కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లె గ్రామంలో మంగళవారం వేకువజామున దొంగలు స్వైరవిహారం చేశారు.
నిద్రిస్తున‍్నదంపతులపై దొంగల దాడి
May 16 2017 10:54 AM | Updated on Jul 10 2019 8:00 PM
	హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లె గ్రామంలో మంగళవారం వేకువజామున దొంగలు స్వైరవిహారం చేశారు. నిద్రిస్తున‍్న దంపతులపై దాడిచేసి నగలు దోచుకెళ్ళారు. గ్రామానికి చెందిన చిద్రాల శ్రీనివాస్‌రెడ్డి, భాగ‍్యలక్ష్మి దంపతులు తమ ఇంటి దాబాపై నిద్రిస్తుండగా దొంగలు వారిపై దాడిచేసి భాగ‍్యలక్ష్మి మెడలోని నగలను దోచుకెళ్ళారు. సమాచారం అందుకున‍్న సీపీ కమలహాసన్‌రెడ్డి సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. దొంగల కోసం వేట మెదలుపెట్టారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
