breaking news
-
విమర్శలు తప్ప.. కేటీఆర్ చేసిందేమీలేదు: మల్లు రవి
సాక్షి, ఢిల్లీ: రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, అమలు చేయకుండా మోసం చేశాడంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ వారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లు అమలు చేయకుండా ప్రజలను ఏవిధంగా ఇబ్బందులపాలు చేశారో చెప్పినట్లే ఉంది. కాంగ్రెస్‌ను, సీఎం రేవంత్‌ని విమర్శిస్తూ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది’’ అని మల్లు రవి విమర్శలు గుప్పించారు.‘‘రైతు భరోసా 12 వేలు, రెండు లక్షల వరకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ ఇలా మేము ఇచ్చిన హామీలను అమలు చేశాం. మేము చేసింది వాస్తవం, మీరు చేయనిది వాస్తవం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల మంది విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాం. కార్పొరేట్ విద్యను 56 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టింది వాస్తవం. కాంగ్రెస్ హయాంలో రేవంత్ రియల్ హీరో అని.. ఆయనను విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పమో మొదటి ఏడాదిలోనే చేసి చూపించాం’’ అని మల్లు రవి పేర్కొన్నారు.బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేస్తే వాటికి రూ.6500 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నాం. పేదలకు ఇచ్చిన మాటను నిలుపుకునేందుకు తల తాకట్టు పెటైనా నెరవేర్చాలనే సంకల్పంతో రేవంత్ పనిచేస్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలకు సూచిస్తున్నాం. ఇష్టారీతిన మాట్లాడితే కేటీఆర్ మీదకు ప్రజలు తిరగబడతారు. రాష్ట్రంలో అనవసరంగా ఖర్చులు చేసింది కేసీఆర్. వందేళ్లు పనిచేసే సచివాలయాన్ని కూల్చేసి కట్టారు. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. మా హయాంలో ప్రజల పాలన నడుస్తుంది’’ అని మల్లు రవి చెప్పారు. -
బీఆర్ఎస్ పనైపోయిందని మనవాళ్లే ప్రచారం చేశారు: కేసీఆర్
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలతో మొదలుట్టారు. పార్టీ పని అయిపోయిందంటూ వ్యతిరేక ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలపైన ఆయన మండిపడ్డారు.‘‘ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందగానే పార్టీ పని అయిపోందని మన పార్టీ నేతలే ప్రచారం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో పార్టీ మారారు. ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదు. ఇది ఖండించదగ్గ విషయం’’ అని సీరియస్ టోన్‌తో అన్నారాయన. అయితే.. ఇప్పటికీ మించి పోయింది ఏమీ లేదని.. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం అంతా కష్టపడాలని సూచించారు. 27న భారీ బహిరంగ సభఇక.. ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) సిల్వర్ జూబ్లీ వేడుకలు(Silver Jubilee Celebrations) ఉంటాయని.. ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఏప్రిల్ 10 నుంచి 27వ తేదీ దాకా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించారాయన. ఏప్రిల్ 10వ తేదీన పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందన్నారు. అలాగే.. ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన కేడర్‌కు తెలిపారు. అలాగే బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత కమిటీలను వేయాలని నిర్ణయించిన ఆయన.. ఆ కమిటీలకు ఇంఛార్జిగా సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao)కు బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే పార్టీ అనుబంధం సంఘాల పటిష్టతకు సీనియర్ నేతలతో కమిటీలు వేయనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు.భవిష్యత్తు బీఆర్ఎస్దేత్వరలో పార్టీలో సమూల మార్పులు ఉంటాయి. శిక్షణా తరగతులు నిర్వహిస్తాం. మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తాం. డీలిమిటేషన్‌తో అసెంబ్లీ స్థానాలు 160 అవుతాయి. అందులో మహిళలకు 53 సీట్లు కేటాయిస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోతోంది. గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను అస్థితికి తీసుకెళ్తున్నారు. మరోసారి దోపిడీ, వలసవాదుల బారిన పడకుండా కాపాడుకోవాలి. ఈ 25 ఏళ్ల స్ఫూర్తితో కార్యకర్తలు మళ్లీ పోరాడాలి. బీఆర్ఎస్.. తెలంగాణ అస్థిత్వ పార్టీ. బీఆర్ఎస్ అంటే ఒక్కసారి ఓటమితో కొట్టుకుపోయే పార్టీ కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది. భవిషత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలి. భవిష్యత్తు బీఆర్ఎస్దే. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం.ఉప ఎన్నికలు గ్యారెంటీతెలంగాణలో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం. ఈ అంశంపై నేనే లాయర్లతో మాట్లాడా. తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అన్నారాయన. ఒర్రకండిరా బాబూ..సుమారు ఏడు నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అయితే.. కేసీఆర్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో కేడర్ మధ్య తోపులాట చోటు చేసుకోగా.. ఆయన ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలంతా ఆయన్ని చుట్టుముట్టి ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి లోనయ్యారు. ‘ఒర్రకండిరా బాబూ.. మీకు దండం పెడతా..’ అంటూ పిలుపు ఇచ్చారు. అయినా కేడర్ చల్లారలేదు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాస్‌పోర్ట్ రెన్యువల్అంతకు ముందు .. కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నగరానికి వచ్చారు. ముందుగా సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డిప్లోమేటిక్ పాస్‌పోర్టును అప్పగించి.. సాధారణ పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకున్నారాయన. ఆ టైంలో భార్య శోభ, మాజీ ఎంపీ సంతోష్‌లు వెంట ఉన్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. -
ఫ్యూచర్, ఫోర్త్ సిటీల పేరుతో డ్రామాలు..: కేటీఆర్
ఆమనగల్లు: ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ డ్రామా ఆడుతున్నారని, ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ధ్వజమెత్తారు. ‘వెల్దండలో సీఎం రేవంత్‌రెడ్డికి 500 ఎకరాల భూమి ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల వెయ్యి ఎకరాలు నొక్కేశారు. మాడ్గుల ప్రాంతంలో భూముల రేట్లు పెంచేందుకు అత్తగారి ఊరుకు పెద్ద రోడ్డు వేస్తున్నాడు..’ అని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత 35 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చాడని, కనీసం 35 పైసలు కూడా తేలేదని విమర్శించారు. కల్వకుర్తి నుంచి కొడంగల్‌కు వలస వెళ్లిన రేవంత్‌రెడ్డి అక్కడా, ఇక్కడా చేసిందేమీలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి పతనం కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం నిర్వహించిన రైతు నిరసన దీక్షకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.రేపు పుస్తెల తాళ్లు ఎత్తుకెళతారు..‘కొడంగల్‌లో ఏ ఒక్క రైతుకూ రుణమాఫీ కాలేదు. మహిళలకు రూ.2,500 పెన్షన్ ఇవ్వలేదు. కళ్యాణలక్ష్మి, తులం బంగారం పత్తాలేదు. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడికి వలస వస్తే.. ప్రస్తుతం ఇక్కడి నుంచి వలస పోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ పాలనలో మొన్న రైతుల ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు. నిన్న మోటార్టు, స్టార్టర్లు తీసుకెళ్లారు. రేపు మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు ఎత్తుకెళ్తారు. కేసీఆర్ పాలనలో రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. 70 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద 12 సీజన్లలో రూ.73 వేల కోట్లు అందాయి. కానీ రేవంత్‌రెడ్డి 420 రోజుల పాలనలో 430 మంది రైతులు, 56 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌లో చందు అనే రైతు బ్యాంకు ఎదుట బైక్‌ను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో రైతు జాదవరావ్, మేడ్చల్‌లో సురేందర్‌రెడ్డి ఆత్మహత్యలు చేసుకోగా ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు.రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు..42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను, రూ.15 వేలు రైతు భరోసా ఇస్తానని రైతులను, రూ.12 వేలు ఇస్తానని రైతు కూలీలను, నెలకు రూ.2,500 ఇస్తానని ఆడబిడ్డలను, స్కూటీలు ఇస్తానని యువతులను, లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తానని ఆడబిడ్డలను ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను రేవంత్‌రెడ్డి మోసం చేశారు. రాష్ట్ర ప్రజలు రేవంత్‌రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇంకెవరైనా అయితే ఇప్పటికే పాడుబడిన బావిలో దూకేవారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. రేవంత్‌రెడ్డి నిజాయితీగల మోసగాడు..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతు దీక్షలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణిదేవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీన్‌కుమార్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేను ఐదు సంవత్సరాలు కేసీఆర్ క్యాబినెట్ మంత్రినే..
హైదరాబాద్: తాను కేసీఆర్(KCR) క్యాబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా చేశానని, మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదని, అందుకు తానే సాక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంగళవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జూపల్లి.. ‘ కేసీఆర్ మీటింగుల్లో కేసీఆర్ వచ్చేదాకా ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండకపోయేది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. తెలంగాణలో ఆరిపోయింది కాకుండా ఢిల్లీలో అరిపోయారు. సెక్రటేరియట్ కట్టడం తప్పు పట్టడం లేదు కానీ, సెక్రటేరియట్ రాకపోవడం తప్పని ఆనాడే అన్నాను. అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పదేండ్లు పట్టిందా?, బీఆర్ఎస్(BRS) ఓడిపోవడానికి వాళ్ళ స్వయంకృపరాదమే కారణం. కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు తపిస్తున్నట్టు నిన్న ఆయన అనుచరులు ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతోమంది పోరాటం, రాజకీయ సంఘర్షణలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగాయి. పది సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ పాలన కావాలని ఎందుకు కోరుకుంటారు. గడిచిన 65 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రులు 65 వేల కోట్ల అప్పు చేశారు.కేసీఆర్ పదేండ్ల అప్పుల పాలన గొప్ప పాలన ఎలా అవుతుంది?, ఆంధ్రవాళ్ళు అంద్రవాళ్ళు అన్న కేటీఆర్(KTR) ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్కసారైనా అంబేద్కర్ కి దండ వేశాడా?, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ప్రతిపక్షాలకు సమయం ఇచ్చాడా?, రాష్ట్ర అప్పు 2 లక్షల కొట్లే అని అసెంబ్లీలో కేసీఆర్ అన్నారు. అదే నిజమని అనుకున్నాం. కేసీఆర్ శాసనసభకే రాలేదు. ఆయన పాలన కావాలని కోరుకుంటారు ఏంటి?, కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. కేటీఆర్ మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదుసర్పంచులకి బిల్లులు ఇవ్వడం లేదని అనడానికి కేటీఆర్ కి సిగ్గు ఉందా?, కేసీఆర్ చేసిన పనికి....అప్పు కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాత పెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కి వాత పెడతారు. కేసీఆర్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు’ అని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
‘కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చుపెడుతున్నారు’
హైదరాబాద్: కేంద్ర మంత్రులైన బండి సంజయ్, కిషన్ రెడ్డిలు బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం సరైంది కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. బీసీలలో మైనార్టీలను కలిపారని వారు చెప్పడం సరికాదన్నారు. సాధారణ వ్యక్తి చదువుకుని మాట్లాడితే వదిలేయొచ్చు..కానీ కేంద్ర మంత్రులే అలా మాట్లాడి చిచ్చు పెడుతున్నారన్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు.‘కిషన్ రెడ్డి... బండి సంజయ్ లకు పోస్టు లో వివరాలు పంపిస్తున్న.హంటర్ కమిషన్ ..1882 లో వేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. 1918 లో మిల్లర్ కమిషన్ .. స్టడీ చేసింది. 1953 లో కాక కాలేకర్ రిపోర్ట్ లో కూడా కొన్ని కులాలు బీసీ జాబితా లో ఉన్నాయి. గుజరాత్ లో కూడా obc ముస్లిం లు ఉన్నారు.ఎక్కడా లేదు..తెలంగాణ లో ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర మంత్రులే కదా... బీసీ ల జాబితాలో ఉన్న ముస్లిం లను తొలగించి..గుజరాత్ లో కూడా తొలగించండి. మతంలో కూడా పేదరికం లేదా..? , మీరు పిలిస్తే...మీ పార్టీ కార్యాలయంకి వచ్చి కూడా ప్రజెంటేషన్ ఇస్తా. కానీ మాతల మధ్య చిచ్చు పెట్టొద్దు. మనం అంతా భారతీయులం. వెనకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా...వెనకబడిన తరగతులు.బీసీల మీద అంత ప్రేమ ఉంటే... బీసీ కుల గణన చేయించండి’ అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. -
రేవంత్‌వి దొంగ మాటలు: కేటీఆర్
సాక్షి,మహబూబ్‌నగర్‌జిల్లా: సీఎం రేవంత్ ఏ ఒక్క హామీనైనా అమలు చేశారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం(ఫిబ్రవరి 18) అమన్‌గల్‌ల్‌లో జరిగిన రైతుదీక్షలో కేటీఆర్ మాట్లాడారు.‘సీఎం రేవంత్ 420 హామీలు ఇచ్చారు. రైతుబంధు, రుణమాఫీ ఎవరికైనా వచ్చాయా. తులం బంగారం వచ్చిందా. ఏదీ రాలేదు.దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ కొడంగల్‌కు, తల్లి గారి ఊరికి, అత్తగారి ఊరికి ఎవరికీ ఏమీ చేయలేదు. 42 శాతం రిజర్వేషన్లని చెప్పి బీసీలను మోసం చేసిండు. రైతులను మోసం చేసిండు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాడు. సన్యాసి రేవంత్‌కు పాలన చేతనైతలేదు ’అని కేటీఆర్ ఫైరయ్యారు. -
‘కేసీఆర్ హీరోనే.. ఎందుకు గెలవలేదు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కులగణన వందశాతం సరిగా చేసిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.మంగళవారం(ఫిబ్రవరి 18) మీడియాతో సుఖేందర్‌రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.‘అసలు కులగణ మీద బీసీల జనాభాపై లెక్క ఎక్కడ ఉంది. దేశంలోనే ఇదే మొదటిసారి కదా బీసీ కులగణ చేసింది.సమగ్ర కుటుంబ సర్వే అఫీషియల్ రికార్డు లేదు.అసెంబ్లీలో పెడితే రికార్డులో ఉండేది. ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అవుతాడు.కులం,మతం తో సంబంధం ఉండదు.బీజేపీ బీసీ కులగణకు వ్యతిరేకమని అందరికి తెలిసిందే. రాజకీయం,ప్రభుత్వ సంస్థలు ఇతర వ్యవస్థలపై సైతం నమ్మకం తగ్గుతుంది.ఉచితాలపై ఒక కఠినమైన చట్టం రావాల్సిందే.రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి పథకాలు ఉండాలి.ఈ ప్రభుత్వ పాలన పర్వాలేదు.కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.తెలంగాణ ఉద్యమం నడిపించింది వాస్తవమే.కానీ 4కోట్ల ప్రజల హీరో అంటే.. మరి ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు ఓట్లు వేయలేదు కదా..నువ్వు నేను కోరుకుంటే ఎన్నికలు రావు.ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటారు’అని సుఖేందర్‌రెడ్డి అన్నారు. -
రేవంత్‌ను ప్రజలు బహిష్కరిస్తారు: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్:బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం(ఫిబ్రవరి 18) ఈ విషయమై డీకే అరుణ సాక్షి టీవీతో మాట్లాడారు.‘బీసీలపై ప్రేముంటే సీఎం పదవికి రేవంత్‌రెడ్డిని రాజీనామా చేయించి తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రి చేయాలి.కులగణన సర్వేలో రాజకీయ ప్రస్తావన ఎందుకు ?కులగణనలో కుటుంబ వివరాలు మాత్రం ఇవ్వడానికి నేనే సిద్ధమే. ఇతర వివరాలు కావాలంటే నా ఎన్నికల అఫిడవిట్ చూసుకోండి. నన్ను సామాజిక బహిష్కరణ చేయడానికి రేవంత్ ఎవరు ?రేవంత్‌రెడ్డినే తెలంగాణ నుంచి బహిష్కరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేషన్ కార్డులపై ఖచ్చితంగా ప్రధాని మోదీ ఫొటో పెట్టాల్సిందే’అని డీకే అరుణ స్పష్టంచేశారు. -
ఓట్ల కోసమే సీఎం రేవంత్ డ్రామాలు: ఈటల
సాక్షి: ఖమ్మం జిల్లా: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల పట్ల రేవంత్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం సీఎం రేవంత్ డ్రామాలు చేస్తున్నాడని.. 45 ఏళ్లు పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే.. ఒక్క బీసీ, ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు.‘‘బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మనవాళ్లు, అనేది చూసి ఓటు వేయాలి. మాట ఇస్తే నిలబడే వ్యక్తికి ఓటు వేయాలి. మోసం చేసేవారికి కాదు. టీచర్స్ ఎమ్మెల్సీ ప్రచారంలో ఉపాధ్యాయులు నుంచి మంచి స్పందన వస్తుంది. 317 జీవో తీసుకొచ్చి ఉపాధ్యాయుల జీవితాల్లో మట్టి కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్న ఇప్పటికీ డీఏలు, ఇంక్రిమెంట్లు లేవు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం’’ అంటూ ఈటల దుయ్యబట్టారు. -
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో’.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్: కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..మేధావులారా.. బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి’ అంటూ బీజేపీ కేంద్రమంత్రి బండిసంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ మండలాధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్‌రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది.కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..నిరుద్యోగులకు 56 వేల నిరుద్యోగ భృతి.2 లక్షల ఉద్యోగాల బాకీ.. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు బాకీ. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ. ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డీఏలు బాకీ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో పీఆర్సీ బాకీ. ప్రతి విద్యార్థికి, కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీ.ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ. జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ. మేధావులారా..బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి.మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీదే. బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్‌తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?’ అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ నుంచే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్(Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒక రోజు కాంగ్రెస్ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే తెలంగాణకు సీఎం(Telangana CM)గా ఉంటారని వ్యాఖ్యానించిన మహేష్ గౌడ్.. ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని కూడా చూస్తామన్నాను. అది కూడా కాంగ్రెస్ నుంచే బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్(Bandi Sanjay).. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు మహేష్ గౌడ్.దశాబ్లాలు దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో ఒక్క బీసీ వ్యక్తిని కూడా ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శనివారం నల్లగొండ బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో ఇప్పటివరకూ బీసీ వ్యక్తిని ఎందుకు ముఖ్యమంత్రిగా చూడలేకపోయామనే కోణాన్ని లేవనెత్తుతూ.. అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. దీనికి బదులుగా టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీసీ వ్యక్తిని సీఎంగా చూస్తామన్నారు. -
అంతా రామోజీ ఊహించినట్టే జరుగుతోందా?
ఇది ఊహించని పరిణామమే!. ఎంతటి బలాఢ్యుడైనా ఏదో ఒక రోజు తన తప్పునకు మూల్యం చెల్లించాల్సిందే. డిపాజిట్ల వ్యవహారంలో మార్గదర్శి సంస్థ ఇంతకాలం ఎంతగా బుకాయించినా చివరకు వాస్తవాన్ని పరోక్షంగానైనా అంగీకరించక తప్పలేదు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను మేనేజ్ చేసినా.. మార్గదర్శి అక్రమాలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అండగా నిలిచినా చివరికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వాదనే సరైందని తేలింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమంగా రూ.2610 కోట్ల డిపాజిట్లు వసూలు చేసిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ధారించింది. దీనితో ఇంతకాలం ఆ సంస్థ అసలు తప్పు చేయలేదని, తప్పు చేయదని, ఈనాడు గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావుపైనే నిందలు మోపుతారా అని గుండెలు బాదుకుంటూ మాట్లాడిన వారికి జవాబు వచ్చినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోక్ సభలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసుపై చర్య తీసుకోవాలని YSRCP ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి ప్రతిగా టీడీపీ ఎంపీలు మార్గదర్శి అధికార ప్రతినిధుల్లా ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను వెనకేసుకొచ్చారు. అంతేకాదు.. సేకరించిన డిపాజిట్లను దాదాపు అందరికి తిరిగి చెల్లించిందని వాదించారు. మిథున్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారానికి ఈనాడు మీడియా ‘‘వార్త రాస్తే విషం చిమ్ముతారా’’ అంటూ టీడీపీ ఎంపీలు ధ్వజమెత్తారని ప్రముఖంగా ప్రచురించారు. నిజానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ఆరోపణలు వస్తే ఈనాడు మీడియాను అడ్డం పెట్టుకుని దబాయించడమే తప్పు. పైగా.. ఈనాడేమో.. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులపై ఇష్టారీతిన అసత్యాలతో కథనాలు వండివార్చవచ్చు. ఈనాడు గ్రూపులోని సంస్థ అవకతవకలకు పాల్పడిందని కూడా ఎవరూ విమర్శించకూడదన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. మార్గదర్శి డిపాజిట్ల అక్రమ సేకరణపై ఇంతకాలం మీడియా బలంతో బుకాయించినప్పటికీ ఆర్బీఐ నివేదిక వచ్చాక టీడీపీ ఎంపీలు ఎందుకు సమాధానం ఇవ్వలేదో ఇప్పుడు చెప్పాలి. మార్గదర్శి చిట్స్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని, డిపాజిట్ల సేకరణను రసీదుల రూపంలో కొనసాగించారని, చిట్స్‌లో వందల కోట్ల రూపాయల నల్లధనం ఉందని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ సాక్ష్యాధారాలతో సహా కేసు పెడితే, కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటిని నీరుకార్చడం ఆరంభించింది. అందులో భాగంగా జప్తు అయిన వేయి కోట్ల మొత్తాన్ని కూడా విడుదల చేశారు. ఇదంతా చూస్తే.. పరస్పర రాజకీయ,వ్యాపార ప్రయోజనాల కోసం టీడీపీ ఈనాడు మీడియాను వాడుకున్నారని పలుమార్లు స్పష్టం అయింది. ఆర్బీఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని స్పష్టం చేయడంతోపాటు ఈ సంస్థపై తమకు పలువురు ఫిర్యాదు చేశారని కూడా తెలిపింది. రామోజీరావు మరణించినప్పటికీ, ఆ కేసు మూతపడదని, విచారణ కొనసాగించాలన్నదే నిబంధన అని వివరించింది. మరి ఈనాడు మీడియా ఎందుకు దీన్ని ప్రజలకు తెలియజేయడం లేదు. ఆర్బీఐ కూడా తమపై విషం చిమ్ముతోందని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎందుకు చెప్పించలేకపోతోంది?. ఆర్బీఐకి ఈనాడు మీడియాకు ఏ శత్రుత్వం ఉందని ఆ నివేదిక ఇచ్చింది?. నిజానికి అఫిడవిట్ ఫైల్ చేయడం వీలైనంత ఆలస్యం చేసేందుకు ఈనాడు మీడియా తనకు ఉన్న పరపతిని వాడి ఉండవచ్చు. తెలంగాణ హైకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చిన తరువాతే ఆర్బీఐ కూడా చట్టంలోని సెక్షన్ 45(ఎస్) గురించి వివరించాల్సి వచ్చింది. దాని ప్రకారం మార్గదర్శి చట్ట విరుద్ద చర్యలకు పాల్పడిందని తేలుతోంది. నేరం నిర్ధారణ అయితే సేకరించిన డిపాజిట్ల మొత్తానికి రెట్టింపు జరిమానా చెల్లించాలి. దీంతో మార్గదర్శి కొత్త వాదన తీసుకువచ్చింది. రామోజీరావు నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా అని అంటోంది. ఈ వాదన రామోజీ నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకరించడమే అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రామోజీ తర్వాత హెచ్ యుఫ్ (అవిభాజ్య హిందూ కుటుంబ కర్త)గా ఆయన కుమారుడు కిరణ్ నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన బాధ్యత వహించాలా? లేదా? సంస్థ తరపున జరిమానా చెల్లించవలసిన బాధ్యత ఆయనపై ఉంటుందా? లేదా?అనేది చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఇంకో సంగతి గుర్తు చేయాలి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన కుమారుడిపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి అక్రమ కేసులు పెట్టాయి. వైఎస్సార్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అప్పట్లో ఈనాడు మీడియా ఇది కరెక్టేనని ప్రచారం చేసింది. ఇప్పుడు మాత్రం భిన్నంగా వాదిస్తోంది. రామోజీ లేరు కనుక, ఆయన కర్తగా ఉన్న సంస్థ ఆక్రమ డిపాజిట్లతో కొడుకుకు సంబంధం లేదంటోంది. కాని ఆ డిపాజిట్ల ద్వారా సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రం అనుభవించవచ్చట. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఒక సంస్థ అని, దాని కర్త మరణించినా, చట్టపరంగా సంస్థ బాధ్యత పోదని, వారసులు సైతం తీసుకోవల్సిందేనని చట్టం చెబుతోంది. రామోజీ ఆస్తులకు కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు వారసులైనప్పుడు ఆయన చేసిన ఆర్థిక అక్రమాలకు వీరికి బాధ్యత ఉండదా? రామోజీరావు మరణించినందున ఈ కేసు విచారణ కొనసాగించాలా? లేదా? అనేది ఆలోచించాలని ఏపీ ప్రభుత్వం తరపున వేసిన అఫిడవిట్లో కోరారు. దానిని అంగీకరిస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చని ప్లాన్ చేశారు. కానీ.. ఆర్బీఐ ఇచ్చిన అఫిడవిట్ తో మార్గదర్శి సంస్థ పరిస్థితి కుడితిలో పడ్డయినట్లయిందని అంటున్నారు. అంతకుముందు అసలు డిపాజిట్ల వసూలులో తప్పు చేయలేదని కొంతకాలం, డిపాజిట్లు తీసుకున్నా తిరిగి చెల్లించేశామని మరికొంతకాలం చెప్పింది ఈనాడు. ఉండవల్లికి తెలియకుండానే ఉమ్మడి ఏపీ హైకోర్టులో కేసు కొట్టివేయించుకున్నారు. కానీ ఆరు నెలల తర్వాత ఆయనకు తెలిసి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఈ దశకు చేరింది. జగన్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయిందన్న కోపంతో ఈనాడు మీడియా పచ్చి అబద్ధాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది. ఉండవల్లికి డిపాజిట్ దారుల వివరాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి పెద్ద, పెద్ద లాయర్లను నియోగించింది. మొత్తం మీద 18 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఒక రూపానికి వచ్చినట్లనిపిస్తుంది. ఆర్థికంగా ,రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎంత శక్తిమంతుడైనా న్యాయ వ్యవస్థ కొంత గట్టిగా ఉంటే చట్టానికి ఎవరూ అతీతులుగా ఉండలేరని ఈ ఉదంతం రుజువు చేసింది. గతంలో సహారా డిపాజిట్ల కేసులో ఆ సంస్థ యజమానిని సుప్రీంకోర్టు జైలులో పెట్టింది. రామోజీరావు ఆ గండం నుంచి తప్పించుకున్నా.. ఆయన మరణం తర్వాత అయినా సత్యం బయటపడిందని అనుకోవాలి. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు, ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ అండతో ఈ కేసు ముందుకు సాగకుండా చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు. కాగా ఉండవల్లికి డిపాజిటర్ల వివరాలు ఇవ్వక తప్పలేదు. వాటిని పరిశీలించిన తర్వాత మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావొచ్చు. రామోజీకి అసలు డిపాజిట్లు ఎలా వచ్చాయి? అందరి వివరాలు ఉన్నాయా? అందరికి తిరిగి చెల్లించారా? లేదా? ఆ మొత్తాలకు వడ్డీని కూడా చెల్లించారా? లేదా? ఇలాంటి విషయాలు అన్ని తేలితే అప్పుడు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం. రామోజీరావు గతంలో ఒక మాట అనేవారు. ‘‘వయలేట్ ద లా లాఫుల్లీ’’ అని. చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకుని చట్టాన్ని ఉల్లంఘించవచ్చన్నది ఆయన ఫిలాసఫి. అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకూడదన్న సిద్దాంతం కాదన్నమాట. ఆ క్రమంలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోయే అవకాశం ఉందని ఈ అనుభవం చెబుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులం, మతంపై చర్చ జరుగుతుండటం దురదృష్టకరం. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.‘‘రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్. రాహుల్ తాత ఫిరోజ్‌ఖాన్ గాంధీ. రాహుల్ మాత్రం బ్రాహ్మణ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందన్న కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుంది?. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి. హిందూ బీసీలకు 42 శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుంది. మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు’’ అని బండి సంజయ్ చెప్పారు. -
ఐఏఎస్, ఐపీఎస్‌లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం బిగ్ టాస్క్ అన్నారు. కొత్తగా ఐఏఎస్‌గా వచ్చే వాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.చాలా మందికి కొంత మంది సీనియర్ ఐఏఎస్‌ల గురించి ఇప్పటికి తెలీదు.. శేషన్ ఐఏఎస్.. ఎన్నికల కమిషన్ ఉందని తట్టి లేపిన గొప్ప వ్యక్తి. రాజకీయ నాయకులను గైడ్ చేసే విధానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఎందుకు అలా లేదో తెలియడం లేదు. రాజకీయ నాయకులకు అవగాహన కల్పించే సెక్రటేరియట్ రూల్స్ ఉన్నాయి. కొత్తగా సెలెక్ట్ అయిన కొందరు ఐపీఎస్‌లు తప్పుడు మార్గంలో నడుస్తున్నారు.’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘కొత్త ఐపీఎస్‌లు యూనిఫామ్ వేసుకొని సివిల్ పంచాయితీలు చూసుకోవడం దురదుష్టకరం. ఏసీ రూమ్ నుంచి బయటికి రావడానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇష్ట పడటం లేదు. జనంలోకి రండి అంటే రావడం లేదు. అధికారుల ఆలోచన విధానంంలో మార్పు రావాలి. నిబద్ధత ఉన్న ఆఫీసర్లు ఎక్కడ ఉన్నా పోస్టింగ్‌లు వస్తాయి’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
కులగణనపై ఈటల కీలక వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.యాదగిరిగుట్టలో ఆదివారం(ఫిబ్రవరి16) ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.‘బీసీ గణనను చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసేంబ్లీలో చట్ట బద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.కులగణనను పార్లమెంట్లో ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నాం. 70ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు, భూ దందాలు,లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నాడు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ గతంలో టీచర్లను మోసం చేసి పోటీ చేసే అర్హత కోల్పోయింది’అని ఈటల అన్నారు. -
‘ఎమ్మెల్సీలు గెలిస్తే సంచలనమే’
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.ఎంపీ అర్వింద్ కామెంట్స్హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యంఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారుప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటుదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి -
కిషన్‌రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..అందుకేనా..!
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. -
రేవంత్.. 50 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణలో గురుకులాల పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు.. నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు. నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే.. నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయి.ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తోంది. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపం. జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలోఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలుఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి.నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నేడు సరైన దిశానిర్దేశం లేకదీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.నాడు గురుకులాల్లో సీటు కోసం… pic.twitter.com/LLjDPGGcoz— KTR (@KTRBRS) February 16, 2025 -
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
ప్రధానిని అలా అనలేదు: సీఎం రేవంత్ క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.రాహుల్‌తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్ తెలిపారు.కాగా,శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. -
టీ అమ్మితే తప్పేంటి?: లక్ష్మణ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడర్‌ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర: కవిత
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్‌తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు. పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్‌ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు. -
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని హితవు పలికారు. అలాగే, పరిపాలన చేయడం చేతగాక బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఖమ్మం జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం, కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టీ జైలుకు పంపడం సరికాదు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు. పార్టీకి చెందిన వారిని కొందరని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా?. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.