పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | rtc bus accident in vijayanagaram district | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Sep 3 2016 4:36 PM | Updated on Sep 4 2017 12:09 PM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

కురుపాం: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటన విజయనగరం జిల్లా కురుపాం మండల సమీపంలో శనివారం చోటు చేసుకుంది. పార్వతీపురం నుంచి సాకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement