బాలుడిపై అంగన్‌వాడీ కార్యకర్త దాడి

కర్ణాటక, మైసూరు : బాలుడిపై అంగన్‌వాడీ కార్యకర్త దాడి చేసి గాయపరచిన ఘటన శుక్రవారం జిల్లాలోని హెచ్‌డీ కోట తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని హొసహోళలు గ్రామానికి చెందిన బాలుడిపై అంగన్‌వాడీ కార్యకర్త సువర్ణ స్టీల్‌గ్లాసుతో దాడి చేసారు. ఘటనలో బాలుడి నుదుటి భాగంపై గాయం కావడంతో తల్లితండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అల్లరి చేసాడనే కారణంగా బాలుడిపై దాడికి పాల్పడిందని బాలుడి తల్లితండ్రులు అంగన్‌వాడీ కార్యకర్తపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి