breaking news
-
ఈ-కార్ రేసు స్కామ్‌పై చర్చకు రెడీ:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కేబినెట్లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.పేరు మర్చిపోయినందుకు యాక్టర్‌ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
‘కేటీఆర్ చేసింది పెద్ద తప్పు.. జైలుకు వెళ్లక తప్పదు’
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నగరంలో నిర్వహించిన ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. కేటీఆర్ చేసింది పెద్ద తప్పు అని, దానికి శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఏడేళ్ల వరకూ జైల్లో ఉండాల్సి వస్తుందంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ చేసిన తప్పిదానికి బెయిల్ కూడా రాదని, ఆయనకు బెయిల్ రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొక్కుతున్నారని ఎద్దేవా చేశారు.అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ కేటీఆర్‌కు బెయిల్ రావాలని మొక్కుతున్నారు.ఎమ్మెల్యేలు శబరిమల వెళ్లడానికి నల్లదుస్తులు ధరించారు. కేటీఆర్ అరెస్టు అయితే శబరిమల వెళ్లి బెయిల్ రావాలని మొక్కుతారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు బెయిల్ వచ్చే చాన్స్ కూడా లేదు.’ అని కోమటిరెట్టి పేర్కొన్నారు. ఇవీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు -
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్‌లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్ -
‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్17) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ స్పందించారు. 30సార్లు ఢిల్లీకి పోయినా మూడు పైసలు తేలేదు కాని..మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే గుడ్‌లక్ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసులు పెట్టండి..వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.కాగా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ కార్ రేసు ఏర్పాట్లలో నిధుల గోల్మాల్ జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈవ్యవహారంలో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై దర్యాప్తు చేయడానికి గవర్నర్ ఆమోదాన్ని కోరగా ఇందుకు ఆయన ఓకే అన్నారు. దీంతో కేటీఆర్‌పై కేసు పెట్టనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం కేబినెట్ భేటీ తర్వాత సంకేతాలిచ్చారు. తాజాగా దీనిపై కేటీఆర్ స్పందించారు. బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది 30 సార్లు ఢిల్లీకి పోయిన 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే, మీ ఖర్మ Good luck Chitti Naidu & CoWill face you legally. Bring it on 👍— KTR (@KTRBRS) December 17, 2024 -
భట్టిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో రాష్ట్ర అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సోమవారం ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శాసనసభ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ‘2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలంగాణ అప్పులను రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది జూలై 25 నాటి బడ్జెట్ ప్రసంగంలోనూ ఇవే అంకెలను వల్లె వేశారు. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’నివేదికలో 2014–15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72, 658 కోట్లు కాగా 2024 మార్చి నాటికి రూ.3.89 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.కానీ ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ నేప థ్యంలో ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’అని బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం: కేటీఆర్ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్నందునే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ‘గతంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును నాటి స్పీకర్ మనోహర్ అంగీకరించి సభలో చర్చకు వీలు కల్పించారు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టడం బాధాకరం. రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి. శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారు ‘గతంలో ఎన్నడూ లేని రీతిలో మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎంను కలిసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కనీసం ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డు కుంటున్నారు. మమ్మల్ని కట్టడి చేసి, ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవాలని అనుకుంటున్నది. రైతు కూలీలకు రూ.12 వేల అర్థిక సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహారాలకు విరుద్ధం. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క విస్మరించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
ప్రజా ప్రభుత్వమా.. నియంత సర్కారా?
సాక్షి, హైదరాబాద్: ఏ తప్పూ చేయని లగచర్ల రైతులను 40 రోజులుగా జైల్లో పెట్టింది ప్రజా ప్రభుత్వమా లేదా నియంత ప్రభుత్వమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రైతన్నకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని, శాసనసభ కొనసాగినన్ని రోజులు ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పారు. రైతులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే దాకా, వారిపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకునే వరకు, సీఎం రైతన్నలకు క్షమాపణ చెప్పేదాకా పోరాటం కొనసాగుతుందన్నారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. థర్డ్ డిగ్రీతో వేధిస్తున్నారు తమ భూములు ఇవ్వబోమన్న రైతులను జైల్లో పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీతో వేధిస్తున్నారని, ఆ థర్డ్ డిగ్రీ వీడియో కాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు చూసి ఆనందిస్తున్నారని విమర్శించారు. ఫార్మా విలేజ్‌ను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం...పారిశ్రామిక కారిడార్ పేరిట భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బయట ఉన్న గిరిజనులను, వారి కుటుంబాలను పోలీసులు ఇంకా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలను జైల్లో పెట్టిన రేవంత్‌రెడ్డి.. దీనిపై మాట్లాడకుండా పర్యాటక శాఖపై చర్చ పెట్టడమేంటని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైల్లో వేస్తున్నారని, తెలంగాణ, కొడంగల్ రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని నిలదీశారు. ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి 30 సార్లు, మంత్రులు 70 సార్లు ఢిల్లీకి వెళ్లినా రూ.100 కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తే సభ నుంచి పారిపోయినా.. రేపు మరొక రూపంలో వస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టడానికి దమ్ములేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ అని దుయ్యబట్టారు. అదానీతో జరుగుతున్న అవినీతిపై సభలోకి వచ్చి చర్చిద్దామంటే అడ్డుకున్నారని, లగచర్ల అంశంపై చర్చ పెడదామంటే సమాధానం చెప్పడం చేతగాక అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయారని విమర్శించారు. -
కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం(డిసెంబర్ 16) అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ-కార్ రేసుపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఈ కార్ రేసులో నిధుల అవకతవకలపై దర్యాప్తునకు గవర్నర్ న్యాయనిపుణులను సంప్రదించి అనుమతించారని పొంగులేటి తెలిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు.కేబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..భూమి లేని వారికి డిసెంబర్ 28న రూ.6వేల నగదు పంపిణీసంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ కేటీఆర్‌పై కేసు విషయంలో ఏసీబీకి సీఎస్ ద్వారా లేఖసంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయంరైతు కూలీలకు రెండు దఫాలుగా 12 వేలు ఆర్దిక సహాయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం.స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం..పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం -
మీటింగ్‌లకు వచ్చేదంతా వాళ్లే.. దీపాదాస్ వివాదాస్పద కామెంట్స్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లపై ఏకంగా ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు పార్టీ మీటింగులు పెడితే దానికి కార్యకర్తలు రావాలి కానీ 200 రూపాయల కూలీలు రాకూడదని నేతలకు మున్షీ చురకంటించారు. సోమవారం(డిసెంబర్16) హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్‌లో మున్షీ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. తమను కూలీలతో పోలుస్తారా అని కార్యకర్తలు ఫైర్ అయ్యారు.మరోవైపు సీనియర్ నేత హనుమంతరావు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగాలపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు పొద్దంతా కాంగ్రెస్‌తో ఉండి సాయంత్రానికి ఎమ్ఐఎమ్కు ఓట్లు వేస్తారన్న హనుమంతరావు ,అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. -
ఆ విషయం తెలిసే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్పై మరోసారి ఫైరయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ హౌలా గాళ్లను చేస్తుండని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం(డిసెంబర్16)కోమటిరెడ్డి అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజు సభకు వచ్చారు.ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు?ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది.భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసిఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదు. బీఆర్ఎస్ సభలో ఎంత అరిచి గీ పెట్టినా ఉపయోగం ఉండదు’అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగి సభ మంగళవారానికి వాయిదా పడింది. -
‘చాయ్ బిస్కట్’ సమావేశాలు కాదు: హరీశ్‌రావు ఫైర్
సాక్షి,హైదరాబాద్:బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. -
భూదాన్ స్కామ్.. ఈడీ విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. జనార్థన్ రెడ్డితో పాటుగా మరో ముగ్గురిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు.రాష్ట్రంలో భూదాన్ భూముల కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఆయనతో పాటుగా మరో ముగ్గురిని ఈడీ అధికారులు విచారించనున్నారు. వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణను హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక, ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌ను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆర్డీవో, ఎమ్మార్వోను విచారించి ఈడీ కీలక వివరాలను సేకరించింది.ఇదిలా ఉండగా.. మేడ్చల్ జిల్లాల్లో అమోయ్ కుమార్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన భూ లావాదేవీలపై బాధితులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ అధికారులు ఇప్పటికే అమోయ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించారు. రూ.కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇతరులకు కేటాయించడంపై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు అమోయ్ కుమార్, మహేశ్వరం తహశీల్దార్ వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతితోపాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు. వారు ఇచ్చిన కీలక పత్రాల ఆధారంగా భూ ఆక్రమణలపై పూర్తి ఆధారాలను ఈడీ సేకరించి డీజీపీకి నివేదిక సమర్పించింది. -
తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రివిలేజ్ మోషన్
సాక్షి,తెలంగాణ భవన్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ‘బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని, కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ’ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. అప్పుల అంశంపై సోమవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ రాష్ట్ర అప్పులు రూ. 7 లక్షల కోట్లంటూ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం. ఆర్బీఐ నివేదిక ప్రకారం అప్పు రూ. 3.89 లక్షలు మాత్రమే అని పేర్కొంది. కానీ రూ.7లక్షల కోట్ల అప్పులంటూ ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం ‘ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ నివేదిక తేల్చిందని అన్నారు.డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. కావున తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్ఎస్ శాసనసభా పక్షం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’ అని ట్విట్లో పేర్కన్నారు. We will be moving a privilege motion against the Congress Govt for its repeated attempts to mislead the legislature & the people of Telangana by stating that the total state debt is 7 lakh crore where as RBI report exposed their lies stating that the debt is only 3.89 lakh crore… pic.twitter.com/Of7N3Yk0I1— KTR (@KTRBRS) December 16, 2024 -
సీఎం రేవంత్ తెలంగాణ ద్రోహి
సిద్దిపేట జోన్: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన ఏనాడూ జై తెలంగాణ అనలేదని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్య పుస్తకావిష్కరణ సభలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అవార్డుల పేరుతో తన మరకలను కడిగేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేసి, విగ్రహ రూపాన్ని మార్చడం నచ్చకనే కవి నందిని సిధారెడ్డి ప్రభుత్వ ఇవ్వజూపిన నజరానా, ఇంటి స్థలాన్ని తిరస్కరించారని తెలిపారు. రూ.కోటి రూపాయలు ముఖ్యం కాదని, మూడు కోట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమని చాటిన నందిని సిధారెడ్డి ఎంతో గొప్పవారని అభినందించారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్రతెలంగాణ ఉద్యమానికి గద్దర్ ప్రజాగొంతుకగా నిలిచారని హరీశ్‌రావు అన్నారు. ఆయన లేనిది ఏ ఉద్యమం లేదు.. మలిదశలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు అని కొనియాడారు. గద్దర్ పోరాటం భావితరాలకు తెలిసేలా పుస్తకాలు ముద్రించటం మంచి ఆలోచన అని ప్రశంసించారు. తండ్రి పోరాటాన్ని, గొప్పతనాన్ని రేపటి తరాలకు అందించి నిజమైన వారసుడు అనిపించుకున్నారని గద్దర్ కుమారుడు సూర్యకిరణ్‌ను అభినందించారు. గద్దర్ పాట ఉన్నంత కాలం ప్రజల మధ్య ఆయన సజీవంగా ఉంటారన్నారు. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచన అభినందనీయమని, గద్దర్ జీవిత చరిత్రతో కూడిన డాక్యుమెంటరీ తయారీ చేయాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. -
అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
ఖమ్మం వన్‌టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఇప్పుడు ఆ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7,11,911 కోట్ల అప్పులు చేసి ప్రజలపై తీరని భారం మోపిందన్నారు.రాష్ట్రానికి తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే వాళ్లు తెచ్చిన అప్పులు తీరుస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పారీ్టనే అప్పుల పాలు చేయగా.. ఇప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్ గాయిగత్తర చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజల ముందు ఉంచామని భట్టి గుర్తుచేశారు. రానున్న సంక్రాంతికి రైతు భరోసా డబ్బు సైతం జమ చేస్తామని, ఇప్పటివరకు మొత్తం రూ.50,953 కోట్లను రైతుల కోసం ఖర్చు చేశామని వివరించారు. పేదలకు రెండు విడతలుగా సాయం ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూమి లేని నిరుపేదలకు రూ.12 వేల చొప్పున రెండు విడతలుగా సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు వారంలోపే డబ్బులు, సన్నాలకు బోనస్‌ను సైతం అందిస్తున్నామని తెలిపారు.అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఓఆర్ఆర్–ట్రిపుల్ ఆర్ మధ్య ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు. వసతి గృహాల్లో నూతనంగా పెంచిన డైట్ చార్జీలతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 541 కోట్ల భారం పడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో డైట్ చార్జీలు పెంచలేదని, అందుకే అన్నంలో పురుగులు వంటివి వచ్చాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. -
మళ్లీ పార్టీ పగ్గాలు..?బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్:తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో లేనని, తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ అన్నారు. ఈ విషయమై బండి సంజయ్ ఆదివారం(డిసెంబర్ 15) మీడియాతో మాట్లాడారు.‘పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు మళ్లీ అప్పగిస్తారనేది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు.హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి.ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా’అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. -
పార్టీ మారిన నేతలు.. అసెంబ్లీలో ఏ ముఖంతో మాట్లాడతారు: కవిత
సాక్షి, జగిత్యాల: జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.ఎమ్మెల్సీ కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల అంటే బీఆర్ఎస్ అడ్డా. మీరు గెలిపించిన నాయకుడు పార్టీకి ద్రోహం చేసిన వెళ్లిపోయాడు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ అసెంబ్లీకి వెళ్ళి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడో చూద్దాం. జగిత్యాలకి ఒక్క రూపాయి రాలేదు, జగిత్యాలలో అభివృద్ధి ఏమీ జరగలేదు.పైసల కోసం సంజయ్ పార్టీ మారాడు. పైసలా కోసం పార్టీ మారిన వ్యక్తులు నాయకులే కాదు. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. కేసీఆర్‌కు సైనికులుగా మీరంతా ఉన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం మనకు తెలంగాణ తల్లిని, బతుకమ్మను దూరం చేసింది. అధికారం కోసం కాంగ్రెస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అంటూ ాటు వ్యాఖ్యలు చేశారు. -
‘గవర్నర్ అనుమతి’తో బీఆర్ఎస్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావుపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం కేటీఆర్‌కు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏసీబీ నోటీసులు, విచారణ తంతు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఏసీబీ నుంచి నోటీసులు అందే పక్షంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లీగల్ సెల్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు గతంలో మంత్రిగా పూర్తిగా తనదే బాధ్యత అని కేటీఆర్ ప్రకటించారు. మరోవైపు లగచర్ల ఘటనకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో ఆయనను అరెస్టు చేయవచ్చని అప్పట్లోనే ఊహాగానాలు వచ్చాయి. తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నవంబర్‌లో కేటీఆర్ ప్రకటించారు కూడా. అందులో భాగంగానే ‘ఫార్ములా–ఈ రేస్’ అంశాన్ని తాజాగా తెరమీదకు తెస్తున్నారని పార్టీ నేతల వద్ద కేటీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.అసెంబ్లీని స్తంభింపజేసే యోచనదర్యాప్తు సంస్థల నుంచి అందే నోటీసులకు సమాధానాలిస్తూ, విచారణలకు హాజరవుతూనే ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ఎలాంటి కార్యాచరణ అనుసరించాలనే కోణంలో పార్టీ నేతలు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నోటీసులిస్తే సభలోనే చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్ అరెస్టు జరిగితే అసెంబ్లీని స్తంభింపజేసేలా పార్టీ కార్యాచరణ ఉంటుందని, అవసరమైతే సమావేశాలను బహిష్కరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రేవంత్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేస్‌ను రద్దు చేయడంతో రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్లు నష్టం జరిగిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిధులు చెల్లించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటోంది.కక్ష సాధింపు రాజకీయాలను నిలదీద్దాంరాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్.. ఈ అంశాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోరడం, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసులు పెట్టడం ద్వారా పార్టీ ముఖ్య నేతలను ఆత్మరక్షణలోకి నెట్టాలనే వ్యూహాన్ని రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ లక్ష్యంగా కేసులు, అరెస్టులు జరిగితే క్షేత్రస్థాయిలో ఉద్యమకాలం నాటి తరహా ఆందోళనలు చేపడతామని పేర్కొంటున్నారు.బీజేపీ సహకరిస్తుందనే విమర్శలతో..ఫార్ములా–ఈ రేస్‌లో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతివ్వడం వెనుక రాజకీయ కోణం ఉందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నేతలతో అంటకాగుతున్నారని, అందులోభాగంగానే గవర్నర్ అనుమతి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. సీఎం రేవంత్ ఇటీవలి ఢిల్లీ పర్యటన, వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు వంటివి కూడా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడం లక్ష్యంగా సాగినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
కటకటాల్లో అల్లు అర్జున్.. రేవంత్ సాధించిందేమిటి?
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సినిమా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అర్జున్ను అరెస్ట్ చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి సాధించిందేమిటి? అన్నది మొట్టమొదటి ప్రశ్న. అలాగే.. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి? ఈ అంశంపై సినీ రంగం తగు రీతిలో స్పందించిందా? ఈ ఘటనకు ఏపీ రాజకీయాలకు ఉన్న సంబంధాలేమిటి? పుష్ప2 విజయంతో కొందరిలో ఏర్పడ్డ ఈర్ష్య అసూయలే ఈ అరెస్ట్‌కు కారణమా? అల్లూ అర్జున్ ఎదుగుదలను ఎవరు సహించలేకపోతున్నారు? ఇలా.. బోలెడన్ని ప్రశ్నలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. డిసెంబరు నాలుగున జరిగిన తొక్కిసలాట, శుక్రవారం అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంత అర్థవంతంగా లేదనే చెప్పాలి. ఎందుకంటే సెలెబ్రిటీలు, సినీ నటులు ప్రజల్లోకి వెళ్లినప్పుడు తొక్కిసలాటలు జరుగుతూంటాయి. అయితే ఇందుకు వారే కారణమవుతారా? అభిమాన నటుడిని చూసే ప్రయత్నంలో ఎగబడే ప్రజలది తప్పు అవుతుందా? గుంపును కట్టడి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయని థియేటర్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకూ? సెలిబ్రిటీ రాక గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా సీరియస్‌గా తీసుకోని పోలీసుల తప్పేమీ ఉండదా? ఆ మాటకు వస్తే గతంలో పలు రాజకీయ సభలలో, మతపరమైన ఉత్సవాలలోనూ తొక్కిసలాటలు జరిగాయి. ఆయా సందర్భాలలో రాజకీయ నేతలను, మతపరమైన పెద్దలను అరెస్టు చేశారా? అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అర్జున్ను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేసిన తదుపరి కోర్టు రిమాండ్‌లో చంచల్‌గూడ జైలుకు తీసుకువెళ్లారు. హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయినా అర్జున్ దాదాపు పన్నెండు గంటలసేపు చంచల్ గూడ జైలులోనే ఉండాల్సి వచ్చింది. శుక్రవారం అరెస్టు చేస్తే, శని, ఆదివారాలు సెలవు దినాలు కనుక అర్జున్‌కు బెయిల్ రాదన్న కుట్రతో ఇది జరిగిందని చాలామంది సందేహిస్తున్నారు. అయితే అర్జున్ లాయర్లు వెంటనే స్పందించి హైకోర్టును ఆశ్రయించి తగు ఉత్తర్వులు పొందినా జైలు అధికారులు సాంకేతిక కారణాలతో విడుదల లేట్ చేసినట్లు ఈ పరిణామం క్రమంపై మీడియా విశేషంగా వార్తలు ఇచ్చింది. యథాప్రకారం టీడీపీ మీడియా తన రాజకీయ కుయుక్తులను ప్రదర్శించింది. అర్జున్ను జైలు నుంచి అప్పుడే విడుదల చేయడం ఏమిటి? అన్న బాధ వారిలో ఉన్నట్లు కవరేజిని బట్టి అర్థమవుతుంది. ఈ అంశానికంటే ముందు రేవంత్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యల మీదే ఎక్కువగా అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. సినిమా నటులు ఏమైనా సైనికులా?ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో యుద్దం చేసి వచ్చారా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే.. ‘‘సినిమా తీశారు..డబ్బులు సంపాదించుకుంటున్నారు’’ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. సంపాదన అన్నది ప్రతి వ్యక్తి చేసేదే. అలాగే కొంతమంది సినీ రంగంలోకి వెళతారు. వారిలో కొద్దిమందే సఫలం అవుతుంటారు. ఇదీ చదవండి: సినీ నటులు సైనికులా?ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించాల్సి ఉంటుంది. ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవాటిలో సినిమా రంగం ముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ఒకప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పలువురు కృషి చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు వంటివారు సినీ పరిశ్రమ ఇక్కడ అభివృద్ది కావడానికి వీలుగా పలు రాయితీలు ఇచ్చారు. ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు, కృష్ణ తదితర ప్రముఖులు సినీ స్టూడియోలు ఏర్పాటు చేయడానికి, నివాసానికి అవసరమైన స్థలాలు కేటాయించారు. ఫిలింనగర్ పేరుతో ఇప్పుడు వెలుగొందుతున్న ప్రాంతం అంతా అప్పుడు ప్లాన్ చేసినదే. ఆనాటి ప్రభుత్వాలు సినిమాను వ్యాపారంగానే చూసి ఉంటే, హైదరాబాద్‌కు సినీ రంగ పరంగా ఇప్పుడు ఇంత ప్రాధాన్యత వచ్చేదా? ఇన్ని వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న సంగతి రేవంత్ కు తెలియదా? 1985 ప్రాంతంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు వెళ్లడానికి సరైన దారే ఉండేది కాదు. అలాంటి ఇబ్బందులను ఎదుర్కుని నాగేశ్వరరావు దానిని అభివృద్ధి చేశారు. సినీ రంగంలో తిరుగులేని స్థాయిలో ఉన్న ఎన్టీఆర్ నాచారం వద్ద, అలాగే ముషీరాబాద్ లోను స్టూడియాలు ఏర్పాటు చేశారు. అమీర్ పేట వద్ద సారధి స్టూడియో ఏర్పాటైంది. ఆ తర్వాత పలు రికార్డింగ్ ధియేటర్లు వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి టైమ్ లో ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డికి , మరి కొందరికి రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అంతేకాదు. రామోజీఫిలిం సిటీకి కీలకమైన రహదారి కోసం అవసరమైన ఐదెకరాల స్థలాన్ని మరో పారిశ్రామిక వేత్త అయిన సంఘీ నుంచి కోట్ల ప్రభుత్వం వెనక్కి తీసుకుని మరీ ఇచ్చింది. కృష్ణ నగర్ ప్రాంతం జూనియర్ ఆర్టిస్టులకు కేంద్రంగా మారింది. ఖాజాగూడ వద్ద సినీ కార్మికులకోసం ప్రత్యేక కాలనీ చిత్రపురిని ఏర్పాటు చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ఇవన్ని ఎందుకు చేశాయి? ఈ సంగతులు రేవంత్ రెడ్డికి తెలియవా? లేక ఆవేశంలో జరిగిన తప్పును సమర్థించుకోవడానికి సిని పరిశ్రమ వారిని ఉద్దేశించి డామేజింగ్ వ్యాఖ్యలు చేశారా? అన్న భావన కలుగుతుంది. ప్రముఖ నటుడు కృష్ణ ఆర్థిక కష్టాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా సాయం చేశారు. అంతే కాదు. మంచి సినిమాలు తీసేవారి కోసం,ఉత్తమ నటీనటులకు ఉమ్మడి ఏపీలో నంది అవార్డులను ప్రవేశపెట్టారు. రేవంత్ ప్రభుత్వమే ప్రఖ్యాత గాయకుడు గద్దర్ పేరుతో తెలంగాణలో అవార్డులు ఇవ్వడానికి సంకల్పించింది. సినీ నటులను వ్యాపారులుగా చూస్తున్నట్లయితే ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నట్లు? అలాగే జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తారు.జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అల్లు అర్జున్ పొంది తెలుగు వారికి ఒక ఘనత తెచ్చిపెట్టారు. సినీ పరిశ్రమ ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధితో పాటు, ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. ఉదాహరణకు పుష్ప2 సినిమా ద్వారా సుమారు రూ.300 కోట్ల పన్ను వచ్చిందట. అందువల్ల సినిమా పరిశ్రమను, హీరోలను తక్కువ చేసి మాట్లాడడం రేవంత్‌కు తగదని చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన అనుభవ రాహిత్యాన్ని సూచిస్తాయన్న విమర్శ ఉంది. సినీ పరిశ్రమకే కాదు..ఇతర రంగాలకూ ప్రభుత్వాలు భూములు ఉచితంగా లేదా, తక్కువ ధరకు కేటాయిస్తాయి. రాయితీలు ఇస్తాయి. రేవంత్ సైతం ఇలాంటి ప్రోత్సహకాలతోనే పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడానికి డావోస్ వరకు వెళ్లి ప్రయత్నించారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున ఎన్.కన్వెన్షన్ ను ఆకస్మికంగా కూల్చిన తీరు, నటి సమంతపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వానికి నష్టం చేశాయి. మెగాస్టార్ చిరంజీవిని ఇంకా కాంగ్రెస్ వ్యక్తిగానే రేవంత్ చెప్పడం చిత్రంగానే ఉంది. అలాగే అర్జున్ మామ చంద్రశేఖరరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మాట నిజమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అర్జున్ విషయంలో జాగ్రత్తగా ఎందుకు అడుగులు వేయలేదు. అర్జున్ తదితరులు థియేటర్ వద్దకు వస్తున్నారని సంధ్యా ధియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ రాసినా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అర్జున్ వెళ్లారని చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి తగునా?హోం మంత్రి బాధ్యతలు కూడా రేవంత్ చేతిలోనే ఉన్నాయి. ఆయనకు తెలియకుండా ఈ అరెస్టు జరిగే అవకాశమే లేదు. పోలీసులు తమ తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదన్న భావన కలుగుతుంది. దీనివల్ల రేవంత్‌కే అప్రతిష్ట. శాఖమీద సరైన కంట్రోల్ లేదు అనిపిస్తుంది. రేవంత్ చర్యలు అభద్రతాభావంతో చేసినవని మాజీ మంత్రి కేటీఆర్, స్పెషల్షోలకు అనుమతిచ్చినందుకు రేవంత్‌నే అరెస్ట్ చేయాలని ఇంకో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రేవంత్ ప్రభుత్వం అర్జున్ను లక్ష్యంగా పెట్టుకని పనిచేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అర్జున్ అరెస్ట్‌ను తప్పుపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే ఇందులో కుట్ర, అసూయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఏపీలో చంద్రబాబు తప్పిదాల వల్ల పుష్కరాలలో 29 మంది, కందుకూరు సభలో ఎనిమిది మంది, గుంటూరులో టీడీసీ సభలో చీరల పంపిణీ కారణంగా నలుగురు మరణించారని, అయినా ఆయనపై కేసులు పెట్టలేదని అన్నారు. తెలంగాణలో అర్జున్‌కు సంబంధం లేకపోయినా తొక్కిసలాటలో ఒకరు మరణించారన్న అభియోగంపై అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్జున్ అరెస్ట్ సమాచారం తెలిసిన వెంటనే చిరంజీవి, నాగబాబు తదితరులు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం సరైన పద్ధతిలో స్పందించ లేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్ధి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వెళ్లడమే అల్లు అర్జున్ చెసిన పెద్ద తప్పా? అని కొందరు ప్రశ్నించారు. ఈ కక్షతోనే టీడీపీ, జనసేన ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ ద్వారా ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చన్నది పలువురి డౌటుగా ఉంది. ఇందులో నిజం ఉండవచ్చు. లేకపోవచ్చు కానీ టీడీపీ, జనసేనలు అర్జున్ అరెస్టును ఖండించకపోవడంతో అనుమానాలు వస్తాయి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రముఖులు కూడా ఒకరిద్దరు తప్ప ఈ ఘటనపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. వారిలో ఎక్కువ మంది రేవంత్ చేసిన వ్యాఖ్యలు, అర్జున్ అరెస్టు తీరుపై అంత సంతృప్తిగా లేకపోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈఫార్ములా రేసు నిధుల దుర్వినియోగం కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడానికి ముందు, తమ ప్రభుత్వం ఎవరినైనా అరెస్టు చేస్తుందని చెప్పడానికి ఏమైనా ట్రయల్ వేశారా? అన్నది మరో పాయింట్‌గా చెబుతున్నారు. పోలీసులు అర్జున్ను ముందు విచారణకు పిలిచి, తొక్కిసలాట ఘటనలో ఆయన ప్రమేయం ఏ మేరకు ఉంది.అందుకు ఆధారాలు ఏమిటి అన్న అంశాలపై దర్యాప్తు చేసి ఉండాల్సింది.అలా చేయకుండా శుక్రవారం నాడు నేరుగా ఇంటికి వెళ్లి అర్జున్ ను అదుపులోకి తీసుకోవడం లో కుట్ర కోణం ఉందన్నది చాలామంది భావన. పోలీసుల అరాచకాలపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాము వెనుకబడి పోకూడదన్నట్లుగా తెలంగాణ పోలీసులు కూడా ఇలాంటి అనుచిత చర్యలకు దిగితే వారికే పరువు తక్కువ. అనేక మంది సినీ నటులు పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. వస్త్రాల షాపుల ప్రారంభోత్సవాలకు హీరో, హీరోయిన్ లు హాజరవుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా సభలలో పాల్గొంటుంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో తెలియని స్థితిలో ఇకపై వారు భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రముఖులు నాని, రామ్ గోపాల్ వర్మ వంటి కొద్ది మంది తప్ప మిగిలిన సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లు లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాల రీత్యా, ప్రభుత్వంతో గొడవపడడం ఎందుకు అన్న భయంతో వారు మాట్లాడడం లేదని కొందరు అంటున్నారు. పుష్ప2 సినిమా రికార్డు స్థాయిలో సుమారు రూ.1,500 కోట్ల మేర వసూళ్లు చేయడంపై కొంతమంది సినిమా వారిలో ఈర్ష్యం ఉండవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా మరో సంగతి చెబుతున్నారు. రేవంత్ స్వగ్రామంలో ఒక మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఒక లేఖ రాసి అందులో సీఎం సోదరులపై కొన్ని ఆరోపణలు చేశారు. దానిపై పోలీసులు కేసు పెట్టకుండా, ముందస్తు విచారణ చేసి, వారి తప్పు ఏమీ లేదని తేల్చేశారట. అదే రూల్ అల్లు అర్జున్‌కు వ్యర్తించదా అన్న ప్రశ్న వస్తుంది. ఏది ఏమైనా ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, మూసి గందరగోళంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ దెబ్బ తిన్నదని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సినీ పరిశ్రమపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న భావన వస్తే రేవంత్ కు అది మరింత నష్టం చేస్తుంది.విశేషం ఏమిటంటే పార్లమెంటులో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తొలి ప్రసంగం చేసిన రోజున రేవంత్ ప్రభుత్వం ఇక్కడ అర్జున్ అరెస్టుకు పూనుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ అంశానికే ప్రాధాన్యత వచ్చిందట. ఫలితంగా ప్రియాంక గాంధీ ఉపన్యాసం ఊసే ఎవరూ పట్టించుకోలేదట. దీనివల్ల కాంగ్రెస్ కు ఏమి లాభం వచ్చింది. రేవంత్ తనకు తానే స్టార్ అని అభివర్ణించుకోవడం తప్పు కాకపోవచ్చు. కాని జనం కూడా ఆయనను స్టార్ అనుకునేలా వ్యవహరించాలి. పాలన సాగించాలి. అలా చేస్తున్నానా? లేదా?అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. -
అల్లు అర్జున్ రిలీజ్ ఆలస్యమెందుకు?.. అదే జరిగితే స్టేట్ అగ్నిగుండమే: కౌశిక్ రెడ్డి
సాక్షి, కరీంనగర్: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ పేపర్స్ అందిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.అల్లు అర్జున్ అరెస్ట్‌పై తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ అయినా, నేనైనా, ఎవరైనా సరే.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. బెయిల్ పేపర్స్ నిన్ననే జైలు సూపరింటెండెంట్‌కు అందిన తర్వాత రిలీజ్ ఎందుకు చేయలేదో చెప్పాలి.సోషల్ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలు వింటున్నా. అదే జరిగితే తెలంగాణా అగ్నిగుండం అవుతుంది. ఫార్ములా ఈ-రేసు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఓ విజన్ లేక, ఏం చేయాలో తెలియక, దాన్ని తీసుకొచ్చిన కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. ఫార్మూలా ఈ-రేసు తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్‌కు టెస్లా తీసుకొద్దామన్న ఆలోచన కేటీఆర్‌కు ఉండేది. ఈ విషయం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. -
ఫొటోలకు పోజులు కాదు.. బుక్కెడు బువ్వ పెట్టండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని తెలిపారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కాంగ్రెస్ పాలనలో సామాన్య విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగాయి. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయి. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి.బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ నెలకొంది. కెమెరాల ముందు హంగామా చేయడం కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి.. సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని కామెంట్స్ చేశారు. -
రేవంత్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందెవరు?. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హరీష్‌రావు మండిపడ్డారు.రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్‌ని ఎందుకు అరెస్టులు చేయరు?. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి‘‘ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్‌తో నాకేం సంబంధం లేదు’ -
ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై జీవో ఇచ్చారంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అధికార పార్టీది తెలంగాణ వాదం కాదు.. కాంగ్రెస్ వాదం అంటూ దుయ్యబట్టారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వారికి పార్టీ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేపు(శనివారం) మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరిగింది. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను సమానంగా చూశాం. ప్రజల ఆమోదం ఉంటే సీఎంకు భయం ఎందుకు?. విగ్రహం తయారు చేసే వరకు ఎందుకు రహస్యంగా ఉంచారు’’ అంటూ కవిత నిలదీశారు.జాగృతి తరపున మేము ఎన్నో ఏళ్లుగా చేస్తున్నాము. మేధావుల అభిప్రాయం తీసుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్తాం. సీఎం రేవంత్ సంకుచిత తత్వంతో వ్యవహరిస్తున్నారు. మేము అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాము. సోనియా దగ్గర మార్కుల కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. కాంగ్రెస్ కొత్తగా చేసింది ఒక్క తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది పిరికి ప్రభుత్వం. కార్యకర్తల నుంచి నేతల వరకు అక్రమ కేసులు పెడుతోంది. మేము అక్రమ కేసులకు భయపడం’’ అని కవిత చెప్పారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ కామెంట్స్ -
అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు. హైడ్రా వల్ల ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలి. Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers! I totally sympathize with the victims of the stampede but who failed really? Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa— KTR (@KTRBRS) December 13, 2024అల్లు అర్జున్ అరెస్ట్‌పై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ ట్వీట్లో ‘సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట బాధితులకు పూర్తిగా సానుభూతి తెలుపుతాను.. కానీ ఘటనలో నిజంగా తప్పు చేసింది ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. ఘటనకు నేరుగా బాధ్యుడు కానీ అల్లు అర్జున్ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిఅల్లు అర్జున్ అరెస్ట్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేయగా.. తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే ముగ్గురిని అరెస్ట్ చేశారు. సెక్యూరిటీగార్డ్ సహా థియేటర్ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.👉చదవండి : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ -
కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్ షెట్కార్, అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అనుమతులు ఇప్పించండి ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్ఆర్ఆర్తో పాటు రేడియల్ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్ పార్కులు, రిక్రియేషన్ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్ఆర్ఆర్కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి. మెట్రో ఫేజ్–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి మెట్రో ఫేజ్–2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీ నగర్–హయత్‌నగర్ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. ‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. ఆర్ఆర్ఆర్ అనుమతులు వెంటనే ఇవ్వండి ‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉంది. అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. హైదరాబాద్–విజయవాడ డీపీఆర్ త్వరగా పూర్తి చేయండి హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వద్ద రోప్ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయండి..’ అని నితిన్ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి ‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం.