వద్దకు వెళ్లి.. ‘కేసీఆర్ సారు పాలననే బాగుండేది, మాకు రైతుబంధు క్రమం తప్పకుండా వేసేవాడు, ఆ డబ్బులతో వ్యవసాయం చేసుకుని సంతోషంగా ఉండేవాళ్లం, ఇప్పుడు రైతుబంధు రావడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం’అని అన్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బాధపడవద్దని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవుతారని భరోసా ఇచ్చారు.పగ నామీదే అయితే పదవిని వదిలేస్తా: కేటీఆర్సిరిసిల్లటౌన్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నామీద పగ ఉంటే.. సిరిసిల్ల ఎమ్మెల్యే పదవిని రేపే వదిలేస్తా’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 నెలల్లో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారని, ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలని, చేనేత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లలో శనివారం ఆత్మహత్యకు పాల్పడిన నేత దంపతులు బైరి అమర్నాథ్, స్రవంతి పిల్లలు లహరి, శ్రీవల్లి, దీక్షిత్నాథ్లను ఆదివారం ఆయన పరామర్శించారు. పిల్లలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సర్కారు సిగ్గు తెచ్చుకోవాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, కేసీఆర్ కిట్ల ఆర్డర్లు రాక సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చేదాకా బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు -
మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ డబ్బు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డబ్బును మహారాష్ట్రకు పంపే పనిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని.. కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికల కోసం డబ్బులు రేవంతే సమకూర్చుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణలో రుణమాఫీ చేశామని, రైతు బంధు, వరికి బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మీద ఉన్న వడ్ల కుప్పలే రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, గాలిమోటార్లలో రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీఎం రేవంత్ నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. ఆ అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారు. తెలంగాణలో మోసం చేసినట్టు అక్కడి ప్రజలనూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాల కల్పనపై మహారాష్ట్రలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విద్యార్థులను వీపులు పగలకొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్‌దే. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అవాస్తవాలు చెప్పారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 42 లక్షల మందికి రూ.31 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపారు. ఇంకా 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. తెలంగాణలో పోలీసు కానిస్టేబుళ్లు రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. గ్యారంటీలు గ్యారేజ్‌కు పోయాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు గెలిచాక గ్యారేజీకి పోయాయి. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు. ఏ హామీలు అమలు చేశారో, ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. బహిరంగ చర్చకు నేను సిద్ధం. మహిళలకు అభయ హస్తం ఏదీ? మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని అభయ హస్తంలో చెప్పిన మొదటి హామీకే దిక్కులేదు. మహారాష్ట్రలో మాత్రం కోతలు కోస్తున్నారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.27,500 బాకీ ఉంది. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, రైతుకూలీలకు రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారింది. సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారు. ఇప్పుడా గాం«దీలు ఎక్కడికి పోయారో తెలియదు. రైతుల ధాన్యం కొనేదెవరు? రాష్ట్రంలో మద్దతు ధరకు వరి ధాన్యం కొనకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. క్వింటాల్ వడ్లు రూ.1,900కే వడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు రోడ్లపై వరికుప్పలే సాక్ష్యం. పైగా బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో బోగస్ మాటలు మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పారు. ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు మాట్లాడలేదు. పైగా కేసీఆర్ ఇచ్చనా ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్‌ను రక్షించాలి
సాక్షి, హైదరాబాద్: అదానీ, అంబానీ లాంటి నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ రాష్ట్రానికి విముక్తి కల్పించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జార్ఖండ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాని ఆయన ప్రజలను కోరారు. ఆదివారం భట్టి జార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం, చిత్తార్పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాట్లాడుతూ, కొద్ది మంది పెట్టుబడిదారుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, చైతన్యంగల కాంగ్రెస్ కార్యకర్తలు జార్ఖండ్ రాష్ట్రాన్ని, వనరులను దోపిడీదారుల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలో విద్వేషం ఉండకూడదని, సంపద అందరికీ సమానంగా పంచాలని రాహుల్ గాంధీ ఇచి్చన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని కోరారు. అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇండియా కూటమి హామీలను, మేనిపెస్టోను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఏఐసీసీ నేతలు గులాం అహ్మద్మీర్, సిరివెళ్ల ప్రసాద్, జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశవ్ కమలేశ్ మహతో, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తారిఖ్ అన్వర్లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
బీసీ డిక్లరేషన్ హామీలు ఎటు పోయాయి?: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హన్మకొండ: బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి?ఎటు పోయాయి? అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ఆదివారం ఆయన హన్మకొండలో మాట్లాడుతూ.. ఏడాది కింద ఇదే రోజు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ పేరిట చాలా వాగ్ధానాలు ఇచ్చారు. కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు ఉన్న పథకాలు తీసేసింది.’’ అని మండిపడ్డారు.‘‘కాంగ్రెస్ పార్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ బంధుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాతర వేసింది. కుల గణన కోసం ఇళ్లకు వెళ్తున్న అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని అడుగుతుంటే అధికారులు నీళ్లు నములుతున్నారు. అడ్డమైనా హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను ఇబ్బందులకు గురిచేస్తోంది. బీసీ ఓట్ల కోసం.. కులగణనతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరతీసింది. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదు. బీసీ డిక్లరేషన్‌తో కాంగ్రెస్ వెన్నుపోటు పొడుస్తుంది. మహారాష్ట్రలో సీఎం రేవంత్ తెలంగాణకు 500 బోనస్ ఇచ్చామంటూ బోగస్ మాటలు మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాడదాం’’ అని కేటీఆర్ చెప్పారు.ఇదీ చదవండి: ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా! -
సీఎం రేవంత్ మహారాష్ట్రలో చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్:హామీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు సవాల్ విసిరారు.ఆదివారం(నవంబర్ 10) తెలంగాణభవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘మహారాష్ట్రలో కూడా సీఎం రేవంత్ అబద్ధాలాడుతున్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకైనా బోనస్ వచ్చిందా. రైతుబంధు ఇవ్వడం లేదని రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలో ఎందుకు చెప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలి.రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ అయిందని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కట్టలేదు.ఉన్న ఇళ్లు కూలగొట్టింది’అని హరీశ్‌రావు విమర్శించారు.ఇదీ చదవండి: ఎనుముల వారి ఏడాది ఏలికలో తెలంగాణలో బతుకులు చీలికలు పీలికలే: కేటీఆర్ -
‘ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు వీటిని నిర్వహించనుంది. అయితే ప్రజా విజయోత్సవాలపై.. ’‘ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే’’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.కేటీఆర్ ట్వీట్లో ఏమన్నారంటే?‘‘కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ? ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే..!! కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా ?ఎనుముల వారి ఏడాది ఏలికలో.. తెలంగాణ బతుకు చీలికలు, పీలికలే..!!కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా”. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో… pic.twitter.com/3snHneVYc5— KTR (@KTRBRS) November 10, 2024 కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సింది విజయోత్సవాలు కాదు.. “కుంభకోణాల కుంభమేళా”. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి పాతరేసిన నేపథ్యంలో జరపాల్సింది విజయోత్సవాలు కాదు.. ప్రజావంచన వారోత్సవాలుఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట..! కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట..!! బావమరిదికి అమృత్ టెండర్లను, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు.. “కరప్షన్ కార్నివాల్”ఏడాది కాలంగా ప్రతిరోజూ పరిపాలనా వైఫల్యాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు. సకల రంగాల్లో సంక్షోభం తప్ప సంతోషం లేని సందర్భాలకు చిరునామా రేవంత్ పాలన. మరి, ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారు.ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలుచేయకుండా జనం పైసలతో 25 రోజులపాటు జల్సాలు చేసుకుంటారా ?రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం అందక పేద రైతులు దుఖంలో ఉంటే మీరు వందల కోట్లతో విజయోత్సవాలు చేసుకుంటారా? హైడ్రా, మూసీ బాధితులు బాధలో ఉంటే మీరు బాజాభజంత్రీలతో పండుగ చేసుకుంటారా? ఆడబిడ్డలు రక్షణ లేక అల్లాడుతుంటే మీరు విజయోత్సవాల పేరిట విర్రవీగుతారా? వృద్ధులు పింఛన్ల పెంపు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే మీరు దయలేకుండా దావత్ లు చేసుకుంటారా ?బీఆర్ఎస్ భర్తీచేసిన ఉద్యోగాల ప్రక్రియను మీ ఖాతాలో వేసుకోవడం నయవంచన కాదా? పావుశాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండా వందశాతం చేశామని చెప్పుకోవడం దగా కాదా ? 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్ పథకాలకు సవాలక్ష ఆంక్షలు పెట్టి మెజారిటీ అర్హులను దూరం చేయడం మోసం కాదా ?75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో అతితక్కువ సమయంలో అత్యధిక ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న తొలి ప్రభుత్వం, ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఇదే.ఈ ముఖ్యమంత్రికి పాలనపై పట్టు కాదు.. ఈ ప్రభుత్వానికి తెలంగాణపై ప్రేమలేదు. పేదల ఇళ్లు కూల్చి రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కారుకు అసలు మనసే లేదు. విజయోత్సవాలు అంటే ఏంటో కూడా తెలియని ఈ అసమర్థ పాలకులకు ఆ పదాన్ని వాడే హక్కే లేదు. -
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ దుష్ప్రచారం
సాక్షి ముంబై: ప్రధాని మోదీతోపాటు మహారాష్ట్రలో ని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపడుతున్న రేవంత్.. ఇందులో భాగంగా శనివారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతోపాటు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోనంత వరకు తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలు విషయంపై నిజాలు చెప్పేందుకు వచ్చినట్లు రేవంత్ చెప్పారు. అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే..దేశంలోకెల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోవడం వల్లే మహారాష్ట్రలో రైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచి్చన 25 రోజుల్లోనే 22.22 లక్షల మంది రైతులకు రూ. 17,869 కోట్ల రుణమాఫీ, 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 50 లక్షల మంది పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు రేవంత్ వివరించారు. 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్‌కు తరలించారుమహారాష్ట్రకు రావల్సిన 17 మెగా ప్రాజెక్టులు ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారని రేవంత్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. అంబేడ్కర్ సహా దేశ ప్రగతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర జన్నించిందని గుర్తుచేశారు. ప్రజలను మోసగించిన బీజేపీ కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అమీన్ పటేల్‌ను గెలిపించండి... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ముంబై ముంబాదేవి నియోజకవర్గంలో తెలంగాణవాసులు ఎక్కువగా ఉండే కమాటిపురాలో రోడ్ షో నిర్వహించారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముంబాదేవిలో మూడుసార్లు గెలిచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌ను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణవాసులకు అండగా ఉంటామన్నారు. -
ఆరు గ్యారంటీలు.. రేవంత్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రలో రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలేనంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలుపై తెలంగాణలో పాదయాత్ర చేసే దమ్ముందా?. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?’’ అంటూ విమర్శలు గుప్పించారు.కరీంనగర్లో కార్యకర్తలతో కలిసి ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసోళ్లను కూడా నక్సలైట్లు దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా?. సభ్య సమాజానికి ఏం సంకేతాలు పంపుతున్నట్లు?. తక్షణమే విద్యా కమిషన్‌ను రద్దు చేయాలి. ప్రజాస్వామ్యవాదులారా.. కమిషన్ రద్దు కోసం రోడ్డెక్కండి. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎఫ్పుడో మర్చిపోయారు?. జనం కష్టాల్లో ఉన్నా ఫాంహౌజ్‌కే పరిమితమైనోడిని లీడర్‌గా గుర్తిస్తారా?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్ -
మాకు మాటలు రావనుకుంటున్నారా?.. అరెస్టులకు భయపడం: కేసీఆర్
సిద్ధిపేట, సాక్షి: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ నేతల వద్ద ధీమా వ్యక్తం చేశారాయన. అదే సమయంలో రేవంత్ సర్కార్‌ను ఉద్దేశించి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారాయన.శనివారం పాలకుర్తి నియోజకవర్గ నేతలు ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదు. ఏం కోల్పోయారో రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చింది. మళ్లీ ప్రభుత్వంలోకి రాబోయేది మనమే(బీఆర్ఎస్). రాబోయే ఎన్నికల్లో వంద శాతం విజయం మనదే’’ అని అన్నారు. అలాగే.. .. ‘‘ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైంది. అది చేస్తాం.. ఇది చేస్తాం అని పిచ్చి మాటలు మాకు రావా?. కానీ, మేం మా మేనిఫెస్టోలోచ్చిన హామీల కంటే 90 శాతం ఎక్కువగా అడగకుండానే చేశాం. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా?. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారు. కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది వాళ్లకు సేవ చేయడానికి. మాకు మాటలు రావనుకుంటున్నారా?. ఇవాళ మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. రౌడీ పంచాయితీలు చేయడం మాకూ వచ్చు. అరెస్టులకు భయపడేది లేదు’’ అని కాంగ్రెస్ సర్కార్‌ను, సీఎం రేవంత్‌ను ఉద్దేశించి కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: కేసీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు: కౌంటర్ ఇలా.. -
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘‘ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడి చేయడం ఇందిరమ్మ రాజ్యమా?.’’ అంటూ ఆయన మండిపడ్డారు.పెద్దల మెప్పు కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తే మేం వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి అంటే రేవంత్‌కు భయం పట్టుకుందని.. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. -
కేసీఆర్‌పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్‌రావు
సాక్షి,మెదక్‌జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం(నవంబర్ 9) నర్సాపూర్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన మంత్రులు, ముఖ్య మంత్రి గాలిమెటార్లలో తిరుగుతున్నారు. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్,తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్‌రెడ్డి నోటీ కంపు ఎక్కువ. కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం’అని హరీశ్‌రావు అన్నారు. కాగా, మూసీ పాదయాత్ర సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్ -
ప్రధాని ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్
సాక్షి,ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 9)రేవంత్‌రెడ్డి ముంబైలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ‘ప్రధాని మోదీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు.మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా.దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోదీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. ఆ తర్వాత ప్రధాని తన ట్వీట్ ను డిలీట్ చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.500లకే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నారు.వరికి రూ.500 మద్దతు ధర అందిస్తున్నాం. కోటి 4 లక్షల మంది మహిళలు ఈ పది నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారు. ఇందుకోసం రూ.3541 కోట్లు ఆర్టీసీకి మా ప్రభుత్వం అందించింది.సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం.ఎంతో ఘనత ఉన్న మహారాష్ట్ర ఎవరి చేతుల్లోకి వెళ్లకూడదు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు మోదీ గుజరాత్‌కు తరలించుకొని పోయారు.మిమ్మల్ని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించండి’అని రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం -
హైదరాబాద్‌లోనే ఉన్నా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి గారూ.. అరెస్టు భయంతో మలేసియాకు పారిపోయానంటూ మీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా.. ఏసీబీలాంటి మీ ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా స్వాగతం పలుకుతా. వారికి చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా. మీ బర్త్‌డే సందర్భంగా వారు కేక్ కట్ చేస్తానంటే నేను ఇప్పిస్తాను’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ‘ఎక్స్’లో సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేశారు. ‘సీఎంకు హ్యాపీ బర్త్‌డే.. నా అరెస్టు కోసం ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో మీరు ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’అంటూ సంబోధించిన సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టగలరా. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నుంచి ఆంధ్రా కాంట్రాక్టర్‌ను తొలగించే దుమ్ముందా. సీఎం హోదాలో ఒక కాంట్రాక్టు సంస్థకు గులాంగిరి చేస్తున్నావా’అని కేటీఆర్ మండిపడ్డారు. పుండు ఒక చోట.. మందు మరోచోట‘మూసీ ప్రాజెక్టు బాధితులను పట్టించుకోకుండా మరోచోట సీఎం పాదయాత్ర చేస్తూ పుండు ఒక చోట అయితే మందు మరోచోట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వేల ఇళ్లను కూల్చివేసేందుకు ప్రణాళికలు వేసి..లక్షలాది మందిని నిరాశ్రయులను చేసే ప్రణాళిక వేసిన సీఎం దొడ్డిదారిన మరోచోట పాదయాత్ర డ్రామా చేస్తున్నారు. లక్షలాది మంది ఆక్రందనలకు కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేసే ధైర్యం, చిత్తశుద్ధి సీఎంకు లేదు. దశాబ్దాలపాటు వ్యర్థాలు కలుస్తుంటే అరవై ఏళ్లు కళ్లుండీ చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ వ్యవహరించింది. మూసీ దోపిడీ ప్రాజెక్టు కన్సల్టెంట్లతో మూడురోజుల పాటు చర్చించే సమయం సీఎంకు ఉంది. కానీ ఆరు గ్యారంటీల అమలుపై సమీక్షించేందుకు సమయం లేదా. మోసపూరిత హామీలను పక్కన పెట్టి కమీషన్ల కోసం మూసీ ప్రాజెక్టును నెత్తిన పెట్టుకున్నారు. పాదయాత్ర చేసినా పొర్లుదండాలు పెట్టినా మూసీ పరీవాహక ప్రాంత ప్రజల వేదన మీకు శాపంగా మారుతుంది’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నల్లగొండ నేతల అరెస్టు అక్రమంముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురి చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, హామీల అమలులో వైఫల్యంపై ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు.