ఆర్య లేకపోతే మెగామాన్ లేదు | No salary for Arya in Meaghamann | Sakshi
Sakshi News home page

ఆర్య లేకపోతే మెగామాన్ లేదు

Dec 29 2014 1:53 AM | Updated on Sep 2 2017 6:53 PM

ఆర్య లేకపోతే మెగామాన్ లేదు

ఆర్య లేకపోతే మెగామాన్ లేదు

ఆర్య లేకపోతే మెగామాన్ చిత్రం ఉండేది కాదని ఆ చిత్ర దర్శకుడు మగిల్ తిరుమేణి పేర్కొన్నారు.

 ఆర్య లేకపోతే మెగామాన్ చిత్రం ఉండేది కాదని ఆ చిత్ర దర్శకుడు మగిల్ తిరుమేణి పేర్కొన్నారు. నేమిచంద్ జపక్, వి.హిం టేశ్ జపక్‌లు నిర్మించిన చిత్రం మెగామాన్. ఆర్య సరసన హన్సి క నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రజాదరణ లభిస్తోందని చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.
 
 శనివారం సాయంత్రంచెన్నైలో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు మగిళ్ తిరుమేణి మాట్లాడుతూ మెగామా న్ చిత్రానికి మంచి ప్రజాదరణ లభించడంతో పాటు పత్రికల ప్రశంసలు లభించ డం ఆనందంగా ఉందన్నారు. నాగరికత తో కూడిన కమర్షియల్ చిత్రం అంటూ పలువురు అభినందిస్తున్నారు. ఇది చిత్ర యూనిట్ సమష్టి కృషికి దక్కిన ఫలితం గా పేర్కొన్నారు. ముఖ్యంగా నటుడు ఆర్య లేకుంటే మెగామాన్ చిత్రం ఉండేది కాదన్నారు. అంతగా ఆయన సహకారం అందించారని తెలిపారు. తన కెరీర్‌లో మెగామాన్ మంచి కమర్షియల్ హిట్ అని ఆర్య పేర్కొన్నారు. చిత్ర విజయంపై  నమ్మకం ఉండేదని అది నిజమైనందుకు సంతోషంగా ఉందని ఆర్య అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement