ధనుష్‌తో ఎమిజాక్సన్ రొమాన్స్ | Dhanush to romance Amy Jackson | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో ఎమిజాక్సన్ రొమాన్స్

Dec 4 2014 3:13 AM | Updated on Sep 2 2017 5:34 PM

ధనుష్‌తో ఎమిజాక్సన్ రొమాన్స్

ధనుష్‌తో ఎమిజాక్సన్ రొమాన్స్

ఒక మార్గం మూసుకుంటే మరో మార్గం తెరుచుకుంటుందంటారు. అయితే నటి ఎమిజాక్సన్‌కు మాత్రం ఒక అవకాశం పోతే రెండు అవకాశాలు వరించాయి.

ఒక మార్గం మూసుకుంటే మరో మార్గం తెరుచుకుంటుందంటారు. అయితే నటి ఎమిజాక్సన్‌కు మాత్రం ఒక అవకాశం పోతే రెండు అవకాశాలు వరించాయి. విక్రమ్ సరసన నటించిన బ్రహ్మాండ భారీ చిత్రం ఐ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. తదుపరి సూర్య సరసన మాస్ చిత్రంలో నటించడానికి ఎంపికైన ఎమిజాక్సన్ అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. దీనికి మరో నటి నయనతార కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మాస్ చిత్రం వద్దనుకునే ఎమిజాక్సన్‌కు ఒకేసారి రెండు అవకాశాలు వరించాయి. ఒక చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్ చేయనున్నారు.
 
 ఈ చిత్రానికి ఇంతకుముందు వేలై ఇల్లాద పట్టాదారి వంటి హిట్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఛాయాగ్రాహకుడు వేల్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్నారు. చిత్రం 2015 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఎమిజాక్సన్ మరోయువ నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం నన్భేండా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారన్నారు. మాన్ కరాటే చిత్రం ఫేమ్ తిరుకుమరన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఎమిజాక్సన్ హీరోయిన్‌గా నటించనున్నారు. రొమాంటిక్ కామెడీ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి జీతు అనే టైటిల్‌ను నిర్ణయించారు. సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే చెన్నైలో ప్రారంభమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement