దేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన షిర్డీ సాయిబాబా దేవాలయానికి నోట్ల రద్దు ప్రకటన అనంతరం భక్తుల నుంచి భారీ ఎత్తున కానుకలు రావడం విశేషం.
సాక్షి, ముంబై: దేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన షిర్డీ సాయిబాబా దేవాలయానికి నోట్ల రద్దు ప్రకటన అనంతరం భక్తుల నుంచి భారీ ఎత్తున కానుకలు రావడం విశేషం. గత 24 రోజులలో హూండీలో భక్తులు ఏకంగా రూ. 9.50 కోట్ల బాబాకు కానుకలుగా సమర్పించడం విశేషం.
వీటిలో పెద్ద ఎత్తున పాత నోట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రూ. 1.27 కోట్ల విలువ చేసే పాత రూ. 1000 నోట్లుండగా సుమారు రూ. కోటికిపైగా విలువ చేసే పాత రూ. 500 నోట్లు కానుకల ద్వారా అందినట్టు సాయిబాబా ట్రస్టు పేర్కొంది.