అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలలిత సీఎం కావాలని కోరుతూ కాట్పాడిలోని వినాయకుడి ఆలయంలో జయ పేరుపై ప్రత్యేక పూజలు చేశారు.
వేలూరు: అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలలిత సీఎం కావాలని కోరుతూ కాట్పాడిలోని వినాయకుడి ఆలయంలో జయ పేరుపై ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వేలూరు ఎంపీ సెంగొట్టవన్ అధ్యక్షతన కార్యకర్తలు అధిక సంఖ్యలో కాట్పాడిలో మేళ తాళాల నడుమ ఊరేగింపుగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. జయలలిత తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర ప్రజలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలని, కేసుల నుంచి బయట పడాలని కోరుతూ పూజలు చేశారు. అనంతరం ఆలయంలో జయ పేరుపై ప్రత్యేక యాగ పూజలు చేసి తమ నాయకురాలు క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పార్తిభన్, ఎమ్మెల్యే మహ్మద్‌జాన్, మాజీ కార్యదర్శులు సుమైతాంగి ఏయుమలై, శివకుమార్, మూర్తి, ఎంజీఆర్ మండ్రం జిల్లా కార్యదర్శి నారాయణన్, విరుదంబట్టు డివిజన్ కార్యదర్శి సుభాష్, కాట్పాడి డివిజన్ కార్యదర్శి కోరందాంగల్ కుమార్, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.