ఎమ్మెల్యే సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట | Serious Argument Between Padi Kaushik Reddy And MLA Sanjay In Joint Karimnagar District Review Conference | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సంజయ్‌, కౌశిక్‌రెడ్డిల మధ్య తోపులాట

Jan 12 2025 5:20 PM | Updated on Jan 13 2025 12:33 PM

argumentation Between Kaushik Reddy And MLA Sanjay

కరీంనగర్‌:   ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సమీక్షా సమావేశం(Joint Karimnagar District Review Conference) రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌, కౌశిక్‌రెడ్డి(kaushik reddy)ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ‘నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత’ అనేంత స్థాయిలో వాగ్వాదం జరిగింది.

జిల్లా సమీక్షా సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్‌(MLA Sanjay) మాట్లాడుతుండగా పాడి కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారు. ఇంతకీ మీ పార్టీ ఎంటంటూ సంజయ్‌ను కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తీవ్రస్థాయికి చేరి ఇద్దరు తోసుకునేంతవరకూ వెళ్లింది. దాంతో కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇదంతా ముగ్గురు తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుల సమక్షంలో జరగడం శోచనీయం.

కౌశిక్‌రెడ్డి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూఊ. ‘ ఎమ్మెల్యే సంజయ్‌ అమ్ముడుపోయారు. సంజయ్‌కు ఎమ్మెల్యే పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష. దమ్ముంటే సంజయ్‌ రాజీనామా చేయాలి.  ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్లా అంటూ కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. 

Advertisement
 
Advertisement
Advertisement