వెస్టిండీస్ 147/2 | west indies 147/2 | Sakshi
Sakshi News home page

వెస్టిండీస్ 147/2

Dec 29 2014 12:36 AM | Updated on Oct 5 2018 9:09 PM

ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (125 బంతుల్లో 65 బ్యాటింగ్; 8 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (92 బంతుల్లో 60 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలతో రాణించడంతో వెస్టిండీస్ జట్టు మెరుగ్గా ఆడుతోంది.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 417/8 డిక్లేర్డ్
 పోర్ట్ ఎలిజబెత్: ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (125 బంతుల్లో 65 బ్యాటింగ్; 8 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (92 బంతుల్లో 60 బ్యాటింగ్; 9 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలతో రాణించడంతో వెస్టిండీస్ జట్టు మెరుగ్గా ఆడుతోంది. ఫలితంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆదివారం పర్యాటక జట్టు 44 ఓవర్లలో రెండు వికెట్లకు 147 పరుగులు సాధించింది.

వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు ఇప్పటికే అజేయంగా 92 పరుగుల పరుగుల భాగస్వామ్యం నెలకొంది. వర్షం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం కాగా... చివర్లో వెలుతురు లేని కారణంగా మరో 16 ఓవర్లు ఉండగానే ముగిసింది. అంతకుముందు 289/3 ఓవర్‌నైట్ స్కోరుతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రార ంభించిన దక్షిణాఫ్రికా 122 ఓవర్లలో 417/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. చివరి బ్యాట్స్‌మన్ స్టెయిన్ (28 బంతుల్లో 58; 6 ఫోర్లు; 5 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు సహాయపడ్డాడు.  దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్ రెండో వేగవంతమైన అర్ధసెంచరీ సాధించడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement