అనుపమ రాజీనామాలో ట్విస్ట్ | Kudligi DSP Anupama Shenoy resigns 2nd time | Sakshi
Sakshi News home page

అనుపమ రాజీనామాలో ట్విస్ట్

Jun 15 2016 4:36 PM | Updated on Sep 4 2017 2:33 AM

అనుపమ రాజీనామాలో ట్విస్ట్

అనుపమ రాజీనామాలో ట్విస్ట్

కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షెనాయ్ రాజీనామా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

బళ్లారి: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్‌పీ అనుపమ షెనాయ్ రాజీనామా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అనుపమ రాజీనామా విషయలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధుల్లో జోక్యం చేసుకుని ఆటంకం కలిగించారని, తనన బెదిరించారని ఆరోపిస్తూ అనుపమ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినట్టు వార్తలు వచ్చాయి.

అనుపమ తన రాజీనామా లేఖలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పేరును ప్రస్తావించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రస్తావన లేకుండా మరో రాజీనామా లేఖ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అనుపమ మంత్రి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా రెండోసారి రాజీనామా లేఖను అందజేసింది. ఈ రాజీనామా లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement