తాగిన మత్తులో పాము పట్టడానికి యత్నం

పాము కాటుతో ఆస్పత్రిపాలు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పీకలదాకా తాగి కొందరు తాగుబోతులు రోడ్లమీద,అక్కడక్కడా చేసే పనులు ఒక్కోసారి చూడ్డానికి భలేగా ఉంటాయి. వాళ్ల చేష్టలు, మాటలు నవ్వులు తెప్పిస్తాయి. నెలమంగలలో ఒక తాగుబోతు ఇలాంటి పనే ఒకటి చేసాడు. తాగినమత్తులో పాము పట్టుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి పాము కాటుకు గురైన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. నెలమంగల పట్టణ పరిధిలోని విశ్వేశ్వరపురలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇదే కాలనీకి చెందిన గోవిందరాజు (35) పెయింటర్. సోమవారం రాత్రి తాగిన మత్తులో ఉన్న గోవిందరాజుకు కాలనీలో పాము కనిపించింది. దానిని పట్టుకునేందకు యత్నించాడు. దీంతో పాము చేతి వేళ్లకు కాటువేసింది. అస్వస్థతకు గురైన గోవిందరాజును పట్టణంలోని హర్ష ఆస్పత్రికి తరలించారు. పాములు పట్టడం రాకపోయినా తాగిన మత్తులో గోవిందరాజు చేసిన పనికి స్థానికులకు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాలేదు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి