breaking news
-
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్‌గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.‘ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.తెలంగాణ వైపు దేశం చూపు..బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది..బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు. -
రాష్ట్రపతిని కలిసేదాకా ఇక్కడే ఉంటాం: లగచర్ల బాధితులు
న్యూఢిల్లీ, సాక్షి: లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే..ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. లగచర్ల లో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరింది. దీంతో బలవంతపు భూ సేకరణ ఘటన, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రపతి ని కలసి తమ గోడు వినిపించాలని.. అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్నారు. దీంతో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్
సాక్షి,ముంబై: పదకొండేళ్ల పాలన తర్వాత కూడా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ఒక్క విజయగాథ లేదని సీఎం రేవంత్ విమర్శించారు. వారికి చెప్పుకోవడానికి ఏమీ లేకనే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ సోమవారం పుణెలో మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాక కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని.. అదే తాము రైతులకు రుణమాఫీ చేస్తే బీజేపీ నేతలు ప్రశ్నించడం ఏమిటని నిలదీశారు.హామీలు అమలు చేశాం.. వచ్చి చూడండితెలంగాణలో కాంగ్రెస్ హామీల అమలు విషయంలో ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘‘ఇచ్చిన హామీలన్నింటిలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లలోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసింది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నేను మోదీకి సవాల్ విసురుతున్నాను. కేంద్ర మంత్రి లేదా కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి. మేం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్న వివరాలన్నీ వారికి ఇస్తాం. అవసరమైతే వారు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన ఖర్చులు కూడా మేమే భరిస్తాం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. మంగళవారం బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు వస్తే సచివాలయంలో కూర్చోబెట్టి నేను చెప్పిన ప్రతి అంశంపై వివరాలు అందజేస్తా. అందులో ఏవైనా తప్పులు ఉంటే క్షమాపణలు చెబుతా..’’ అని చెప్పారు. తమ గ్యారంటీలన్ని ఖచ్చితమైనవని, మోదీలా విఫల హామీలు కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని.. భారతీయ జూటా (అబద్ధాల) పార్టీ అని అభివర్ణించారు. -
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ చార్జిషీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై చార్జీషీట్లు విడుదల చేయాలని.. వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నెల (డిసెంబర్) 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో... డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రైతులు, మహిళలు, యువత, ఇతర వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటి, వాటిని సరిగా అమలు చేయని తీరుపై నియోజక వర్గ, మండల, గ్రామ స్థాయిల్లో వివిధ రూపాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్ నగర శివార్లలోని బొంగులూరులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్‌షాపులో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో చార్జిషీట్లు..కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, నియోజక వర్గాల స్థాయిల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇచ్చిన ఇతర హామీల అమల్లో వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ భావిస్తోంది. డిసెంబర్ 1న రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో ఈ మేరకు చార్జిషీట్లను విడుదల చేయనుంది. దీనితోపాటు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వం హామీ లు, అమలు చేయని తీరును తెలుపుతూ జిల్లా కలెక్టర్లు మొదలు తహసీల్దార్ల దాకా మెమోరాండాలు సమర్పించనున్నారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో మండలాల్లో మోటర్ సైకిల్ యాత్రలు... 4, 5 తేదీల్లో యువ, మహిళా, కిసాన్ తదితర మోర్చాల వారీగా ప్రచార కార్యక్రమాలు చేపడతారు.తొలుత పాదయాత్రలు చేయాలనుకున్నా..కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టేలా డిసెంబర్ 1 నుంచి 7 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ తొలుత నిర్ణయించింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉన్నందున.. ఇప్పుడే పాదయాత్రలు వంటివి చేపట్టడం కంటే వికేంద్రీకరణ పద్ధతుల్లో కార్యాచరణ ప్రణాళిక చేపట్టడం మంచిదనే ఆలోచనకు వచ్చినట్టు బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. తొలుత సంస్థాగతంగా బలపడటంపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించారు. బీజేపీ వర్క్‌షాపులో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి,ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు.‘6 గ్యారంటీలు కాదు.. 6 అబద్ధాలు’ పేరిట కరపత్రాలురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలతో ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శిస్తూ కరప త్రాలు పంపిణీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. వాటిలో మహిళలకు నెలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి పథకంలో అదనంగా తులం బంగారం, ఇతర హామీల అమలు నుంచి వెనక్కి వెళ్లడం, రైతుభరోసా, రూ.4 వేల నిరుద్యోగ భృతి జాడ లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించనుంది. ఇక ఈ నెలాఖరుకల్లా రాష్ట్రంలో పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుని.. తర్వాత మండల, జిల్లా కమిటీల ఎన్నికలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. డిసెంబర్ 25 నాటికి రాష్ట్ర కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. -
రేవంత్ హిట్ వికెట్
తుర్కయాంజాల్: పేదల ఇళ్ల జోలికెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి హిట్ వికెట్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని జేబీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ చాంపియన్ ట్రోఫీ– 2024 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి హరీశ్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క పేదవాడి ఇల్లు కూల్చకుండానే తాము అభివృద్ధి చేశామన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ సెల్ఫ్ బౌల్డ్ అయిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కళాశాలల యాజమా న్యాలు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే.. 8 శాతం కమీషన్ అడుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకేఒక్కడు కేసీఆర్: హరీశ్ రావు‘సహజంగా ఎవరైనా పవర్లో ఉన్న పార్టీ కోసం సినిమా తీస్తారు. కానీ, అధికారంలో లేకపోయినా కేసీఆర్‌పై సినిమా తీశాడంటే అది రాకేష్‌లో ఉన్న ప్రేమ అనుకోవచ్చు, లేకుంటే దమ్ము, ధైర్యం అనుకోవచ్చు. ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకేఒక్కడు కేసీఆర్. ఆ అవకాశం ఇంకొకరికి లేదు’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్) ప్రీ రిలీజ్ వేడుకలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘కేసీఆర్‌పై రాకేష్ ఒక అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు. రజనీకాంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.. 22 ఏళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను.. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని అన్నారు. అంటే కేసీఆర్‌గారు పల్లెల్నీ అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌నీ అభివృద్ధి చేశారు.’ అని చెప్పారు. -
‘నీ అక్రమ అరెస్టులు, ఉడత బెదిరింపులకు భయపడం’: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్‌ను సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా హెడ్‌గా కొణతం దిలీప్ వ్యవహారించారు.అయితే,కొణతం దిలీప్ కుమార్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కేటీఆర్ ఏమన్నారంటే ప్రశ్నిస్తే సంకెళ్లు...నిలదీస్తే అరెస్టులు..నియంత రాజ్యమది...నిజాం రాజ్యాంగమిది..కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారి అరెస్ట్ విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా?ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావ్!ప్రజాస్వామ్య…— KTR (@KTRBRS) November 18, 2024 -
కొడంగల్‌లో మణిపూర్ తరహా ఘోరాలు: కేటీఆర్
సాక్షి,న్యూఢిల్లీ: వికారాబాద్ జిల్లా లగచర్లలో అర్థరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో సోమవారం(నవంబర్18) లగచర్ల ఫార్మాసిటీ బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. మణిపూర్ తరహాలో కొడంగల్‌లో అత్యాచారాలు: కేటీఆర్సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్‌లో గిరిజనులను బెదిరిస్తున్నాడులగచర్లలో గిరిజనులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారుఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా ?పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదుమణిపూర్ తరహాలోనే కొడంగల్ లో అత్యాచారాలు జరుగుతున్నాయిరాజ్యాంగ రక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ ఈ అంశంపై నోరు విప్పాలిగిరిజనుల గోడు వినాలని సీఎం రేవంత్ ను రాహుల్ ఆదేశించాలిగిరిజనుల భూమి లాక్కుంటున్నా రాహుల్, మల్లికార్జున ఖర్గే నోరు మెదపడంలేదుఉపన్యాసాలతో కాకుండా చేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలిప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది:లగచర్ల ఫార్మా బాధితులురేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే, మమ్మల్ని రోడ్డు మీదకు తెచ్చారుతొమ్మిది నెలలు నుంచి ధర్నాలు చేస్తున్నాంకలెక్టరు కాళ్ళు మొక్కినం అయినా మా గోడు వినడం లేదుమా భూముల జోలికి రావొద్దుమా వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలిరాత్రి పూట పోలీసులు వచ్చి పిల్లల్ని పట్టుకుపోయారుమా ప్రాణం పోయినా ఫర్వాలేదు, భూమి ఇచ్చే ప్రసక్తి లేదుమా గ్రామాల్లోనే ఎందుకు ఫార్మ కంపెనీ పెడుతున్నారుభూమి పై ఆధారపడి బతుకుతున్నాంమమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారుఫార్మా కంపెనీలు వల్ల కాలుష్యం పెరిగి మా బతుకులు మసి చేస్తున్నారురైతులను రోడ్డుపైకి ఈడుస్తున్నారునాపై దాడి జరగలేదని కలెక్టరే అన్నారుమహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారుపోలీసులను శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి -
డీకే అరుణ లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత
సాక్షి,వికారాబాద్‌జిల్లా:మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సోమవారం(నవంబర్ 18) చేపట్టిన లగచర్ల పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీకే అరుణ పర్యటనను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకేఅరుణ మాట్లాడుతూ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా..? ఒక ఎంపీ గా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా..? కొడంగల్ రేవంత్ రెడ్డి జాగిరా..?ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా రైతులను కొడుతున్నారు. నా నియోజకవర్గంలోకి వెళ్లనీయకుండా నన్ను అడ్డుకుంటారా’అని డీకేఅరుణ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశారు. -
కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారంనారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాంమూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారుమూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయిరేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారువరంగల్కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందిఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంమొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాంఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్హైదరబాద్తో పాటు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాంహైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాంఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయికేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాంవర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదురీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదురీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాంశ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం -
బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ సోషల్‌మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు సోమవారం(నవంబర్ 18) అరెస్టు చేశారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారన్న కారణంగా దిలీప్‌ను అరెస్టు చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్‌ను అరెస్టు చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా ఆస్పత్రితో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. కొణతం దిలిప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్‌కు తొలి డైరెక్టర్‌గా పనిచేశారు.ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు సరికాదు: హరీశ్‌రావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎక్స్(ట్విటర్)లో పెట్టిన పోస్టుకు సంబంధించిన కేసులో దిలీప్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ అరెస్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. -
హరీశ్‌రావు పక్కచూపులు చూస్తున్నారు: పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్‌గౌడ్ సోమవారం(నవంబర్ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. హరీశ్‌రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్,కేటీఆర్,కవితలేనని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు.మహేష్‌కుమార్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే...కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదుసీఎం రేవంత్‌ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసుమీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాంజనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాంస్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలిఅధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయిబీజేపీ,బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయికార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందికార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేమరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలికేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందిబంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందికాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయికాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదుహరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండిమేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాంవచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదుహరీశ్రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడుచివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు -
కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎక్కువ సార్లు ప్రజలను మోసం చేయలేరు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతల గాలి మాటలతో ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు పెద్ద తేడా ఏమీలేదన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలింగ్ బూత్ కమిటీల ఎన్నిక ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలి. సాధారణ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు సమాచారం ఇచ్చిన తర్వాతే పోలింగ్ బూత్ కమిటీ వేయాలి. పోలింగ్ బూత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నేతల వ్యక్తిగత ఇష్టాలకు తావులేకుండా అందరి ఆమోదంతో బూత్ కమిటీలు వేసుకోవాలి. క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పార్టీ పదవులు. పార్టీ కోసం సమయం కేటాయించి పనిచేసే సమర్ధులకు కమిటీల్లో అవకాశం ఇవ్వాలి. 30 శాతం కొత్త వారికి పార్టీ మండల కమిటీల్లో ఛాన్స్ దక్కేలా చూడాలి.రాష్ర్టంలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడా ఏమీ లేదు. గాలి మాటలతో ప్రజలు విసిగిపోతున్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. రెండు పార్టీ నేతల మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. బాధ్యతారహితంగా ఇరు పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి ?కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటలీకి గులాం. కిషన్ రెడ్డి ఎవరికి గులాం కాదు.. భారతీయులకు మాత్రమే గులాం. నా తెలంగాణను నిజాం నుంచి కాపాడిన గుజరాత్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నేను గులాంనే. కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీలకు గులాంలు. వ్యక్తిగతంగా బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయి. తాత్కాలికంగా ప్రజలు వారికి జై కొట్టవచ్చు. ఎక్కువసార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరు. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసే వారికే ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణలో ఉన్నంత దిగజారుడు రాజకీయాలు మరే రాష్ట్రంలో లేవు. మూడు వందల రోజులు పూర్తయినా.. హామీల అమలు చేయగలరా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని కామెంట్స్ చేశారు. -
రేవంత్ సోదరుడి అరాచకాలు ఎక్కువయ్యాయి: ఎంపీ ఈటల
సాక్షి, సంగారెడ్డి: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామ బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి, థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో అరెస్ట్ చేసిన బాధిత రైతులను సెంట్రల్ జైలులో సోమవారం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి పరామర్శించారు.ఈ ఘటనకు స్కెచ్ వేసింది కాంగ్రెస్ వాళ్లే..ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని రైతులపై దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని.. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని చెప్పారు.రైతులకు సంకెళ్లు వేయడం కరెక్ట్ కాదు..‘సీఎం రేవంత్ సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయి. నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతులకు సంకెళ్లు, తర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్. గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుంది. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఉరుకోం’ అని ఈటల హెచ్చరించారు.కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు: ఎంపీ డీకే అరుణలగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వబోమని రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తున్నారని అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారని, ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని తెలిపారు. వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు.పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారని, భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని ఆరోపించారు.ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని.. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని తెలిపారు.సీఎం సోదరుడు వెళ్లొచ్చు గానీ మేము వెళ్లొద్దా?భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారు. జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా?సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్? కొడంగల్ వాసులు కాదు.. సీఎం వలస వచ్చారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలి. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణం. సీఎం రేవంత్ అహంకారం వీడాలి.. ఒప్పించి భూములు తీసుకోండి’ అని డీకే అరుణ పేర్కొన్నారు. -
రాజయ్య Vs కడియం: ‘ఎవరో ఒక్కరే ఉండాలి అంటూ..’
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం మరోసారి వేడెక్కింది. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నేత రాజయ్య మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీహరి వ్యాఖ్యలపై రాజయ్య స్పందిస్తూ ప్రతి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.సీనియర్ నేతలు కడియం, రాజయ్య మధ్య రాజకీయం మరోసారి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి.. నేనైనా ఉండాలి అంటూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య స్పందించారు. ఈ క్రమంలో రాజయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కడియం సవాలును స్వీకరిస్తున్నాను. కడియం శ్రీహరి స్థానికేతరుడు. దళిత వ్యతిరేకి. ఆయన్ను పర్వతగిరి పంపించే వరకు నేను నిద్రపోను. నియోజకవర్గంలో నువ్వో నేనో.. ఎవరో ఒక్కరే మిగలాలి.కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడ్ని అడ్డం పెట్టుకొని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా?. నీ భూ కబ్జాలు నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు నిజంగా సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీ చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు?. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. శ్రీహరికి నాకు పోటీనే లేదు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కడియం శ్రీహరి ప్రజానాయకుడు కాదు.. రాజకీయ నాయకుడు మాత్రమే’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
గురుకులాల్లో మృత్యుఘోష
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఒక ప్రకటనలో ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో విద్యారి్థని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభు త్వం చోద్యం చూడడం శోచనీయమని విమర్శించా రు. వాంకిడిలోని గురుకుల పాఠశాల విద్యారి్థని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని, బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యారి్థని బలవన్మరణానికి కారణం ఎవర ని ప్రశ్నించారు. గత 11 నెల ల్లో సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకు దిగజారిపోతున్నా యని అన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖతోపాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖల నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. -
‘మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్-బీజేపీలపై మండిపడ్డారు.‘ వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?,లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?,హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము!,రేవంత్‌ను మొదటి అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? ,రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు.. మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ ట్వీట్ చేశారు.రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయంవారెవా తోడు దొంగల నాటకం!కిషన్ రెడ్డి గారూ..ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…— KTR (@KTRBRS) November 17, 2024 -
మూసీ నిద్రకు ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా?: మంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి,హైదరాబాద్:పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్17) మీడియాతో మాట్లాడారు.‘నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు,మస్కిటో కాయిల్స్ అవసరమా..? కిషన్‌రెడ్డి నిజాయితీగా నిద్రకు వెళితే మూసీ రివర్‌బెడ్‌లో నివసించే వారి కష్టాలు తెలిసేవి.కలుషితమైన నీరు,గాలి మధ్య వారంతా దుర్భర జీవితం గడుపుతున్నారు. మూసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారు.మంచి నీరు,మంచి వాతావరణం కల్పించాలని ప్రభుత్వం చూస్తోంది.ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారు.గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.డీపీఆర్ వచ్చాక గోడలు కట్టాలో ఇంకేమైనా చెయ్యాలా అనేదానిపై సలహాలు ఇవ్వండి’అని శ్రీధర్‌బాబు సూచించారు. -
రెండో రాజధానిగా వరంగల్: మంత్రి కొండా సురేఖ
సాక్షి, వరంగల్: దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు కొండా సురేఖ, సీతక్క మీడియాతో మాట్లాడారు.ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈ సభ కూడా విజయవంతం చేయాలి’’ అని కొండా సురేఖ పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ పార్టీకే ఆ చరిత్ర ఉంది: మంత్రి సీతక్కబీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మేము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. హైడ్రాకు అడ్డుపడుతున్నారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది?. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసింది. కానీ మేము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికే. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉంది. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్. మాకు మూటలు మోసే అలవాటు లేదు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారు.. ఇప్పుడు తిడుతున్నారు..కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నాం. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నాం. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తాం. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే మా లక్ష్యం. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశాం’’ అని సీతక్క తెలిపారు. -
‘సవాల్లో ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటావా’
జనగామ జిల్లా: దేవునూర్ అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, ఒకవేళ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై స్టేషన్‌ఘన్‌పూర్‌లో ధ్వజమెత్తారు కడియం శ్రీహరి.‘ దమ్ముంటే రాజయ్య నా సవాల్‌ను స్వీకరించాలి. దళితబంధులో నువ్వు చేసిన అవినీతిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తా. సవాల్లో ఓడితే.. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా రాజయ. మరోసారి చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదు. అవినీతి అక్రమాలకు పుట్ట కేసీఆర్ కుటుంబం. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొట్టాలి’ అని కడియం శ్రీహరి పేర్కొన్నారు. -
ఒక్కరు కాదు.. తెలంగాణకు ఇద్దరు సీఎంలు: బండి సంజయ్
సాక్షి,సంగారెడ్డి:లగచర్ల ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. సంగారెడ్డిలో ఆదివారం(నవంబర్17) బండి సంజయ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.‘రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయడానికి ఇది రాచరిక పాలనా? గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది. కలెక్టర్‌పై దాడి అనేది దారుణం. రైతులు కలెక్టర్‌పై దాడి చేయలేదు. ఈ దాడి వెనుక కేటీఆర్,బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం.కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిశారు. గతంలో కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసును ఇలానే నీరు గార్చారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేటీఆర్‌కు తెలియకుండా ఇది జరుగుతుందా. అప్పుడు,ఇప్పుడు సీఎం కేటీఆరే.దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి. ఫార్ములా-ఈ కేసు,ధరణి కేసు,జన్వాడ ఫామ్ హౌస్ కేసు,డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి.జనాలని,మీడియాని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లను పిచోళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేటీఆర్, ఇంకొకరు రేవంత్‌రెడ్డి’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. -
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి..నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా. ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది.ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం.. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ సీఎం రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్‌లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్‌లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు...మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తీరు, హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?.. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?.. రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రాహుల్ గాంధీ గారూ..మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదానీ-అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన..తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదానీ-అంబానీలపై మీ జంగ్..రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది?తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా! ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?నేను కొట్టినట్లు చేస్తా..నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?రేవంత్-అదానీలతో వ్యాపార బంధమా?అదానీ-అంబానీలపై మీ పోరాటం ఓ బూటకంతెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం..’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ గారూ...మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన...తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదాని -అంబానీలపై మీ జంగ్..… pic.twitter.com/b6NuJ6MIHl— KTR (@KTRBRS) November 17, 2024ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా ??!!అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా..!!ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి ?తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా ?❌అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా ??❌కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ??❌కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ??❌మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ??❌హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా ??❌ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ??❌రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ??❌తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా ??❌సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా ??తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ??ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోంది. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుంది.జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు.