breaking news
-
‘నన్ను నెట్టేస్తావా.. కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తే ఇంత అక్కసా?’
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(kaushik reddy) తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. నిన్న (ఆదివారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) లో కౌశిక్‌రెడ్డి తనను నెట్టివేశాడని సంజయ్ కుమార్(Sanjay Kumar)ఆరోపించారు. ‘ నిన్న జరిగింది అధికారిక సమావేశం. నన్ను కౌశిక్‌రెడ్డి నెట్టేశాడు. కౌశిక్‌రెడ్డి ఇలా చేయడం ఎంతవరకూ కరెక్ట్.నేను ఎప్పుడూ కూడా ఏ వ్యక్తిని దూషించలేదు. కౌశిక్‌రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయి. కౌశిక్‌రెడ్డికి బెదిరించడం అలవాటు,. వరంగల్‌లో బెదిరించి సెటిల్మెంట్ చేశాడు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశాను. స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోవాలి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను ఎవరూ హర్షించరు. నేను ప్రజా సమస్యలపై మాట్లాడుతామనుకుంటే నాకు ఆటంక కల్గించాడు. జగిత్యాల అభివృద్ధి కొరకే ప్రజలు నన్ను గెలిపించారు.. అభివృద్ధి చేయడం నా ధర్మం . కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తే ఇంత అక్కసు ఎందుకు? అని ప్రశ్నించారు సంజయ్.సమీక్షా సమావేశంలో తోపులాటఆదివారం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్‌రావు అన్నారు. భట్టి గోబెల్స్‌ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్‌నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
కౌశిక్‌రెడ్డిVsసంజయ్‌కుమార్: గంగుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ కుమార్ వ్యవహారంలో కౌశిక్‌రెడ్డిని పోలీసులు లాక్కెళ్లడం విచారకరమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వచ్చారని, అక్కడికి మమ్మల్ని ఆహ్వానిస్తేనే వెళ్లామని తెలిపారు. ఎమ్మెల్యేల బాహాబాహీపై గంగుల సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘సమావేశం ఎజెండా క్లియర్‌గా ఉంది. ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని తీసుకెళ్లాలనుకున్నాం. మా డిమాండ్స్ సభ ముందు పెట్టాం. ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని వాటి కోసం ఫొటోలు దిగినవారంతా భ్రమలో ఉన్నారు. ఇళ్లపై క్లారిటీ ఇవ్వాలని కోరాం. దీనిపై సమాధానం రాలేదు.ఎమ్మెల్యేను లాక్కెల్లడం నేనెప్పుడూ చూడలేదు. ముగ్గురు మంత్రులు అనుమతిస్తేనే లాక్కెళ్లారా..? అనుమతిస్తే మీరు సభ నడపడంలో విఫలమైనట్టే. మీ ఆదేశాలు లేకుండా పోలీసులు స్టేజ్ ఎక్కారంటే మీరు క్షమాపణ చెప్పాలి. సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కౌశిక్ ఇరిటేట్ అయ్యాడు. కోపతాపాలు సర్వసాధారణమే అయితే వాటిని కంట్రోల్ చేయాలి.ఒక ఎమ్మెల్యేను గుంజుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతమందిపై మీరు కేసులు పెడతారు?అదేమైనా బలప్రదర్శన వేదికనా..? పోలీసు కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కౌశిక్,సంజయ్ మధ్య ఏం జరిగిందనేది డిఫరెంట్, అది వ్యక్తిగతం. కానీ, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారనేది మా ప్రశ్న’అని గంగుల అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
మందా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్ మీడియాతో అన్నారు. అధికారిక లాంఛనాలతో.. మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రముఖుల సంతాపంమందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మందా ప్రస్థానంనాగర్కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. -
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్‌కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్‌ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలన్నారు. -
ఇదేనా రైతురాజ్యం: హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్‌రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్.అందుకే ఈ దాడులు..అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తోంది. రేవంత్‌రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్‌రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు. -
ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్ రాజీనామా చేయాలి. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. -
పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అధికారం ఉన్నా లేకున్నా చాలా మంది సిద్ధాంతం కోసం పని చేశారని.. అలాంటి రాజకీయాలు తెలంగాణలో మళ్లీ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విధానపరమైన లోపాలు ఉంటే ప్రతిపక్షం ఎత్తిచూపాలన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనిక’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యాసాగర్‌రావు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. సుదీర్ఘకాలం విద్యాసాగర్‌రావు ప్రజా జీవితంలో ఉన్నారుఆయన సమర్థతను ప్రధాని గుర్తించారన్నారు.విద్యార్థి రాజకీయాలలో పనిచేస్తే సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారు. విద్యార్థి రాజకీయాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. ఎవరి పాత్ర వాళ్లు పోషించాలి. పాలక పక్షం తప్పులను ఎత్తిచూపే హక్కు ప్రతి పక్షాలకు ఉంది. సభలో నేడు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పాలకపక్షం, ప్రతి పక్షం మధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి నాడు విద్యాసాగర్ లాంటి వాళ్లు కృషి చేసే వాళ్లు. 11 నెలల్లో ఏ ఒక్క సభ్యుడ్ని బయటకు పంపలేదు. చర్చ సజావుగా సాగాలని మేము సభ్యులను సస్పెండ్ చేయలేదు’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘గోదావరి జలాల వినియోగం నాడు విద్యాసాగర్ కృషి చేశారు. గోదావరి జలాల వినియోగం సంపూర్ణంగా పూర్తికాలేదు. విద్యాసాగర్ అనుభవం మనకు అవసరం. తమ్మిడిహట్టి వద్ద భూ సేకరణ కోసం ఎవరి వద్దకైన వెళ్తా.. భేషజాలు నాకు లేవు. 5 ట్రిలియన్ ఏకానమి తీసుకురావాలని లక్ష్యంగా దేశం పెట్టుకుంది. అందులో ఒక ట్రిలియన్ ఏకానమి తెస్తానని చెప్పాను. రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్ అయితేనే హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి అవుతుంది. ఆటో మొబైల్ పరిశ్రమలు తేవడానికి సహకరించాలని మోదీని కోరాను. కాజీపేట రైల్వే కోచ్ పనులు వేగవంతం చేయాలని ప్రధానిని కోరాను’’ అని రేవంత్ చెప్పారు. -
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! -
ఈ నెల 27న రాష్ట్రానికి ఖర్గే, రాహుల్
సాక్షి, హైదరాబాద్: ఈనెల 27వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించనున్న జైబాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సంవిధాన్ బచావో బహిరంగ సభకు వీరు హాజరవుతారని చెప్పారు. ఈనెల 27న వీలుకాకుంటే వచ్చే నెల మొదటి వారంలో ఖర్గే, రాహుల్‌లు వస్తారని అన్నారు.శనివారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్టి మాట్లాడుతూ, ఈనెలాఖరుకల్లా మిగిలిన కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి చేస్తారని, ఈ మేరకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. దీంతో పాటు పార్టీ కార్యవర్గాన్ని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని చెప్పారు. ఈసారి టీపీసీసీకి ముగ్గురు లేదా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, ఎంతమందికి ఆ పదవి ఇవ్వాలన్న విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కూడా మారుస్తామని, సమర్థులైన నాయకుల కోసం చూస్తున్నామని చెప్పారు.పార్టీ కార్యవర్గం నియామకంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏం మాట్లాడారన్నది పరిశీలించాల్సి ఉందని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి త్వరలోనే చేరికలుంటాయని, ఎమ్మెల్యేలు కూడా చేరతారని మహేశ్‌గౌడ్ వెల్లడించారు. ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని, 15వ తేదీన ఏఐసీసీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటామన్నారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC candidate)ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి పేరు చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. అందరి రిపోర్టు కేసీ వేణుగోపాల్ వద్ద ఉందన్న మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ నేతలందరూ వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీలు వేస్తామన్న ఆయన.. పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పనిచేసిన నాయకులకే పదవులు వస్తాయని.. కార్పొరేషన్ పదవుల భర్తీ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని చెప్పారు.ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్ -
క్లైమాక్స్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడెవరన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు ఎవరికి వారు తమ తమ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అకస్మాత్తుగా బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి కిషన్‌రెడ్డి తాత్కలికంగా బీజేపీ సారథ్య బాధ్యతలు నెట్టుకొస్తున్నారు. అయితే ఫుల్ టైం అధ్యక్షుడిగా రాష్ట్రమంతగా తిరిగి పార్టీని పటిష్టం చేసే నాయకుడికోసం తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. అయితే సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వం పేరుతో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టింది.అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. కానీ ఇప్పటి వరకు అధ్యక్షుడి నియామకం హైకమాండ్ ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. దానికి ప్రధాన కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ ఎక్కువకావడంతో పాటు, ఒకరిపై ఒకరు పోటాపోటీగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక బీజేపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఒకరికి పదవి ఇస్తే మరొకరు పనిచేయకుండా, సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ ఎంపిక ప్రక్రియను సాగదీస్తోంది. అయితే, అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఇద్దరు అధిష్టానం పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని తమతమ బలాలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటలకు బలం కాగా, ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. మరో వైపు ధర్మపురి అరవింద్ రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించి తన సత్తాను చాటారు. తొలి ప్రయత్నంలోనే కేసీఆర్ కూతరు కవితను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డ అరవింద్ రెండో సారి కూడా గెలిచి తాను బలమైన నేతనని నిరూపించుకున్నారు.అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని, అందరినీ కలుపుకుపోలేరని ఆయన వ్యతిరేకవర్గం ఫిర్యాదులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతల బలాలను, బలహీనతలను అధిష్టానం బేరీజు వేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ బీసీని తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో బీజేపీ కూడా ఈసారి బీసీకే సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఫ్లోర్ లీడర్‌గా మహేశ్వర్ రెడ్డిని నియమించిన అధిష్టానం, అధ్యక్ష పదవి బీసీకే అప్పగిస్తామనే సంకేతం పంపింది. ఈ కోణంలో కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లో ఎవరో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఏకాభిప్రాయం కుదరకపోతే కిషన్‌రెడ్డిని యథావిధిగా మరికొంత కాలం కొనసాగించే అవకాశముంది. -
‘కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది’
యాదాద్రి: భువనగిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాడిగా ఆమె ఆరోపించారు. ‘ కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం ఉంది. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేస్తున్నారు. ఏఐసీసీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వల్లించే మొహబ్బత్‌కి దుకాన్ ఒక బూటకం. కాంగ్రెస్‌ది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణం. కాంగ్రెస్ యువజన విభాగం గూండాల విభాగంగా మారింది. కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిదర్శనం. కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి.భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరు’ అని కవిత హెచ్చరించారు.కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా తీవ్రంగా మారింది. . భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే: కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు: కేసీఆర్ -
భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
సాక్షి, భువనగిరి: బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీఎంపై బీఆర్ఎస్ నేత కంచర్ల వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఎన్ఎస్యూఐ కార్యకర్తల దాడిలో ఫర్నీచర్ ధ్వంసమైంది.కాగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీఎం పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కార్యాలయం భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామంటున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. భువనగిరి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన కేటీఆర్బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందన్నారు. ఇందిర రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండా రాజ్యం చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, కాంగ్రెస్ పార్టీ గుండాలను పంపి దాడులు చేయించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ పేర్కొన్నారు.ఎన్నుకున్న ప్రజలతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తోన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పదేళ్లపాటు ప్రశాంతంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం, ఈ రోజు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు, గుండాగిరి తమ మార్కు పాలన అని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించుకుంటుందన్నారు. మా పార్టీ కార్యకర్తల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. వెంటనే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, వారి వెనుక ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
బీఆర్ఎస్ రైతు మహాధర్నా మళ్లీ వాయిదా
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. నల్గొండలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy) నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతీ తెలిసిందే. రైతు భరోసా(Rythu Bharosa) కుదింపుపై రైతుల ఆగ్రహాన్ని ప్రజలను చూపించాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఈ కార్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్‌తో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఈ మహాధర్నా నిర్వహించాలని భావిస్తోంది. -
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఎన్నికలు జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తన అభ్య ర్థులను ప్రకటించింది. కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి, ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య, నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా ఆదేశాల మేరకు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సి.అంజిరెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామచంద్రాపురానికి (ప్రస్తుతం సంగారెడ్డి) చెందిన సి.అంజిరెడ్డి డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్తగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలకు దగ్గరయ్యారు. రెండు దశాబ్దాలుగా ఆయన ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పలు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పేద విద్యార్థులు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తున్నారు. అంజిరెడ్డి భార్య గోదావరి అంజిరెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.మల్క కొమురయ్య: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన కొమురయ్య ఉస్మానియా వర్సిటీ నుంచి బీఈ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఆయన పలు విద్యాసంస్థలను నెలకొల్పారు. పాఠశాల స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్‌లలో పలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్ చైర్మన్‌గా ఉన్నారు. పులి సరోత్తమ్‌రెడ్డి: వరంగల్‌కు చెందిన సరోత్తమ్‌రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 21 ఏళ్లపాటు స్కూల్ అసిస్టెంట్‌గా, పదేళ్లు హెడ్‌మాస్టర్‌గానూ సేవలందించారు. 2012 నుంచి 2019 దాకా పీఆర్టీయూకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. టీచర్స్ జేఏసీలో భాగంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, యూనియన్ నాయకుడిగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. -
మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పసలేని కేసులు నమోదు చేసి, పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ‘ఫార్ములా ఈ– రేస్’కేసులో ఏసీబీ విచారణకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గురువారం ఏసీబీ విచారణ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, శుక్రవారం తన భార్యతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో నేత కార్తీక్‌రెడ్డి కూడా కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలు.. తదితర అంశాలను ఈ సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఇదిలా ఉండగా, ‘రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పిచ్చి కేసులతో పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక గందరగోళం సృష్టించి స్థానిక సంస్థల గండం నుంచి బయట పడేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జనంతో ఉంటే వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఏడాదిలోనే కాంగ్రెస్ తేలిపోయింది‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. ఉన్న పథకాలు అమలు చేయలేక, కొత్త పథకాలు తెచ్చే తెలివిలేక ప్రభుత్వం చేతులెత్తేసింది’అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎన్నికల హామీలేవీ అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైందని, గతంలో మనం చేసిన మంచితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెడును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందని ఆయన అన్నట్లు్ల సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేస్తే ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి. పండుగ తర్వాత దృష్టి అంతా పార్టీ నిర్మాణం, బలోపేతంపైనే ఉంటుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
రేవంత్.. టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా..‘ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయి.అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతాను. మాట తప్పం , మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూటర్న్?. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు.టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి… pic.twitter.com/hO1Q7ELAWE— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025 -
వికారాబాద్ ‘సీఎం’ అనుముల తిరుపతి రెడ్డికి శుభాకాంక్షలు!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన సాగుతోందన్నారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి(రేవంత్ రెడ్డి సోదరుడు) గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు! అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి(Tirupati Reddy) పోలీసులు సేవలు చేయడంపై బీఆర్ఎస్, కేటీఆర్ స్పందించారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి రాచమర్యాదలు చేయడంపై ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ..‘రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన. అనుముల రాజ్యాంగం నడుస్తోంది అనడానికి ఇదే నిదర్శనం. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్. బూట్లు తీయించి, స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి చేసినట్టు పరేడ్ చేయించారు. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ! అంటూ మండిపడ్డింది.రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన.అనుముల రాజ్యాంగం నడుస్తోంది అనడానికి ఇదే నిదర్శనం 👇కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్.బూట్లు తీయించి, స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి, ప్రధానమంత్రి,… pic.twitter.com/YmitO3eRWT— BRS Party (@BRSparty) January 10, 2025ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్ ట్విట్టర్లో..‘తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఒక్క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే.. ఇంకో అర డజన్ మంది ఫ్రీగా వచ్చారు!. 1+6 ఆఫర్ సీఎం వ్యవస్థని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో!. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు!. సీఎం రేవంత్ రెడ్డి గారు నాది ఒక చిన్న విన్నపం! ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను!. IVRS పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక, తిరుపతి రెడ్డికి మర్యాదలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం… ఒక్క CM ని ఎన్నుకుంటే….ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారు! 1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థ ని స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమో! వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు! సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక…నాది ఒక చిన్న… https://t.co/IqaWMekseD— KTR (@KTRBRS) January 10, 2025 -
వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బలవంతంగా పెట్టించిన కేసులో విషయం ఏమీ లేకపోవడంతో ఏసీబీ అధికారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ‘పాడిందే పాడరా’ అన్నట్లు 82 ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. తెలంగాణ ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లుగా నిబద్ధతతో, పైసా అవినీతికి తావు లేకుండా పనిచేశా అని చెప్పా. ఏసీబీ మళ్లీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.ఇలాంటి కేసులు వంద పెట్టినా ఎదుర్కొంటా. ఏడాది కాలంగా లగచర్ల, హైడ్రా, విద్యుత్ చార్జీల పెంపు వంటి అనేక అంశాలపై కొట్లాడుతున్నాం. కేసులు పెట్టి మా కేడర్, ప్రజల దృష్టిని రేవంత్ మళ్లించలేరు. అవసరమైతే తెలంగాణ కోసం చస్తాను తప్ప ఇలాంటి కేసులకు తలవంచేది లేదు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులతో విచారణకు హాజరైన కేటీఆర్.. గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఉదయం విచారణకు వెళ్లే ముందు నందినగర్ నివాసం వద్ద కూడా ఆయన మాట్లాడారు.అణా పైసా అవినీతి లేదని చెప్పా‘తెలంగాణకు పెట్టుబడులు తేవడం, ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలనే దూరదృష్టితో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడంతో పాటు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే కష్టపడి ఫార్ములా ఈ రేస్‌ను తెచ్చానని చెప్పా. ఇందులో అణాపైసా అవినీతి లేదని స్పష్టం చేశా. అలాంటి గలీజు పనులు చేయడం రేవంత్‌కు అలవాటు అని కుండబద్ధలు కొట్టి చెప్పా. ఇక్కడ నుంచి డబ్బులు పంపాం.. డబ్బులు అందినట్లు ఎఫ్ఈఓ (ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్) వాళ్లు ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని చెపితే ఏసీబీ అధికారులు నీళ్లు మింగుతున్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ ఇతరులను కూడా పంపి పైశాచిక, శునకానందం పొందాలని చూస్తున్నాడు. రేవంత్ తరహాలో నేను లుచ్చా పనులు చేయలేదు. కేబినెట్లో ఉంటూ లాండ్ క్రూజర్లు కొనుగోలు చేయలేదు. బావ మరుదులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టు ఇవ్వలేదు. రేవంత్ తరహాలో డబ్బు సంచులతో దొరకలేదు. పెట్టుబడులు తెచ్చేందుకు విదేశాలు తిరిగా. రేవంత్ పెట్టే కేసులకు భయపడేవారెవరూ తెలంగాణలో కానీ బీఆర్ఎస్లో కానీ లేరు..’ అని కేటీఆర్ అన్నారు.రేవంత్‌ను ఎవరూ సీఎంగా గుర్తించడం లేదు‘ఇదొక లొట్టపీసు కేసు.. ఆయనో లొట్టపీసు సీఎం. రాష్ట్రంలో రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించడం లేదు. తనను గుర్తించని వారిపై కేసులు పెట్టి లోపలేస్తున్నడు. ఏడాది తర్వాత కూడా ఆయనను ఎవరూ సీఎంగా గుర్తు పట్టకపోతే నేనేం చేయాలి. కేసులకు భయపడేది లేదు, బాధపడేది లేదు. లేని అవినీతిని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎక్కడ దొరుకుతుంది? ఏసీబీకి రేవంత్ మళ్లీ ప్రశ్నలు పంపితే తిరిగి పిలుస్తారేమో. న్యాయస్థానాల మీద విశ్వాసం ఉంది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతా. కేసీఆర్ సైనికులుగా ఈ ఏడాదంతా రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలుపై నిలదీస్తూనే ఉంటాం. ఎంత కొట్టినా రైతు భరోసా, రూ.4 వేల ఆసరా పెన్షన్, మహిళలకు ప్రతి నెలా రూ.2,500, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడుతాం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టం వస్తే మేమున్నామంటూ వచ్చిన వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ ఒక లొట్ట పీసు సీఎం అని, తనదొక లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం) ఏసీబీ విచారణలో తనను అడిగిన ప్రశ్నలే పదే పదే అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది తర్వాత కూడా రేవంత్‌ను ఎవరూ ముఖ్యమంత్రిగా గుర్తించలేదని విమర్శించారు. ఏసీబీ(ACB) విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘ఎవరకీ రేవంత్ పేరు కూడా గుర్తు ఉండటం లేదు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టినట్లు రేవంత్ తీరుంది. ఏసీబీ అధికారుల వద్ద ప్రశ్నలు ఏమీ లేవు. రేవంత్ రెడ్డి ఏమైనా ప్రశ్నలు పంపితే ఏసీబీ మళ్ళీ పిలుస్తోందేమో. ఏసీబీ 80 పైగా ప్రశ్నలు అడిగింది. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగింది. ఏసీబీకి కూడా ఈ కేసులో ఏమీ లేదని తెలుసు. రేవంత్‌రెడ్డి జైలుకి వెళ్లారు కాబట్టే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నారు. ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా సమాధానం ఇస్తా. రేపటినుంచి ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తాం. యాధావిధిగా పార్టీ క్యాడర్ ప్రజా సమస్యలపై పోరాడాలి’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.ఏడుగంటల పాటు ఏసీబీ విచారణఫార్ములావన్ ఈ -కార్ కేసులో భాగంగా ఈరోజు(గురువారం) కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. సుమారు ఏడు గంటలపాటు కేటీఆర్‌ను ఏసీబీ విచారించింది. అయితే మరొకసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
రేవంత్ ఒక లొట్టపీసు సీఎం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై పెట్టిన కేసు లొట్టపీసు (డొల్ల) అని, రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన తాను రేవంత్ సర్కారు పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ సమయం నాటి పరిస్థితులు, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరుల త్యాగాలతో పోలిస్తే తాను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘నాపై పెట్టిన కేసును రేవంత్ తీర్చుకుంటున్న ప్రతీకారమని ప్రజలు అనుకుంటున్నారు. తమ భూముల కోసం లగచర్ల గిరిజనులు 40 రోజులపాటు జైలులో గడిపిన దానితో పోలిస్తే నేను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదు. అక్రమ కేసులపై చట్ట ప్రకారం పోరాడుతా. కేసుల గురించి ఆలోచించకుండా రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ మోసగిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలి. కొత్త సంవత్సరంలో తెలంగాణ కోసం కలిసి నడుస్తూ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఏడాది కాలంలో పార్టీకి కొత్త కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి’అని కేటీఆర్ వెల్లడించారు.కేటీఆర్‌కు ఆపద వస్తే అండగా నిలుస్తాం: మాజీమంత్రి హరీశ్రావుప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో రోజురోజుకూ రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుండటంతో అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. ఆపద సమయంలో కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచిన తరహాలో కేటీఆర్‌కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని చెప్పారు. రేవంత్ ఏడాది పాలన కోతలు, ఎగవేతలు, కేసులు అన్నట్టుగా తయారైందన్నారు. రేవంత్ ప్రభుత్వం హామీలు ఎగవేస్తున్న తీరును ప్రశ్నించిన తనపై మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. లగచర్ల, అల్లు అర్జున్, టీఎస్ నుంచి టీజీగా మార్పు, తెలంగాణ రాజముద్ర మార్పు వంటి దృష్టి మళ్లింపు కార్యక్రమాలు మినహా ప్రభుత్వం ఏడాదిలో చేసిందేమీ లేదని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బు లు లేవని చెబుతున్న సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల భూముల కోసం కల్వకుర్తి వరకు ఆరు లేన్ల రహదారిని వేసుకుంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో స్వర్ణయుగం రాగా, కాంగ్రెస్ పాలనలో కారుచీకట్లు కమ్ముకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రసంగించారు. -
మరో 20 ఏళ్లు పవర్లో ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ ఐదేళ్ళే కాకుండా మరో 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పనిచేయాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు. సీఎంతో సహా రాష్ట్ర కేబినెట్, టీపీసీసీ అధ్యక్షుడు, అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రశంసించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతమేర వెనుకబడ్డామని చెప్పారు. ప్రజలను విస్తృతంగా కలవడం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చునని సూచించారు. రాష్ట్ర మంత్రులు విధిగా నెలకోసారి జిల్లాలకు వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహించి, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడాలని, వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ పనితీరును, కార్యక్రమాలను వివరించాలని సూచించారు, పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని అన్నారు. కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను పీఏసీ సభ్యులందరూ తీసుకోవాలని కోరారు. గ్రామ, మండల, బ్లాక్, జిల్లా,రాష్ట్ర పార్టీ కమిటీలను మూడు వారాల్లోగా ఏర్పాటు చేయాలని సూచించారు. వీలున్నంత త్వరగా ప్రభుత్వ పదవులను కూడా భర్తీ చేయాలని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలి దేశ రాజకీయ చరిత్రలో అంబేడ్కర్‌ను అవమానించిన నాయకులు లేరని, మొదటిసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానకరంగా మాట్లాడిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పాదయాత్రలు నిర్వహించాలని కోరారు. మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆశించిన మేర కృషి జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వేణుగోపాల్..ముఖ్యమంత్రిపై మంత్రులకు, మంత్రులపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలను వివరించిన సీఎం గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ అమలు చేశామని, సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నామని, జనవరి 26 నుంచి రైతు భరోసా అమలు చేయబోతున్నామని తెలిపారు. ఒక్కో వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందించబోతున్నామని, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పారు. మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్‌ను అవమానించిన ఉదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి నిరసనలు తెలియజేశామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీఏసీ సభ్యులు వి.హన్మంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, గీతారెడ్డి, అజారుద్దీన్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి తదితరులు హాజరయ్యారు. పీఏసీ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా గురువారం పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సమావేశం జరిగే ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లోనే వేణుగోపాల్ బుధవారం రాత్రి బస చేశారు. అక్కడే ఆయనతో కలిసి రేవంత్, తదితరులు డిన్నర్ చేశారు. 25–28 తేదీల మధ్య సంవిధాన్ బచావో ర్యాలీ పీఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు పలువురు నేతలతో కలిసి వాటిని విలేకరులకు వెల్లడించారు. అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 25 నుంచి 28వ తేదీ మధ్యలో తెలంగాణలో సంవిధాన్ బచావో ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ర్యాలీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావాలని కోరుతూ పీఏసీ తీర్మానించినట్లు తెలిపారు. సంవిధాన్ బచావో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు పాదయాత్రలు నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ నేతల అభిప్రాయాలను కేవలం పీఏసీ సమావేశంలో మాత్రమే వివరించాలని, ఎవరూ బయట మాట్లాడకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర మంత్రులు ప్రతినెలా జిల్లాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాలని కూడా నిర్ణయించామన్నారు. మహాత్మాగాంధీ శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలం పాటు రాష్ట్రమంతటా నిర్వహించేలా కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. కొత్త గిగ్ వర్కర్స్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు.