breaking news
-
‘తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇంకా దొరసాని అహంకారం తగ్గలేదని విమర్శించారు రాకేష్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రాకేష్ రెడ్డి..‘దొరలు.. దొరసానికి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు వచ్చింది. కవిత దొర అహంకారం మానుకో. కేసిఆర్..రేవంత్ రెడ్డి హిందూ ద్రోహులు. కుంభమేళాకు ఎందుకు పోలేదో చెప్పాలి. హిందువులను కేసీఆర్..రేవంత్ రెడ్డి అవమానించారు. అందుకే హిందువులు రెండు పార్టీలకు గుణపాఠం చెప్పారు’అని మండిపడ్డారు.కొన్నిరోజుల క్రితం సీఎం రేవంత్ పై రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న కిషన్‌రెడ్డిడ్డికి సీఎం రేవంత్ రాసిన లేఖ దిక్కుమాలినదిగా అభివర్ణించారు రాకేశ్‌రెడ్డి. కిషన్‌రెడ్డిడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్ కు లేదంటూ ధ్వజమెత్తారు.‘ మూడు పార్టీలు మారి.. ఢిల్లీకి కప్పం కట్టి సీఎం కుర్చీ తెచ్చుకున్న వ్యక్తి రేవంత్. పుట్టినప్పుడే కాషాయ జెండాను ముద్దాడిన వ్యక్తి కిషన్‌రెడ్డి.కిషన్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు రేవంత్‌కు లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా చేసిన ఘనత కిషన్‌రెడ్డిది. నిజాయితీలో మచ్చలేని వ్యక్తి కిషన్‌రెడ్డిడ్డి. రానున్న ఎన్నికల్లో రేవంత్ కు గట్టి సమాధానం చెబుతాం. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. రాబార్ట్ వాద్రా కోసం మూసీ ప్రాజెక్టు చేపడితే మేమేందుకు నిధులిస్తాం. అవినీతి ప్రాజెక్టుల తప్ప, ప్రజలకు ఇచ్చిన ఒక్క హమీ కూడా నెరవేర్చడం లేదు. తెలంగాణకు నిధులిచ్చి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వమే’ అని ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి తెలిపారు -
‘మేం త్వరలో బీజేపీకి మరో గిప్ట్ ఇస్తాం’
హైదరాబాద్: త్వరలో బీజేపీకి మరో గిఫ్ట్ ఇస్తామని సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు.తాము బీజేపీకి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చిమని, మళ్లీ గిఫ్ట్ ఇస్తామంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ రంజాన్ గిప్ట్ లపై చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు కౌంటర్ఇచ్చారు. ‘ మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రంజాన్ గిఫ్ట్ ఇచ్చయా?, మేం కూడా బీజేపీకి త్వరలోనే మరో గిఫ్ట్ ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు బయటకి వస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును గౌరవిస్తున్నాం. నరేందర్ రెడ్డికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. క్రియాశీలకంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ల ఫెవికాల్ బంధం గట్టిగా చేసేందుకు చేసిన కృషి అందరూ చూశారు. బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ సింగ్ కి వచ్చిన ఓట్లు ఎన్ని?, తనకి బీఆర్ఎస్ సంపూర్ణ సహకారం ఇచ్చిందని రవీందర్ సింగ్ అన్నాడు. బీజేపీకి తోడుగా బీఆర్ఎస్ నిలబడింది’ అని శ్రీధర్ బాబు విమర్శించారు. -
రేవంత్‌కు ఇది చెంప పెట్టులాంటి తీర్పు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో పాలక పక్షంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడిందని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని అన్నారాయన.సాక్షితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధారణ విషయమేమీ కాదు. ఇది బీజేపీ సాధించిన సమిష్టి విజయం. తెలంగాణలో పాలకులు మారినా.. మార్పు రాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా నిలిచారు. .. కాంగ్రెస్‌కు, రేవంత్‌కు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత అర్థమైంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా’’ అని అన్నారాయన. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ.. ఈ విజయం బీజేపీ కార్యకర్తలందరిదని అన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ తో పాటు, అందరి సహకారంతో ఈ విజయం సాధించాం. మేము ఊహించినట్టే విజయం దక్కింది. మండలిలో ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతా’’ అని అన్నారు.సాక్షి టీవీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ కార్యకర్తల విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెంపపెట్టు ఈ విజయం. తెలంగాణాలో బీజేపీ బలపడుతుందనేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ విజయం ప్రభావం తప్పకుండా ఉంటుంది అని అన్నారు. -
బీజేపీకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నువ్వా..నేనా అన్నట్టుగా మూడురోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ముక్కోణపు పోరులో చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. బుధవారం తెల్లవారుజాము నుంచి కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగింది. ఉదయం 8.30 గంటలకల్లా.. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తంవ్యాలి డ్ ఓట్లు 2,23,343 కాగా, అందులో 28,686 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. అధికారులు 1,11,672 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యతలో 7 రౌండ్లు బీజేపీ... 4 రౌండ్లు కాంగ్రెస్‌కు ఆధిక్యం మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కౌంటింగ్ జరిగిన 11 రౌండ్లలో మొదటి నుంచీ బీజేపీ ఆధిక్యం కనబర్చగా, మధ్యలో 6,7,8,9 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఆధి క్యం వచ్చింది. చివరి రెండు రౌండ్లలో తిరిగి బీజేపీ మెజారిటీ సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్ధికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. గెలుపు కోటాను చేరుకోవడానికి అంజిరెడ్డికి 35,997 ఓట్లు, నరేందర్‌రెడ్డికి 41,107 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 51,253 ఓట్లు అవసరం అయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజీపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 5,110 ఓట్ల అధిక్యం సాధించారు. గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లకు ఎవరూ చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను వరుస క్రమంలో ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో 53 మంది ఎలిమినేట్ అయ్యారు. అయినా ఎవరూ కోటా ఓట్లు సాధించలేదు. దీంతో చివరకు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేసి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి..........ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి .............ఓట్టు వచ్చాయి. అధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డి అయితే ఇద్దరూ కోటా ఓట్లను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో అధిక ఓట్లతో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ప్రకటించాలనుకున్నారు. కానీ, దానిపై కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇద్దరిలో ఎవరికీ గెలుపు కోటా ఓట్లు రానందున ఫలితాన్ని ప్రకటించొద్దని అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరారు. దీంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. చివరకు మిగిలిన ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటించాలన్న ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని బుధవారం అర్ధరాత్రి విజేతగా ప్రకటించారు. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్‌రెడ్డి బయటకు వచ్చారు. ఆయన్ను మీడియా చుట్టుముట్టగానే భావోద్వేగానికి గురై.. కన్నీటి పర్యంతమయ్యారు. ఏమీ మాట్లాడలేక పోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెడతామని ఆయన అనుచరులు మీడియాకు చెప్పగా, నరేందర్‌రెడ్డి కారు ఎక్కి అంబేడ్కర్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు. చెల్లని ఓట్లు.. సహకరించని పార్టీ ! నరేందర్‌రెడ్డి ఓటమిలో చెల్లని ఓట్లు కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న పొరబాట్లతో దాదాపు 28వేలకుపైగా గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 28 వేల చెల్లని ఓట్లలో 15 వేలకుపైగా నరేందర్‌రెడ్డికి వచ్చినవే కావడం గమనార్హం. అందుకే ఓడిన బాధ కంటే కూడా తన ఓట్లు చెల్లకుండా పోయి ఓటమికి దారి తీయడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లా నాయకులు తరహాలో మిగిలిన మూడు జిల్లాల ముఖ్యనేతలు తమకు సహకరించకపోవడం కూడా తమ ఓటమికి మరో కారణమని నరేందర్‌రెడ్డి వర్గం వాపోయింది. కరీంనగర్ ఎన్నికల సభలోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ సీటు ఓడిపోతే తన ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీలేదని వ్యాఖ్యానించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని ఆయన అనుచరులు గుర్తు చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.ప్రొఫైల్ పేరు: చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టినతేదీ: 18–06–1966 రామచంద్రాపురం, సంగారెడ్డి విద్యార్హత: ఎమ్మెస్సీ మ్యాథ్స్ (ఉస్మానియా) సతీమణి: గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, సంగారెడ్డి రాజకీయం: 2009 ప్రజారాజ్యం పార్టీతో ఆరంగ్రేట్రం 2014లో సంగారెడ్డి సెగ్మెంట్లో ఇండిపెండెంట్‌గా పరాజయం -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కిషన్ రెడ్డి నాయకత్వంలో ఇది నాల్గో విజయం.. సమన్వయంతో పని చేయడం వల్లే ఈ గెలుపు సాధ్యమైందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ నీతివంతమైన పాలనను ఓటర్లు గుర్తించారన్నారు.ఈవీఎంలను తప్పుబడుతున్న రాహూల్ గాంధీ ఈ బ్యాలెట్ విజయంపై ఇప్పుడు మాట్లాడాలి. ఓటుకు 5 వేలు పంచారు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని ఓడగొట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైంది. బీఎస్పీ అభ్యర్థికి బీఆర్ఎస్ సపోర్ట్ చేయడంతోనే ఆయన మూడో స్థానానికి పడిపోయాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కలిసి పన్నిన కుట్రలను ప్రజలు గమనించారు. సొమ్మొక్కడిది సోకొక్కడిదన్నట్టు కేంద్రం నిధులిస్తే ఇక్కడి ప్రభుత్వం తానే గొప్పలు పోతోంది. కాంగ్రెస్ దిగిరావాలి.. మీకు ఐదు ఉమ్మడి జిల్లాల్లో తీర్పునిచ్చారు. మీ ఆరు గ్యారంటీలపై సమాధానం ఏంటో కాంగ్రెస్ ఇప్పటికైనా చెప్పాలి‘‘శాసనమండలిలో గడగడలాడించేందుకు మా ముగ్గురు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీసీలు వ్యతిరేకత చూపారు. ముస్లింలను కలపడాన్ని బీసీలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో 5,500 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమై వెళ్లిపోయారు. నరేందర్ రెడ్డి రెండో స్థానం, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి.కాగా, కరీంనగర్-మెదక్-నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. -
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్
సాక్షి, సిద్ధిపేట: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని హరీష్ గుర్తు చేశారు.‘‘నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకి సాగునీరు, తాగునీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఆర్ఎంబీ నీటి వాటాలో.. సమ న్యాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదు. చంద్రబాబుది పక్షపాత ధోరణే తప్ప సమన్యాయం కాదు...చంద్రబాబు సీఎం కాగానే ప్రాజెక్ట్‌ల డీపీఆర్‌లు రిటర్న్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ ప్రశ్నించే తెగువ, తెలివి లేదు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆపే ప్రయత్నం చేయలేదా... గతంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా’’ అంటూ హరీష్‌రావు నిలదీశారు. -
టీ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. మీనాక్షి సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవులపై కసరత్తు ప్రారంభించిన మీనాక్షి.. పార్టీలో నేతలను మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూపు, ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూపు, అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారని మూడో గ్రూప్‌గా విభజించారు.పార్టీ పదవులు.. నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పదేళ్లు పార్టీలో ఉన్నవారి లిస్ట్ కోరిన ఇన్చార్జ్ మీనాక్షి. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది.కాగా, రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ పనితీరుపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిన్న(మంగళవారం) మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశమయ్యారు. ఇవాళ ఆదిలాబాద్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ మీనాక్షి నటరాజన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. -
సర్కారు పన్నాగం.. నాడు సుద్దులు.. నేడు టెండర్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: భూములు అమ్మితే కాని ప్రభుత్వాన్ని నడపలేని స్థితి తెలంగాణ సర్కార్‌ది అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు అప్పులు.. రాష్ట్ర భూముల తాకట్టు’ అని మండిపడ్డారు. రూ. 30వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్కారు పన్నాగం. నాడు భూములు అమ్మొద్దని సుద్దులు, నేడు అమ్మకానికి టెండర్లు. నిధుల సమీకరణ పేరుతో అడ్డికి పావుశేరుకు భూముల అమ్మకం’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరో వైపు, అప్పు చేసి, పప్పు కూడు నాటి సామెత అప్పు చేసి, చిప్ప కూడు నేటి కాంగ్రెస్ ఏడాది పాలన ఘనత’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘నాడు అప్పు చేసి70 లక్షల అన్నదాతలకు అండగా నిలిచి వారికి రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు ఖాతాల్లోకి వేసి రూ.28 వేల కోట్లు రుణమాఫీ చేసి రూ.6 వేల కోట్లతో రైతుబీమా చేసి లక్ష 11 వేల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందేలా చేసి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, పారిశ్రామిక, గృహావసరాలకు 24 కరెంటు అందించాం...కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సీతారామసాగర్ కట్టి 45 వేల చెరువులు కుంటలు బాగుచేసి 45 లక్షల మందికి పైగా ఆసరా ఫించన్లతో అండగా నిలిచి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్, కళ్యాణలక్ష్మి వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, 30 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటుచేస్తే అప్పులు తప్పని రాద్దాంతం చేశారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. 15 నెలల పాలనలో రూ.1.65 లక్షల కోట్లు అప్పు చేసి రుణమాఫీ ఎగ్గొట్టి రైతుబంధు ఎగ్గొట్టి రైతుబీమా లేకుండా చేసి కరెంటుకు కోతలు వేసి గురుకులాలను గాలికి వదిలేసి కాళేశ్వరాన్ని ఎండబెట్టి పాలమూరు రంగారెడ్డిని పడావుపెట్డి శ్రీశైలం సొరంగం కుప్పకూల్చి 8 మంది ప్రాణాలు బలితీసుకున్న బాధ్యతలేని ప్రభుత్వం ఇది’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.తట్టెడు మట్టి తీసింది లేదు.. ఒక్క పథకం అమలు చేసింది లేదు. గల్లీలో గాలిమాటలు.. ఢిల్లీకి ధనం మూటలు మోసుడు తప్ప 15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి ? నాడు అప్పులు తప్పని అడ్డగోలు అభాండాలు.. నేడు అందినకాడికి అప్పులు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
ఎవరు నటిస్తున్నారో తెలుసు.. మీనాక్షి మరో వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎవరి పనితీరు ఎంటో నాకు తెలుసు. ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసు. పార్టీ కోసం సమయం కేటాయించాలి. అంతర్గత విషయాలు బయట చర్చించొద్దు’’ అంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మరోసారి హెచ్చరించారు. పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్‌లో ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్, మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు.లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో భాగంగా మంగళవారం గాందీభవన్‌లో మెదక్, మల్కాజ్గిరి స్థానాల పరిధిలోని పార్టీ నేతలతో ఆమె విడివిడిగా సమావేశయిన సంగతి తెలిసిందే. పార్టీ లైన్ ప్రకారమే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుందని, గీత దాటితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు బహిరంగ వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పార్టీలో అందరికీ అవకాశాలు కల్పిస్తామని, పదేళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసిన వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ఫ్లెక్సీల్లో ఫొటోలు కనిపిస్తే సరిపోదని, ప్రజల మధ్యలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో సామాజిక న్యాయం అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. -
తీన్మార్ మల్లన్నవి గాలి మాటలు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కులగణ అంశంలో తన పాత్ర లేదని.. గాలి మాటలు మాట్లాడితే కుదరదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ‘‘తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం నాది. నన్ను ఎవరు తిట్టిన నేను పట్టించుకోను. తీన్మార్ మల్లన్న ప్రెస్‌మీట్ పెట్టికుంటే.. ఏంది..ఇంకేమైనా పెట్టుకుంటే నాకేంటి ఏమైనా పెట్టుకొని.. ప్రత్యేక్ష రాజకీయాలకు నేను దూరం.. సలహాలు అడిగితే ఇస్తాను’’ అని జానారెడ్డి పేర్కొన్నారు.‘‘పరిపాలన చేసే వారు సైతం అడిగితేనే సలహాలు సూచనలు ఇస్తాను. నా పార్టీ నాయకులు నన్ను విమర్మిస్తే... ఖండిస్తలేరు... అలాగని సమర్థించడం లేదు.. ఎందుకో వారినే అడిగి తెలుసుకోండి. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు’’ అని జానారెడ్డి వ్యాఖ్యానించారు.నాకు సంబంధం లేదు: వీహెచ్వీహెచ్ హనుమంతరావు రావు మాట్లాడుతూ.. కామెంట్స్ తీన్మార్ మల్లన్న అంశం తనకు సంబంధం లేదని.. పార్టీ చూసుకుంటుందన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్‌కు చెప్పా.. ఆమె నన్ను ఏమి అడగలేదు.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని మీనాక్షి నటరాజన్‌కు సూచించాను’’ అని వీహెచ్ చెప్పారు.ఇదీ చదవండి: బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు.. మల్లన్న సంచలన వ్యాఖ్యలు -
బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారు.. మల్లన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కుల గణన జరగాలని రేవంత్ రెడ్డికి సూచించాను. అందుకే రేవంత్ నన్ను సస్పెండ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు అని చెప్పుకొచ్చారు.ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ కావాలనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కరీంనగర్ వెళ్లే సమయంలో కూడా నన్ను సస్పెండ్ చేయాలని పీసీసీకి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నేతలకు గట్టి మద్దతు లభించింది.. భవిష్యత్‌లో మరింత బలం గా పోరాడుతాం. నన్ను సస్పెండ్ చేయడం ద్వారా బీసీలు ప్రశ్నించరనే భ్రమ నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలి.కులగణన తప్పు అని పత్రాలను తగలబెడితే సస్పెండ్ చేస్తారా?. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కుల గణన జరగాలని రేవంత్ రెడ్డికి సూచించాను. సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ పకడ్బందీగా నిర్వహించారు. చివరి రోజు రేవంత్ రెడ్డి కులగణన చేయించుకున్నారు. అగ్ర వర్గాలను ఎక్కువ చూపించారు.. బీసీలను తక్కువ చూపించారు. నేను చెప్పింది తప్పు అయితే.. మళ్ళీ ఎందుకు సర్వే చేశారు. EWS రిజర్వేషన్ల రక్షణ కోసమే బీసీ జనాభా తగ్గించారు. 90 ఏళ్ళ తర్వాత సర్వే చేసినా.. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదు. కులగణన తప్పు అని నేను నిరుపిస్తా. తప్పు జరిగితే సరిదిద్దుకోండి.కులగణన చేస్తారనే హామీ ఇచ్చారనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్ రెడ్డిపై నమ్మకంతో కాదు.. రాహుల్ గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్‌లో చేరాను. సీఎం పేరును మంత్రులు కూడా ఉచ్చరించడం లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక న్యాయం.. రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయమా?. అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకేనా?.. బలహీన వర్గాలకు లేదా?. కేసీఆర్‌పై పోరాటం చేసింది నేనే. నేను పోరాటం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలంతా ఎక్కడ ఉన్నారు?. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నా పాత్ర ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసి ఉంటే ఇంకో 8 సీట్లు వచ్చేవి.బీజేపీకి పరోక్షంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. సంవత్సరంలోనే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు?. ఆత్మపరిశీలన చేసుకోవాలి. వంశీ చందర్‌రెడ్డిని ఓడగొట్టింది మీరే. పార్టీ నేతలు తన మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అలిగి పోతున్నారట. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌ను ఓడిస్తున్నాడు. 2028లో తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి అవుతాడు. పిల్లి గాండ్రింపులకు భయపడేది లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అన్ని బీసీ సంఘాలకు ఒకే ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేస్తాం. అందరినీ ఏకం చేస్తాం. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలను నిలబెడుతాం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఆలోచన లేదు. మండలిలో మాట్లాడేది చాలా ఉంది. ప్రధాని మోదీ నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అదే విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించాలి అని తెలిపారు. -
ప్రక్షాళన మొదలు.. ఆ నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆమె నేటి నుంచి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు.పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని చెప్పిన మీనాక్షి.. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్ వల్లే సమస్యలు వస్తే.. పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె ఖరాఖండిగా చెప్పేశారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారన్న కాట శ్రీనివాస్ గౌడ్.. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా.. ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ ఇంఛార్జ్‌ని కాట కోరారు.అధికారులు తమ మాట వినడం లేదన్న మరి కొందరు నేతలు.. ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్‌కు పలువురు నేతలు చెప్పారు. -
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పదకొండు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించామని.. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.‘‘డీపీఆర్ సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్తుంది. బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?. బీసీల్లో పది శాతం ముస్లింలను కలపకపోతే ఆమోదిస్తాం. కుల గణన తప్పుల తడకగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. జన గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తారు. దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 అసెంబ్లీ సీట్లు తెలంగాణాలో పెంచుకోవచ్చని పొందుపరిచారు’’ అని లక్ష్మణ్ చెప్పారు. -
‘ఆదిలాబాద్ ఆయువుపట్టును అమ్మేసే కుట్ర’
హైదరాబాద్: ఆదిలాబాద్ కు ఆయువుపట్టు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అని, దానిని తుక్కుగా అమ్మే కుట్ర బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు ఫ్యాక్టరీగా చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తలుచుకుంటే ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ తెరుచుకోదా? అని ప్రశ్నించారు కేటీఆర్. సిర్పూర్ పేపర్ మిల్లును కేసీఆర్ తెరిపించి నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపులేదన్నారు కేటీఆర్ సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమేనన్నారు. బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రులు అమిత్ షాతో సహా ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో లబ్ధికోసం సీసీఐ తెరుస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అప్పనంగా అమ్మడానికి సిద్ధమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అప్పటివరకూ కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకూ అయినా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
తెలంగాణ: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటివరకు 2లక్షల 10వేల ఓట్లను విభజించారు. వీటిలో సుమారు 21వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు.కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40వేల ఓట్లు విభజన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ గెలుపు.. రాబోయేది బీజేపీ కాలమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకానికి ఇది నిదర్శనం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఉపాధ్యాయులందరికీ వందనం. ఈ విజయాన్ని ప్రధాని మోదీ, ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాం. బీజేపీని విమర్శించిన వారికి ఇదొక గుణపాఠం.కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి.. బీజేపీని ఓడించాలని చూశారు. ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక వర్గానికి కొమ్ము కాసింది. నితీకి నిజాయితీకి నిదర్శనం ఈ విజయం. రాబోయేది బీజేపీ కాలమే. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీకి ఇది మూడో విజయం. కిషన్‌రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాం. తెలంగాణలో టీచర్లు అందరూ తపస్‌లో చేరాలి అని సూచించారు. -
బీజేపీ, పీఆర్టీయూకు చెరొకటి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలుకాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక, కట్టలు కట్టి, మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానంలో....వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ప్రకటించారు. మొదటి నుంచీ ఆధిక్యంలోనే... పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలోనే కొనసాగారు. నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్‌లో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి కౌంటింగ్ హాలులో 25 టేబుళ్లపై మొదట కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టి 11 గంటల వరకు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆయనకు 6,035 ఓట్లు లభించగా, ద్వితీయస్థానంలో 4,820 ఓట్లతో అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలవగా, మూడో స్థానంలో 4,437 ఓట్లు పొంది గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నిలిచారు. ఆ తర్వాత పూల రవీందర్ 3,115 ఓట్లతో నాలుగో స్థానంలో, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి 2,289 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్రాజ్ యాదవ్ 2,040 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 500 లోపు ఓట్లు వచ్చినవారే ఉన్నారు. రౌండ్ రౌండ్‌కూ పెరిగిన ఆధిక్యం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 499 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే చెల్లిన ఓట్లలో సగానికి ఒకటి ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లు గెలుపు కోటాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అలా 14 మందిని ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించడంతో శ్రీపాల్‌రెడ్డికి 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు, సరోత్తంరెడ్డికి 2,394 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువగా ఓట్లున్న సుందర్రాజును ఎలిమినేట్ చేసి 15వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 6,916కు పెరిగాయి. ఆ తర్వాత బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డిని ఎలిమినేట్ చేసి 16వ రౌండ్లో ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 7,673కు చేరుకున్నాయి. ఆ తర్వాత పూల రవీందర్‌ను ఎలిమినేట్ చేసి 17వ రౌండ్ ఓట్లు లెక్కించగా, శ్రీపాల్‌రెడ్డి 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డికి 11,099 ఓట్లు లభించగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు లభించాయి. నర్సిరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి.. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. కరీంనగర్లో కమల వికాసం కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా.. అధికారులు జాప్యం చేయడం వల్ల ఓట్ల వడబోత తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 7 గంటలు దాటాక టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 9.30 గంటలకు ఫలితం తేలింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. అధికారుల లెక్కల్లో గందరగోళం.. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో మూడు రకాల గణాంకాలతో అధికారులు గందరగోళానికి తెరతీశారు. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కౌంటింగ్‌లో ఓట్ల వడబోత ఇంకా కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గపరిధిలో 3.55 లక్షలకు 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అందులో ముందుగా లక్ష ఓట్లను వడబోశారు. అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా, 8,000 చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లు వడబోయాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు సాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని పేరు తెలిపేందుకు ఇష్టపడట్లో అధికారి సాక్షికి తెలిపారు. భారీగా ఇన్వాలీడ్ ఓట్లు.. ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు గ్రాడ్యుయేట్‌కు సంబంధించి భారీగా ఇన్వాలీడ్ ఓట్లు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 50 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రచారం జరిగినా.. సాయంత్రానికి అధికారులు దానిని ఖండించారు. ఓటర్లు చిన్న చిన్న తప్పులతో తమ విలువైన ఓటును చెల్లకుండా చేసుకున్నారు. ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంకెలకు ముందు సున్నా రాయడం, ఆ అంకెకు సున్నా చుట్టడం, అంకె వేసినాక సంతకం చేయడం, దానికి ఎదురుగా టిక్ గుర్తు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తదితర తప్పిదాల వల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోయాయని కాంగ్రెస్ అభ్యర్థి నరేంందర్ రెడ్డి, ఏఐఎఫ్బీ అభ్యర్ధి, మాజీ మేయర్ రవీందర్ సింగ్‌లు వాపోయారు. అదే సమయంలో తమకు ఓటేసిన వారిలో అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్వాలీడ్ కాకుండా గుర్తించాలని ఆర్వోకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అదే విధంగా రవీందర్‌సింగ్ ఓట్లు లెక్కించే సమయంలో జంబ్లింగ్ విధానం పాటించలేదని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అంతేకాకుండా పలు బూత్‌ల ఓట్ల విషయంలో గోప్యత పాటించకుండా బయటకు వెల్లడించేలా సిబ్బంది వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఆర్వో మీద ఈసీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తానని రవీందర్‌సింగ్ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటేసే విధానంపై అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’
నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.ఇది ఉపాధ్యాయుల విజయంఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి. -
‘నాలుగు నెలలు నిద్రపోయి.. ఇప్పుడు పిట్ట కథలా?’
హైదరాబాద్: త్వరలో తెలంగాణ సీఎం మారడం ఖాయమంటూ మాట్లాడిన బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. నాలుగైదు నెలలపాటు నిద్రపోయి.. ఇప్పుడు మళ్లీ మీడియా ముందు పిట్టకథలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు ఆది శ్రీనివాస్. ‘సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుని చిట్ చాట్ ల పేరుతో చెత్త వాగుడు వాగుతున్నాడు. డిసెంబర్ లో ముఖ్యమంత్రి మారుతాడని, మీనాక్షి నటరాజన్ అందుకోసమే వచ్చారని కట్టు కథలు చెపుతున్నాడు. మహేశ్వర్ రెడ్డి పరిస్థితి గురివింద గింజలా ఉంది. తన కింద ఉన్న నలుపు ను ఆయన చూడలేకపోతున్నాడు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఉన్న అసంతృప్తులు ఆయనకు కనిపించడం లేదు. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ అసలు మీ పార్టీ ఆఫీసు వైపు కూడా రావడం లేదు. నా పైన కుట్ర చేస్తున్నారని, పార్టీ నుంచి వెళ్లిపోమ్మంటే పోతానని ఆయన బహిరంగంగానే చెపుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి మోహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక మీ ఎంపీలు ఎవరి దుకాణం వాళ్లే పెట్టుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం కొట్టుకు చస్తున్నారు.. ఈటెల రాజేందర్ ది ఒక దారి, రఘనందన్ రావు ది మరో దారి, ఇక ధర్మపురి అర్వింద్ ఎటో తెలియనే తెలియదు...బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో తెలియదు. నీ పార్టీలో ఇన్ని లొసుగులు పెట్టుకుని నువ్వు మా ముఖ్యమంత్రి గురించి, మంత్రుల గురించి మాట్లాడుతవా..? , మహేశ్వర్ రెడ్డి... నువ్వు చిలుక జోస్యం ఆపకపోతే నీ భవిష్యత్తు గురించి మేం చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ అప్పనంగా రాష్ట్రాన్ని దోచుకున్నా బీజేపీ పట్టించుకోలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాకుండా విమర్శలు చేస్తారా. ప్రభుత్వం పైన ఓర్వ లేక ఈర్ష తో ప్రభుత్వంపైన మాట్లాడుతున్నారు. గోతికాడ నక్కలా బీఆర్ఎస్ తరహాలో బీజేపీ వ్యవహరిస్తోంది. ’ అంటూ విమర్శించారు ఆది శ్రీనివాస్. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు.. ఆశ్చర్యంలో మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి,హైదరాబాద్ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో గందరగోళం నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చదువుకున్నవాళ్లకు ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెల్లని ఓట్లపై ఏర్పడ్డ గందరగోళంపై అభ్యర్థుల ఆందోళన బాటపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’
హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారన్నారు. ఆమెకు రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ఒక్కటే.. సీఎం ఛేంజ్ ఆపరేషన్ అంటూ చమత్కరించారు.‘తెలంగాణ ఆడపిల్లల ఆశీర్వాదం కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉంటేనే రేవంత్ సీఎంగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ సొంత టీం నుంచి మీనాక్షి నటరాజన్ ను ‘మిషన్ సీఎం ఛేంజ్ ఆపరేషన్’ కోసం పంపించారు. మంత్రులు.. సీఎంను లెక్క చేయడం లేదని స్వయంగా రేవంత్ పార్టీ ఇంచార్జ్ ముందుకు చెప్పుకున్నారు.* రాహుల్ గాంధీ ఇన్‌డైరెక్ట్ గా సీఎం ఛేంజ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ ను పనిచేయనివ్వడం లేదని భట్టి, ఉత్తమ్, పొంగులేటిని అనుమానిస్తున్నారు. మూటల పంచాయతీ నడుస్తోంది. ఎవరి శాఖ వాళ్లదే అన్నట్లుగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఎస్ఎల్బీసీకి వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ అక్కడకు వెళ్లివచ్చారు.ప్రతీ అంశం ఢిల్లీ కి చెరవేస్తున్నది.. రేవంత్ ను ఏ పని చేయకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చిన.. మాస్టర్ ప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డే. మిలటరీ మాస్టర్ ప్లాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డివే. గతంలో ఇంచార్జ్ గా కుంతియాను తెచ్చుకున్నది ఉత్తమ్ కుమారే. మూడు మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఆ ముగ్గురు సీఎం రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతో డీల్ చేసుకుంటున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. -
సీఎం రేవంత్‌కు హరీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నెల్ పనులు ముందుకు కదలేదని రేవంత్ చేసిన ఆరోపణలనూ హరీష్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. మా హయాంలో టన్నెల్ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం.. ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్ రావు అన్నారు. అలాగే.. తన దుబాయ్‌పై పర్యటనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్‌లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్‌కి వెళ్లే.. 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆపై టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన. -
రేవంత్.. మార్చి ఎనిమిది మీకు డెడ్‌లైన్: కవిత హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తుచేశారు.మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10వేల పోస్టుల కార్డులు సేకరించారు. అనంతరం, పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్‌కు పంపించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. హమీల అమలుపై మార్చి 8(మహిళా దినోత్సవం)న ప్రకటన చేయకపోతే 10వేల మంది మహిళలు పదివేల గ్రామాల్లోకి వెళ్తారు. లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం.మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. వరంగల్ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలి. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు.. ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదు.ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. 18ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.