breaking news
-
అదే నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేస్తా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలకు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై శనివారం చర్చ కొనసాగుతుంది. చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదు.రెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదు.ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.రూ.26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలి.రుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యింది.రుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా? ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి’అని కేటీఆర్ సూచించారు. -
రైతుల సమాచారం దేశం దాటించారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ అద్భుతమని, అమృతమని చెప్పారు. కానీ ఆ పోర్టల్ నిర్వహించిన కంపెనీ అరాచకాలు, దుర్మార్గం, దురాగతాలు చెప్పలేని స్థాయిలో ఉన్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండి ధరణి పోర్టల్ నిర్వహించాలనే నిబంధనను పట్టించుకోలేదు. యజమానులు మారినప్పుడు ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని పక్కన పెట్టారు. బెంగళూరు, విజయవాడ, గుర్గావ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి తెలంగాణ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశం దాటించారు. రైతుల భూమి డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నంబర్లు దేశం దాటి వెళ్లిపోయాయి. ఇది తీవ్రమైన నేరం. దీనికి ఏ స్థాయిలో శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నింటినీ చదవాల్సిన పరిస్థితి..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘విదేశాల నుంచి కూడా లావాదేవీలు నిర్వహించారేమో ఇప్పుడు పరిశీలించాలి. భూముల రిజి్రస్టేషన్లు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు కూడా చేశారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖూనీ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని పోరాటాలూ భూమి చుట్టూనే.. ‘తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. అన్ని పోరాటాలు భూమి చుట్టూనే పరిభ్రమించాయి. పటేల్–పటా్వరీ వ్యవస్థ రద్దుకు కూడా భూసంబంధిత ఫిర్యాదులే కారణం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరిగేలా పాలకులు భూమి చట్టాలను రూపొందించారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ధరణి పేరుతో తానో అద్భుత సాంకేతిక నైపుణ్య ఆవిష్కరణ చేశానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన అనుభవాన్ని రంగరించి తయారు చేశానని చెప్పడంతో నిజంగానే భూమి సమస్యలు పరిష్కారమవుతాయేమోనని నేను కూడా ఓ సందర్భంలో భ్రమకు లోనయ్యా. కానీ ధరణి కేసీఆర్ సృష్టి కాదు.. 2010లోనే ఒడిశా రాష్ట్రంలో ఈ ధరణి పేరుతో భూ లావాదేవీలను నిర్వహించారు. ఆ పోర్టల్ నిర్వహించింది కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీనే. తెలంగాణలోనూ ధరణి పోర్టల్ ఆ సంస్థకే ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కాగ్ ఈ కంపెనీ నిర్వాకం బయటపెట్టింది. ఎన్ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి, ఆ కంపెనీని తెచ్చి అద్భుతాన్ని, అమృతాన్ని సృష్టించామని కేసీఆర్ చెప్పారు. ఈ లోపభూయిష్ట సాంకేతిక నైపుణాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దారో తెలియాలి’అని రేవంత్ అన్నారు. యువరాజు సన్నిహితుడి సంస్థకు భాగస్వామ్యం ‘ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌తోపాటు అప్పటి యువరాజుకు సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజుకు చెందిన మరో సంస్థ ఈసెంట్రిక్, విజన్ ఇన్ఫోటెక్‌లకు సంయుక్తంగా ఈ కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ దివాళా తీసి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంది. కంపెనీ ప్రతినిధులు జైలుకెళ్లారు. ఆ తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీ పేరుతో మరో అనుబంధ కంపెనీని తెచ్చారు. ఆ తర్వాత ఫాల్కన్ ఎస్జీ అనే ఫిలిప్పీన్స్ కంపెనీ, ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సింగపూర్ కంపెనీ తెచ్చారు. ఆ కంపెనీకి గాదె శ్రీధర్‌రాజు సీఈవో అయ్యాడు. ఆ తర్వాత స్పారో ఇన్వెస్టర్స్, గేటెవే స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సింగపూర్ కంపెనీలు, హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ కంపెనీ, గేట్‌వే ఫండ్ 2ఎల్ఎల్పీ అనే కెమెన్ ఐల్యాండ్స్ కంపెనీలను సృష్టించారు. అక్కడి నుంచి పెరడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సీ, క్వాంటెల్లా ఐఎన్‌సీ అనే అమెరికా కంపెనీలను తెచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఆర్థిక నేరానికి మూలం కెమెన్, బ్రిటిష్ ఐల్యాండ్స్ దేశాల్లో ఉంటుంది. పై కంపెనీలు నిర్వహిస్తున్న వారెవరూ ఈ రాష్ట్రం కాదు కదా దేశ పౌరులు కూడా కాదు. ఈ విధంగా తెలంగాణ రైతుకు, రెవెన్యూ శాఖకు మధ్య జరిగే లావాదేవీలు, డిజిటల్ వెబ్సైట్ నిర్వహణ పేరుతో రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. ప్రజల నమ్మకాన్ని వంచన చేసి, వారి భూముల వివరాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వారిని ఏమనాలి?’అని సీఎం ప్రశ్నించారు. మేం తొందరపడితే రికార్డులన్నీ ట్రాష్ అయ్యేవి.. ‘మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది కదా.. ధరణిని ఏం చేశారని మమ్మల్ని అడిగారు. మేం విచారణకు ఆదేశించకుండా మౌనంగా ఉండడానికి కారణాలున్నాయి. మేము టెరాసిస్ నుంచి భూముల నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి ఇచ్చాం. కానీ ఈ డేటా బదలాయింపునకు గాదె శ్రీధర్‌రాజు సహకరించడం లేదు. మేము తొందరపడి ఆదేశాలిస్తే ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే తెలంగాణ భూ రికార్డులన్నీ క్రాష్ అయిపోయేవి. సర్వర్లు డౌన్ చేస్తే మళ్లీ రిపేర్, రీస్టోర్ చేయడానికి నెలలు పట్టొచ్చు. అందుకే ఆచితూచి వ్యవహరించాం. ధరణి నిజంగా అద్భుతమైతే కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అడిగి, కడిగి నిలదీయాలి కదా?’అని ముఖ్యమంత్రి అన్నారు. ధరణి విషయంలో నిద్రలేని రాత్రులు.. ‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేమంటే, మమ్మల్ని బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సభల్లో ఆయన ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నారో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే ఇదంతా తెలిసింది. ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు సంవత్సరమంతా సాంకేతిక నిపుణులు, ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపాం. వందల సమావేశాలు పెట్టుకున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటితో పాటు అధికారులు, నిపుణులు, ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. అన్నీ ఆలోచించి తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని సభ్యులందరూ ఆమోదించాలి.’అని సీఎం కోరారు. -
అసెంబ్లీలో రేవంత్‌వన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కార్ రేస్ అంశంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో హైకోర్టు ఇచి్చన తీర్పుతో తొలి అడుగులోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విజయం సాధించారని ఆ పార్టీ నేత హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. రేస్ నిర్వహణ సంస్థకు ప్రభుత్వం రూ.47 కోట్లు చెల్లిస్తే.. రూ.600 కోట్లు నష్టం అంటూ సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అబద్ధాలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. ఫార్ములా – ఈ రేస్ అంశంలో ప్రొసీజర్ ల్యాప్స్ జరిగి ఉండవచ్చు కానీ అక్రమాలు జరగలేదని స్పష్టంచేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చి ఏడాదైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. ‘సీఎం రేవంత్, ఆయన సోదరులు, అల్లుడు, బావమరిది అవినీతి బండారాన్ని కేటీఆర్ క్రమ పద్ధతిలో బయట పెడుతున్నారు. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ అంశాల్లో అవి నీతిని ప్రశ్నించడంతో కేటీఆర్‌ను జైలులో పెట్టే కుట్రకు తెరలేపారు. అరెస్టుల పేరిట నాయకులను భయభ్రాంతులకు గురిచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది’అని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు అనే రీతిలో రేవంత్ పాలన ఉందని ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై కేసు నమోదైన వెంటనే ఈడీ జోక్యం చేసుకోవడం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. -
కేటీఆర్ తొలి విజయం సాధించారు: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసు వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి,బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం(డిసెంబర్ 20) హరీశ్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.రేవంత్ అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు చెప్పింది. ఇది డొల్ల కేసు అని హైకోర్టు చెప్పింది. ఈ కార్ రేసుల వల్ల తెలంగాణకు లాభం జరిగింది.రూ.600 కోట్ల నష్టం కాదు..రూ.600 కోట్ల లాభం జరిగింది. అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసుల కేసులో ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1 చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేటీఆర్ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో హైకోర్టు కేటీఆర్‌కు ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. -
ఫార్ములా ఈ కేసు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం(డిసెంబర్ 20)భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ ఫార్ములా ఈ కేసుపై మాట్లాడారు.‘ఫార్ములా ఈ రేసులు నిర్వహించే ఎఫ్ఈవో ప్రతినిధులు నన్ను నా ఇంట్లోనే కలిశారు. రేసుల ఒప్పందంలో రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్ల వ్యవహారం ఉంది.కేటీఆర్‌తో చీకటి ఒప్పందాలున్నట్లు కంపెనీ ప్రతినిధులే నాకు చెప్పారు.కేసు దర్యాప్తులో ఉండడంతో పాటు కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.ఈ కారణంతోనే కేసు వివరాలు ఎక్కువగా చెప్పడం లేదు.బీఆర్ఎస్ ఫార్ములా ఈ కార్ల వ్యవహారంపై ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు. ఏసీబీ కేసు పెట్టగానే అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు.బీఏసీలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన 9 అంశాల్లో ఈ రేసుల అంశం లేదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాగా, ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్‌ను హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. డిసెంబర్ 30 దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 27కు వాయిదా వేసింది. -
అంబేద్కర్ వల్లే మోదీ, అమిత్ షాకు పదవులు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు. పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్ చేశారు. -
రేవంత్ కుంభకోణాలు బయటపెడుతున్నందుకే..
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభోణా లను బయట పెడుతున్నందునే రాష్ట్ర ప్రభుత్వం మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగి నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాలు చేస్తున్నా. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం, దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తు న్నారు. సీఎం, మంత్రులకు ఈ అంశంపై అవగా హన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంలో అణా పైసా వృథా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నా యి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రేసులు రద్దయ్యాయి. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసా లను ప్రజాస్వామ్య యుతంగా ప్రజల ముందు పెడతాం. నాపై నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఉద్యమకారులం, అణిచివేతలు, చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతాం..’ అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు.‘ఈవీ’కి తెలంగాణను హబ్‌గా చేయాలనుకున్నాం..‘కేసీఆర్ నాయకత్వంలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ఫార్ములా–ఈ రేస్’ను నిర్వహించాలని భావించాం. నాలుగు సీజన్ల పాటు నిర్వహించేలా 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది.2023 ఫిబ్రవరి 10న తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం. రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ రూ.35 కోట్లు, ప్రమోటర్ సంస్థ గ్రీన్ కో రూ.110 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల అదనంగా రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నీల్సేన్ సర్వే సంస్థ తెలిపింది. అయితే నష్టాలను కారణంగా చూపుతూ రెండో సీజన్లో ప్రమోటర్ గ్రీన్ కో తప్పుకోవడంతో హెచ్ఎండీఏ నుంచి రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించాలని నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఆదేశించా. ఎలాన్ మస్క్‌ను రప్పించి ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈవీ రంగానికి తెలంగాణను హబ్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాం..’ అని కేటీఆర్ తెలిపారు.అవినీతే జరగనప్పుడు కేసు ఎలా?‘ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ఫార్ములా–ఈ సంస్థ కోరింది. దీని సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లొంగోతో అదే నెల 13న సీఎం రేవంత్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సమావేశయ్యారు. తర్వాత రేస్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టు నిబంధనలు ప్రస్తావిస్తూ డిసెంబర్ 21 లోగా నిర్ణయం తెలపాలని సంస్థ లేఖ రాసింది. డిసెంబర్ 26 వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెప్తూ నిర్వాహక సంస్థ రూ.73 లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది. ఎఫ్ఈఓ ఎన్నిమార్లు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజును వెనక్కి తీసుకోవడం లేదు. రూ.55 కోట్లు రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని నిర్ధారిస్తూ మూడో వాయిదా చెల్లించడంపై ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో సంస్థ సంప్రదింపులు కొనసాగించింది. అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. అవినీతే జరగనప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హరీశ్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా–ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది..’ అని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఫార్ములా వన్ యోచన‘చంద్రబాబు హయాంలో 2001లో ‘ఫార్ములా వన్’ నిర్వహించాలనుకున్నారు. ట్రాక్ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన 15 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ విషయాన్ని 2013 ఎన్నికల అఫిడవిట్లోనూ రేవంత్ ప్రస్తావించారు. ట్రాక్ ఏర్పాటు కోసం గోపన్‌పల్లిలో మొత్తం 580 ఎకరాల భూ సేకరణకు గతంలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి పోగా రైతులు తమ భూమి కోసం నేటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు..’ అని కేటీఆర్ వివరించారు.రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు ఫార్ములా–ఈ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని చెప్పారు. ‘రేవంత్.. ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీతో అనుబంధంపై మీ సీఎంను ప్రశ్నిస్తారా?రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖఅదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధంపై ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు మౌనంగా ఉంటారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా నిరసనల పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.జాతీయ స్థాయిలో అదానీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం రేవంత్ నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో అదానీ గ్రూప్‌నకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడం విడ్డూరంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం పరస్పర ప్రయోజనాలకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు‘ఫార్ములా–ఈ రేసు ఆరోపణల్లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్‌లాగా తయారైంది’ అని అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. -
కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. కవిత కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్:రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్19) కవిత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు.సీఎం రేవంత్ రెడ్డి దయచేసి తెలుసుకోండి.మేము కేసీఆర్ సైనికులం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది.మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు. అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయి.పోరాటం మాకు కొత్త కాదు.అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరు’అని కవిత పేర్కొన్నారు. -
హరీశ్‌రావు ఏమైనా డిప్యూటీ లీడరా?: కోమటిరెడ్డి
ాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్‌రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్‌రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ హీట్ నెలకొంది.తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు. Are You a Deputy Leader or an MLA?-- Harish Rao Questioned by Minister Komatireddyమీకు LP లీడర్ లేడుహరీష్ రావు.. నువ్వు డిప్యూటీ లీడర్ వా..?లేక శాసనసభ్యుడిగా...??అసలు ఏ హోదాలో నువ్వు మైక్ అడుగుతున్నావ్-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#TelanganaAssembly •… pic.twitter.com/zjt3SUAHEG— Congress for Telangana (@Congress4TS) December 19, 2024అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్‌రావు ఎవరు?. డిప్యూటీ లీడర్నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?. ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. -
దమ్ముంటే ‘ఫార్ములా–ఈ రేస్’ పై చర్చించండి
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తద్వారా ఫార్ములా–ఈ రేస్ నిర్వహణలో ఏదో జరిగిందనే అపోహలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దమ్ముంటే ఫార్ములా–ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ బుధవారం లేఖ రాశారు. ‘ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు నా మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది. అసెంబ్లీ ఆవరణలో సీఎం ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై గంటన్నర పాటు చర్చించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలు గు గోడల నడుమ చర్చించడానికి బదులు గా శాసనసభ వేదికగా నాలుగు కోట్ల మంది ప్రజల ముందు సవివర చర్చ జరిగితే అందులో నిజానిజాలు ఏమిటో అందరికీ తెలు స్తాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నా రు. ‘తెలంగాణ, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఫార్ములా–ఈ రేస్’ నిర్వాహ కులతో ఒప్పందం చేసుకుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ధి చేకూరిందని నీల్సన్ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరోదఫా రేస్ జరగాల్సి ఉండగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. ఒప్పందం పారదర్శకంగా జరిగినా ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. నిజానిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉన్నందున శాసనసభలో ‘ఫార్ములా–ఈ రేస్’అంశంపై చర్చ పెట్టాలి’అని కేటీఆర్ సీఎం రేవంత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి: స్పీకర్‌కు బీఆర్ఎస్ వినతిఫార్ములా– ఈ రేస్ అంశంలో కేటీఆ ర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసింది. సీఎం రేవంత్‌కు కేటీఆర్ రాసిన లేఖలోని అంశాలను ఉటంకిస్తూ ప్రస్తుత సమావేశాల్లో సభకు అనుకూలమైన రోజు ఈ అంశంపై చర్చించాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ.వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, విజయుడు, మాణిక్‌రావు, చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్ ఉన్నారు. -
ఆటోల్లో అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై రోజుకో రూపంలో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఖాకీ చొక్కాలతో అసెంబ్లీకి వచ్చారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఉదయం 9.30కు చేరుకున్న నేతలు ఖాకీ చొక్కాలు ధరించి ఆటోల్లో అసెంబ్లీకి బయలుదేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బండారి లక్ష్మారెడ్డి స్వయంగా ఆటోలు నడిపారు.మార్గంమధ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వాహనాన్ని ఆపి నిరసన తీరు బాగుంది అంటూ వీడియో తీసుకున్నారు. కాగా బీఆర్ఎస్ జెండాలతో కూడిన ఆటోలతో పలువురు ఆటో కార్మికులు కేటీఆర్ నడుపుతున్న ఆటోను అనుసరిస్తూ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. ప్రవేశ ద్వారం వద్ద ఆటోలను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ సభకు వచ్చారు. అంతకుముందు ఆదర్శనగర్ క్వార్టర్స్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి జాబితాను గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వానికి ఇచ్చినా స్పందించడం లేదు. కాంగ్రెస్ ఇచి్చన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్మిక విభాగం నేతలు ఆటో డ్రైవర్ల సమస్యలతో కూడిన జాబితాను కేటీఆర్‌కు అందజేశారు. ఇలావుండగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు, హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ శాసనసభా పక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచి్చంది. అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలి కాంగ్రెస్ చలో రాజ్‌భవన్ సందర్భంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నిరసనకు దిగింది. సభ విరామ సమయంలో హరీశ్‌రావు నేతృత్వంలో లాబీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు అదానీ, రేవంత్‌రెడ్డి కలిసి ఉన్న ఫొటోలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ‘గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ, అదానీ..సీఎం భాయ్..భాయ్’అంటూ నినదించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు చేరుకుని, అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సభా హక్కుల ఉల్లంఘనపై చర్చకు అనుమతించండి శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా.. మూసీ సుందరీకరణ అంశంపై సీఎం రేవంత్ తరఫున మంత్రి శ్రీధర్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఆరోపించింది. ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. మూసీ డీపీఆర్, ప్రపంచ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అంశంలో మంత్రి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొంది. శాసనమండలి నియమావళి 168 (ఏ) కింద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుపై తామిచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి వినతిపత్రం సమరి్పంచింది. -
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం పచ్చిఅబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మూ సీ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు చెబుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌కు సెపె్టంబర్లో పంపించిన ప్రతిపాదనల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అని స్పష్టంగా రాసి ఉందని, కానీ, శాసనమండలి సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు మాత్రం మూసీ ప్రాజెక్టు కాదు.. మురుగునీటి శుద్ధికి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణాన్ని కోరామని తప్పుడు సమాధానం చెప్పారని విమర్శించారు.ప్రపంచ బ్యాంకుకు మూసీ కోసం ఋణం అడిగిన సాక్ష్యాధారాల నివేదికల ప్రతులను ఆమె విడుదల చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో రుణం కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచి్చన ఏడాదిలోనే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ, హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకుకు కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్ చేసి భవంతులు కడతామని స్పష్టంగా పేర్కొందని కవిత విమర్శించారు. -
శాసనసభలో కరీంనగర్ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ పంచాయితీకి కొద్దిసేపు శాసనసభ వేదిక అయ్యింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాగ్వాదం జరిగింది. అది వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. గురుకులాల్లో సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన అనంతరం బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాక ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు విద్య అందించలేదని, చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ‘ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్‌కు వచ్చి కాంగ్రెస్ హయాంలో చదువుకోలేదా? ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో చదివితే ఆ బాధ తెలుస్తది. ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదవలే. మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల గురించి’అని అన్నారు. దానికి గంగుల స్పందిస్తూ.. ‘మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచి్చన అన్నరు. పార్లమెంట్, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవయ్’అని వ్యాఖ్యానించారు. దానికి స్పందించిన పొన్నం ‘మొదటిసారి ఎమ్మెల్యేలకు ఏం తెలియదన్నట్లా, అజ్ఞానులన్నట్టా? పార్లమెంట్ మెంబర్ చేసిన, తెలంగాణ కోసం కొట్లాడిన. మీ నాయకుడు నిన్ను ‘షేర్ పటాక’అన్నాడు.తెలంగాణ ఉద్యమంల పార్టీ మారి ఇట్ల మాట్లాడితే ఎట్ల?’అని అన్నారు. దానికి కమలాకర్ బదులిస్తూ... ‘షేర్ పటాకనా, పెప్పర్ స్ప్రే డూప్లికేటా అని నేననలే. దొంగేడుపు ఏడవలే. కండ్లు పోయినయని ఏడువలె ’అని తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్లో జరిగిన సంఘటనలపై వ్యాఖ్యానించారు. దీంతో పొన్నం సీరియస్ అవుతూ ‘పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే ఒరిజనలా, డూప్లికేటా రికార్డులు పరిశీలిద్దాం. కుక్క షేర్ పటాక.. ఎక్కడ శవం కనిపిస్తే అక్కడికి పోయి ఏడుస్తడని వాళ్ల నాయకుడు అన్నడు’అని వ్యాఖ్యానించారు. దీంతో గంగుల స్పందిస్తూ ‘మేం కరీంనగర్ తెలంగాణ చౌక్ల కొట్లాడిన దాన్ని అసెంబ్లీ దాక తీసుకొస్తున్నాడు.కరీంనగర్లో ఎందుకు ఓడిపోయినవ్ , ఎందుకు హుస్నాబాద్ పారిపోయినవ్ అని నేను అన్ననా? జిల్లా విడిచిపెట్టి పోతరా ఎవరన్నా? ’అని కామెంట్ చేశారు. దీనికి స్పందిస్తూ ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేయడానికి పారిపోయిన్రా? దమ్ముంటే రా. నెక్ట్స్ టైం వచ్చి నామీద పోటీ చేయ్. వేరే నియోజకవర్గానికి పోవడం తప్పా? నీలాగా కోట్ల కోట్లు లేవు. నాకు దమ్ముంది. అక్కడికి పోయి గెలిచిన’అని తీవ్రస్థాయిలో స్పందించారు. మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో కరీంనగర్ పంచాయితీ సద్దుమణిగింది. -
ధరణి ముసుగులో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం
సాక్షి, హైదరాబాద్: ధరణి ముసుగులో విలువైన ప్రభుత్వ, ఇనాం, పడావు, ఎవాక్యుయీ భూములు వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ప్రభుత్వం గుర్తించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అన్యాక్రాంతమైన ఈ భూములను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దాదాపు పదిహేను వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని, చేతులు మారాయని తేలిందని.. కనిష్టంగా ఒక ఎకరా రూ.10 కోట్లు అని అనుకున్నా వీటి విలువ దాదాపు రూ.1.5 లక్షల కోట్లు ఉంటుందని చెప్పారు. బుధవారం శాసనసభలోని తన కార్యాలయంలో భట్టి మీడియాతో ముచ్చటించారు. 10 వేల ఎకరాలు ధారాదత్తం చేశారు ‘అన్యాక్రాంతమైన భూములే కాకుండా అస్సైన్డ్ భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. మళ్లీ ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించాలి. కానీ ఇబ్రహీంపట్నం మండలంలో పది వేల ఎకరాలను ధారాదత్తం చేశారు. గతంలో భూముల రిజి్రస్టేషన్ అనంతరం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ భూముల మ్యుటేషన్ జరిగి పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చేవి. కానీ ధరణి వచి్చన తర్వాత రిజి్రస్టేషన్ కాగానే వెంటనే మ్యుటేషన్ అవడం, ధరణి పోర్టల్‌లో వేలిముద్రలు, ఫోటో రాగానే.. అక్కడికక్కడే ఇతరులకు విక్రయించడం వల్ల అసలు ఆ భూముల చరిత్ర తెలియకుండానే క్రయ విక్రయాలు, మ్యుటేషన్లు జరిగిపోయాయి.ఇనాం, పడావు, ఎవాక్యుయీ ప్రాపర్టీ, ప్రభుత్వ భూములను ధరణిలో ఎంట్రీ చేసే సమయంలోనే పేర్లు మారిపోయాయి. ఒకసారి ధరిణిలో ఎంటర్ అయ్యాక వాటిని మార్చే అవకాశం లేకుండా పోయింది. కొన్నింటిని కావాలనే పార్ట్ ‘బీ’లో చేర్చారు. దీనిని అడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున భూములు చేతులు మారాయి. ధరణిలో ఒక్క భూ యజమాని పేరు మినహా కాస్తుదారులు/ అనుభవదారుల కాలమ్ లేకపోవడంతో ఇష్టానుసారం భూములు చేతులు మారాయి..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. పార్ట్ ‘బీ’భూముల్లోనే పెద్దయెత్తున దందా ‘ధరణికి ముందున్న రికార్డులను, ధరణిలోకి వచ్చిన తరువాత మారిన భూముల వివరాలను పరిశీలిస్తాం. పూర్తిస్థాయిలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. భూములు మూడు, నాలుగు చేతులు మారినా..అవి ఫ్రభుత్వానికి చెందిన భూములు అని తేలితే స్వాధీనం చేసుకుంటాం. ప్రధానంగా పార్ట్ ‘బీ’కింద పెట్టిన భూముల్లోనే ఈ దందా పెద్ద ఎత్తున సాగింది..’అని భట్టి అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా తెస్తాంమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు ప్రతి పైసా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేంద్రం రాష్ట్రాల వారీగా నిధులు కేటాయించదని, పథకాల వారీగా చేయాల్సిన ఖర్చునకు అనుగుణంగా కేటాయింపులు జరుపుతుందని అన్నారు. బుధవారం శా సనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కవిత, దయానంద్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు భట్టి సమాధానం చెప్పారు.గత పదేళ్ల నుంచి కేంద్ర ప్ర భుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఏడా ది కాలంగా వచి్చన నిధులకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం సభముందు ఉంచామని తెలిపారు. కేవలం ఏడాదిలో పదేళ్లలో సాధించిన దానికంటే మించి పురోగతి సాధించామని భట్టి పేర్కొన్నా రు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాల్సిందిగా సంబంధిత కార్పొరేషన్‌ను ఆదేశించామన్నారు. 2026 డిసెంబర్ నాటికి ‘పాలమూరు’ పూర్తి: మంత్రి ఉత్తమ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగిందని, దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు వచ్చాయని వెల్లడించారు.అర్చకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ధూపదీప నైవేద్యం కోసం నెల కు రూ.4 వేలు, గౌరవ వేతనం కింద రూ.6 వేలు చొప్పున మొత్తం రూ.10 వే లు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ పరిషత్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసు కొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. యాదగిరిగుట్టలో టీటీడీ స్థాయి లో పాలకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పలు బిల్లులకు ఆమోదం మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) పేరు పెడుతూ మండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ది యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లుతో పాటు తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సరీ్వస్ ట్యాక్స్ సవరణ బిల్లులను సంబంధిత మంత్రులు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
అదానీ..ప్రదాని.. దేశం పరువు తీశారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను పెంచిందని, కానీ అదానీ, ప్రధాని మోదీ కలిసి ప్రపంచం ముందు దేశం పరువు తీశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అమెరికాకు సంబంధించిన సంస్థలకు అదానీ లంచాలు ఇచ్చారని ఆ దేశ విచారణ సంస్థలు నివేదిక ఇచ్చినా అదానీ అక్రమాలపై ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అదానీపై వచి్చన ఆర్థిక అవకతవకల ఆరోపణలు, మణిపూర్ అల్లర్లపై కేంద్ర వైఖరికి నిరసనగా.. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించారు.సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వైపు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని రాజ్‌భవన్ రోడ్డులో కొంతదూరం వచి్చన తర్వాత అడ్డుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి తదితరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి, అదానీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. అదానీతో మోదీ లాలూచీ ఏంటి? ‘భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయి. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇచ్చాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్‌బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదు. అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది.ఆయన్ను కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. దేశ పరువు ప్రతిష్టను మంటకలిపిన అదానీపై విచారణ చేపట్టాలని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేశారు. అయినా మోదీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దేశాన్ని దోచుకున్న అదానీపై జేపీసీ వేయడానికి ప్రధాని ఎందుకు సిద్ధంగా లేరు? అదానీతో లాలూచీ ఏంటి? ఈ అంశంపై మాట్లాడేందుకు ఎందుకు ముందుకు రావడం లేదు? దేశం పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలి. ఇప్పటికైనా జేపీసీ వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేసేందుకు కూడా సిద్ధం..’అని సీఎం అన్నారు. అదానీపై కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి ‘అదానీ విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలి. మీరు ప్రజల వైపా.. అదానీ వైపా చెప్పాలి. బీఆర్ఎస్ జేపీసీ కోసం డిమాండ్ చేస్తే శాసనసభలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నిజానికి మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదు. ఇద్దరూ నాణానికి బొమ్మ, బొరుసు లాంటివారు. బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగానే ఆ పార్టీ అదానీపై స్పందించడం లేదు. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి బీఆర్ఎస్ లొంగిపోయింది..’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజల కోసమే దీక్ష: డిప్యూటీ సీఎం భట్టి ‘దేశ సంపదను, ఆర్థిక సంస్థలను మోసగిస్తున్న అదానీపై జేపీసీ వేసి చట్టపరమైన విచారణ చేపట్టాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో, దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టాం. ఈ దేశ, రాష్ట్ర సంపదను, వనరులను తమకు దగ్గరగా ఉండే కొద్దిమందికి దోచి పెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.మోదీ సహకారంతో అదాని ఈ దేశంలో చేస్తున్న దోపిడీ తీరును వివరించేందుకు ఏఐసీసీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అదానీ ఎన్నో కుంభకోణాలకు పాల్పడుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. సామాన్యులు, రైతులు రుణాలు చెల్లించడం ఆలస్యమైతే ఆస్తులను జప్తు చేసే ప్రభుత్వం.. అదానీ విషయంలో ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందని నిలదీశారు. -
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్‌ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్‌బుక్‌లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్‌తో ప్రారంభించి 33 మాడ్యూల్స్‌కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్‌లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్‌కు పెంచాం. ధరణి పోర్టల్‌లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
TG: గురుకులాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం(డిసెంబర్18) హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలోని గురుకులాల్లో వివిధ కారణాలతో విద్యార్థులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఎంత మంది విద్యార్థుల చావులకు కారణమవుతారని ప్రశ్నించారు. వెంటనే గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అక్కడక్కడా గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. తమ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల విద్యార్థులకు 40 శాతం డైట్ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 54 యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.మంత్రి పొన్నం వర్సెస్ గంగులఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎదురుదాడి చేశారు.దీనికి గంగుల స్పందిస్తూ మొదటిసారి సభకు వచ్చిన వ్యక్తి తాను మాట్లాడుతుండగా అడ్డుకోవడం సరికాదన్నారు. దీనిపై పొన్నం అభ్యంతరం చెప్పారు. తాను ఎంపీగా పనిచేశానని, తనను మొదటిసారి సభ్యుడు అనడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తాను డబ్బుల సంచులతో గెలిచేవాడని కాదని, హుస్నాబాద్‌కు పారిపోయి గెలవలేదన్నారు. సభ్యుడు తొలిసారి వచ్చినా ఎన్నిసార్లు వచ్చిన గౌరవం ఇవ్వాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు గంగులకు సూచించారు.గురుకులాల విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ గురుకులాలకు కనీసం భవనాలు కట్టలేకపోయిందని విమర్శించారు.గురుకులాల్లో ప్రతి పనిని పెండింగ్‌లో పెట్టిందన్నారు. తాము ఎప్పుడూ సామాన్యులవైపే ఉంటామని,గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు. -
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
Formula E case: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఫార్ములా ఈ-రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని లేద్వారా సవాల్ విసిరారాయన.‘‘ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నది. ఈ రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేసు నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు.రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నది. కాబట్టే మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి అని లేఖలో కోరారాయన.💥 దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే @KTRBRS లేఖ❇️ ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా నాపై, అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నది.❇️ ఈ అంశంపై ఇటీవల మీ… pic.twitter.com/Iv2fNkjAfl— BRS Party (@BRSparty) December 18, 2024 -
రేవంత్‌కు అదానీతో ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్:రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోందని, అదానీతో ఆయన ఢిల్లీలో దోస్తీ,గల్లీలో కుస్తీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ిమర్శించారు. బుధవారం(డిసెంబర్ 18) అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.‘రాజ్ భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మేము అదానీ ఫొటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. అదానీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న 12 వేల కోట్ల రూపాయల ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అదానీపై రేవంత్ పోరాటం నిజమైతే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి రేవంత్ అనుమతులు ఇస్తున్నారు. అదానీకి రేవంత్ కొమ్ముకాస్తున్నారు.రోడ్డుపై రేవంత్ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు.రేవంత్ అదానీకి ఏజెంట్లా పని చేస్తున్నారు.అదానీకి రెడ్‌కార్పెట్ వేసి తెలంగాణ పరువును రాహుల్ గాంధీ పరువును రేవంత్ రెడ్డి మంటకలిపారు. రేపు అసెంబ్లీలో అదానీ,రేవంత్‌రెడ్డి లింకుపై చర్చ పెట్టాలి. రాజ్ భవన్ ముట్టడిలో అదానీ గురించి రేవంత్ మాట్లాడలేదు. రేవంత్‌రెడ్డిని పార్టీ తిడితే 100 కోట్లు అదానీకి వాపస్ ఇచ్చారు.చట్టం అందరికీ సమానం అయితే రోడ్డుపై ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలపై సీవీ ఆనంద్ కేసులు పెట్టాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు కామెంట్స్..సీఎం ప్రకటన చేస్తే అమలు చేయాలి కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు..నవంబర్ 30 న 3 లక్షల 13 వేల మంది రైతులకు రెండో సారి రుణ మాఫీ చేసున్నం అన్నాడుఇంత వరకు 3 లక్షల 13 మంది రైతులకు 2474 కోట్లు ఖాతాలో పడలేదు19 నవంబర్ వరంగల్ స్వయం సంఘాల ఖాతాల్లో నగదు పడలేదుఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో రూ.281 పీఆర్సీ బకాయిలు కూడా జమ కాలేదుఅది చివరకు ఆర్టీసీ సంస్థనే మళ్ళీ వారి ఖాతాలో వేసిందిలక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తాం అని చాలా సార్లు చెప్పారు.కానీ ఇదో పెద్ద బోగస్ అని తేలిపోయింది.2015లోనే బీఆర్ఎస్ 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినం..ఇప్పుడు కాంగ్రెస్ ఇదే ఇస్తోంది.రూ.5 లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు. మిగత వాటికి వడ్డీ కట్టాల్సిందే.లక్ష కోట్లు అని చెప్పింది అంత అబద్ధంఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటీ ఇవ్వడం లేదుతులం బంగారంలేదు,స్కూటీ లేదు,న్యూట్రిషన్ కిట్ లేదుఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు.అన్ని ఉత్త మాటలేబతుకమ్మ చీరలు లేవురూల్స్ ప్రకారం సభను నడపడం లేదు.నాడు భట్టి,శ్రీధర్ బాబు ప్లకార్డులు పట్టుకోలేదా..ఇవాళ ఇదేం న్యాయం.పార్లమెంట్ లో మాత్రం ప్రియాంక గాంధీ రోజు ఒక బ్యాగ్ వేసుకోవచ్చు,రాహుల్ గాంధీ రోజు టీ షర్ట్ వేసుకోవచ్చు -
సభలో పొలిటికల్ రచ్చ.. అసెంబ్లీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలన్న హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడీవేడిగా కొనసాగుతున్నాయి. నేడు సభలో మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. సభలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. 10వేల కోట్లు దోచుకున్నాడు. రోడ్లు వేయడం బీఆర్ఎస్ నేతలకు చేతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకున్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం మాత్రం నాలుగు లైన్ల రోడ్లు ఫామ్ హౌస్ వరకు వేసుకున్నారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము. వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్ఆర్ఆర్ను పూర్తి చేస్తాం అన్నారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ మాట్లాడుతూ..‘వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి. సభలో ఎవరు తప్పు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా. కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలి అని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు బాధిస్తున్నాయి. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా హరీష్ రావు మాటలున్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్.. హరీష్‌రావుకు వాళ్ళ మామ గుర్తుకు వచ్చినట్టు ఉన్నాడు. అందుకు గుర్తుకొచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్‌లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడిందన్నారు. అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘హరీష్ రావు, బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
పరిపాలనా సౌలభ్యం కోసమే భాషల ఫార్ములా: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చాకే 21 భాషలకు స్థానం దక్కిందన్నారు. అలాగే, భాషలు.. మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయం అని చెప్పుకొచ్చారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత గల దేశం భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇంత వైవిధ్యత ఉన్న దేశం మరొకటి లేదు. 121 భాషలు, మన దేశంలో ఉన్నాయి. మన రాజ్యాంగంలో 14 అధికార భాషలుండేవి. మోదీ ప్రభుత్వం వచ్చాకా 21 భాషలకు స్థానం దక్కింది. భాషలు మన సంస్కృతి, వారసత్వాన్ని, మన జ్ఞాన సంపదకు నిలయాలు. ఎన్డీయే ప్రభుత్వం, వాజ్‌పేయి గారి నేతృత్వంలో ప్రాంతీయ భాషలకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. భాష మన సంస్కృతికి ఆత్మ వంటిదని వాజ్‌పేయి చెప్పేవారు.జ్ఞానాన్ని ప్రసరింపజేసేందుకు 1835లో మెకాలే ద్వారా భారత శాస్త్రీయ భాషల ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం.. 1956లో భాష ఆధారిత రాష్ట్రాల పునర్నిర్మాణం జరిగినపుడు.. దేశానికి సహకార సమాఖ్య, పాలనాపరమైన అంశాల కోసం భాష కీలకమైన అంశంగా మారింది. పాలనాపరమైన సౌలభ్యం కోసం మూడు భాషల ఫార్ములాను రూపొందించారు. ఈ ఫార్ములా వినియోగంలో ప్రజలు సంతృప్తిగా లేని కారణంగా మార్పులు తీసుకురావాలనే డిమాండ్ పెరిగింది. దీనికి అనుగుణంగా ప్రధాని మోదీ 2020లో NEP-2020 నూతన జాతీయ విద్యావిధానం ద్వారా కనీసం రెండు ప్రాంతీయ భాషలను విద్యార్థులు నేర్చుకునేలా ప్రోత్సాహాన్ని అందించారు’ అని కామెంట్స్ చేశారు. -
ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీశారు: సీఎం రేవంత్
Congress Chalo Raj Bhavan Updates..రాజ్‌భవన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ..ప్రధాని, అదానీ అనుబంధం మన దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తోందిదేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇచ్చే పరిస్థితిని తెచ్చారుఅదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారుజేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందిఅదానీ విషయంలో ప్రధానిని అడిగినా, కడిగినా కనీసం మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రి రాజ్‌భవన్ వద్దకు నిరసన ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మా నిరసన కొందరికి నచ్చకపోవచ్చు. 75 ఏళ్ల కష్టపడి కాంగ్రెస్.. దేశ ప్రతిష్టను పెంచింది. ప్రధాని, అదానీ కలిసి దేశం పరువు తీస్తున్నారు.అదానీ లంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయి.ఈ విషయంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.ఈ అంశంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీశారు.కానీ, దీనిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు.మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిరసన చేపడుతున్నాం.అదానీపై విచారణ జరగాలి.అదానీ అంశంపై జేపీసీ వేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.కానీ, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది.దీనిపై అవసరమైతే రాష్ట్రపతిభవన్ వద్ద కూడా నిరసనలు తెలుపుతాం.విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన నేను కూడా నిరసనల్లో పాల్గొనాల్సి వచ్చింది.ప్రజాస్వామ్యాన్ని, పప్రజా ధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.నక్కలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది.నేను ధర్నా చేయను.. మరి బీఆర్ఎస్ నేతలు చేస్తారా?.తన విధానమేంటో బీఆర్ఎస్ చెప్పాలి.అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా వద్దా చెప్పండి.ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ను అనుబంధం ఉంది.అందులో భాగంగానే అదానీ అవినీతిపై బీఆర్ఎస్ మాట్లాడటం లేదు.బీఆర్ఎస్ నేతలు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం.. బీఆర్ఎస్ నేతలు వస్తారా?. 👉రాజ్‌భవన్ వద్ద రోడ్డుపై సీఎం రేవంత్, భట్టి, కాంగ్రెస్ నేతలు బైఠాయింపు..నిరసనలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు..కాసేపట్లో గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న హస్తం నేతలు.అదానీ ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మౌనంపై నిరసనలు.ఏఐసీసీ పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు. 👉టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నిరసనల్లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. 👉నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు బయలుదేరారు. 👉అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు.👉దేశంలో అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై ఏఐసీసీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార, ఆర్థిక రంగాన్ని, పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి, మోసం, మనీలాండరింగ్, మార్కెట్ మానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్‌లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోదీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
అప్పుల లెక్కలు.. అన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అప్పులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పులు.. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వేడెక్కించాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సవాళ్లు.. ప్రతి సవాళ్లతో స భ అట్టుడికింది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావుల మధ్య వాడివేడి వాదనలు కొనసాగాయి. అసత్యాలతో ప్రజలను త ప్పుదోవ పట్టిస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ వారివారి లెక్కలను సభ ముందుంచారు. ప్రివిలేజ్ మోషన్‌పై మాట మార్చారు: భట్టి ‘రాజకీయాలు చేయటమే లక్ష్యంగా వ్యవహరించే హరీశ్‌రావు సభలో అన్నీ అబద్ధాలే చెబుతారు. ఏడాదిలో మేం చేసిన అప్పులపై ఆయన చెప్పే లెక్కలు సరికాదు. పదేళ్ల వారి పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు కొంత అప్పు చేయక తప్పలేదు. ఇక పదేళ్ల వారి హయాంలో చేసిన అప్పుల లెక్కల్లోనూ ఆయనది ప్రజలను తప్పుదారి పట్టించే పద్ధతే. అందుకే మేం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో వాస్తవాలను ప్రజల ముందుంచాం. మళ్లీ చర్చ పెడితే నిరూపించేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాల పాలనలో తప్పులు చేసినందుకు గత డిసెంబర్లో జనం శిక్షించారు.ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలప్పుడు డిపాజిట్ దక్కకుండా వారికి మతిపోయేలా చేశారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఆ పార్టీది భూస్వామ్య మనస్తత్వం. భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం చేయరా? అని ఖమ్మంలో ఓ విలేకరి అడిగినప్పుడు, వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పా. దాని ఆధారంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి, ఇప్పుడు అప్పుల మీద అవాస్తవాలు మాట్లాడితే ఇచ్చామంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారికి అనుకూలంగా సభ నియమాలు రూపొందించుకున్నారు.వారి నిబంధనల్లోనే సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ఉంది..కానీ నిన్న తీసుకొచ్చారు. వీరా నామీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? వారి హయాంలో స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నప్పుడు బీఏసీలో పాటించిన పద్ధతినే మేం ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఉన్నారు. వ్యక్తి మారారు తప్ప స్పీకర్ స్థానం అదే. ఆ స్థానాన్ని గౌరవించాలి కదా.. నిన్న బీఏసీలో కాగితాలు విసిరి బయటకొచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఎఫ్ఆర్బీఎం కింద మేము రూ.51,277 కోట్లు మాత్రమే అప్పు చేశాం. గ్యారంటీల కింద రూ.61,991 కోట్లు, గ్యారంటీ లేని రుణా లు రూ.10,999 కోట్లు సమీకరించాం. మీ హయాంలో చేసిన అప్పుపై వడ్డీ రూపేణ రూ.66 వేల కోట్లు చెల్లించాం. మీరు పెట్టిపోయిన పెండింగు బిల్లులు రూ.40 వేల కోట్లలో ఇప్పటికి రూ.14 వేల కోట్లు చెల్లించాం.ప్రజల ఆస్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఔటర్ రింగురోడ్డును ఆ ప్రభుత్వం 30 ఏళ్ల లీజు పేరుతో అమ్ముకుంది. అదే పద్ధతిలో మేం వచ్చే 30 ఏళ్ల కాలానికి జీఎస్టీ లాంటి ఆదాయ వ్యవహారాలను ఏ అదానికో, అంబానికో లీజుకిస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి?..’అని భట్టి నిలదీశారు. పరిమితంగానే మా అప్పులు: హరీశ్‌రావు ‘మా ప్రభుత్వం పరిమితంగా చేసిన అప్పును తప్పుడు లెక్కలతో పెంచి భూతద్దంలో చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధపు అప్పుల బూచి చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆటలు సాగనివ్వం. మేం చెప్పే లెక్కలే సరైనవని నిరూపించేందుకు సిద్ధం. సభలో ప్రత్యేక చర్చ పెట్టండి, ఆడిటర్లను, ఆర్థిక నిపుణులను పిలిపించుకోండి.. నేను చెప్పేవే సరైన లెక్కలని నిరూపిస్తాను.ఇది నా ఛాలెంజ్. ఆర్బీఐ నేటి లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.1,27,208 కోట్లు. ఐదేళ్లలో చేయబోయే అప్పు దాదాపు రూ.6,36,400 కోట్లు. కానీ మా ప్రభుత్వం పదేళ్ల కాలంలో తెచి్చన అప్పులు కేవలం రూ.4,17,496 కోట్లు మాత్రమే. ‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఆయన ఉటంకించారు) కరోనా కారణంగా కేంద్రం అదనంగా 1.75 శాతం అప్పు తీసుకోవాలని సూచించడంతో తీసుకున్నాం. లేకపోతే అంతకూడా అప్పు అయ్యేది కాదు.దీనిపై నేను సవాల్ విసురుతున్నా.. చర్చకు సిద్ధం. మేం రూ.6,71,757 కోట్లు అప్పు తీసుకున్నామని ఒకసారి, రూ.7 లక్షల కోట్లు అని మరోసారి, సభలో రూ.7,11,911 కోట్ల అప్పులంటూ నోటికొచి్చనట్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తా. ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఏసీతో సంబంధం లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడం వింతగా ఉంది. గత సభలో అప్పుల గురించి తప్పుడు లెక్కలు చూపినందుకే భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ మరో అంశంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తాం..’అని హరీశ్‌రావు సవాల్ చేశారు. -
కేటీఆర్‌పై కేసు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ–కార్ల రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని రాష్ట్ర అవినీతి నిరోధక విభాగాన్ని (ఏసీబీ) రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. ఫార్ములా ఈ–కార్ల రేసు వ్యవహారంలో జరిగిన అవకతవకతల విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ నిర్వహించేందుకు అవినీతి నిరోధక చట్టం–2018లోని సెక్షన్ 17(ఏ) కింద రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతినిచ్చారని తెలిపారు.అప్పట్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన అర్వింద్‌కుమార్‌తో పాటు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ డీఎల్ఎన్ రెడ్డి తదితరులను సైతం కేసులో సహ నిందితులుగా చేర్చి విచారించాలని సీఎస్ ఆదేశించారు. కేటీఆర్, తదితరులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని, సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నాటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఫార్ములా ఈ–కారు రేసు నిర్వాహకులకు చెల్లింపులు జరిపినట్టు అర్వింద్‌కుమార్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. కాగా గవర్నర్ ఇచ్చిన అనుమతి లేఖతో పాటు అర్వింద్‌కుమార్ ఇచ్చిన వివరణ పత్రాలను సీఎస్ తన లేఖకు జత చేసినట్లు తెలిసింది.త్వరలో నోటీసులు!సీఎస్ లేఖ నేపథ్యంలో ఏసీబీ తక్షణమే కేటీఆర్, ఇతరులపై అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు వారికి త్వరలోనే నోటీసులు జారీ చేయవచ్చని పేర్కొన్నాయి.