సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కు వార్నర్‌ స్పెషల్ మెసేజ్‌

Warner shares special message for Sunrisers fans - Sakshi

న్యూఢిల్లీ:  ఏడాది క్రితం బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని గత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌కు దూరమైన ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. మరి కొద్ది రోజుల్లో ఆరంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. రాబోవు ఐపీఎల్‌ సీజన్‌లో పాల్గొనడాన్ని ధృవీకరిస్తూనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు స్పెషల్‌ మెసేజ్‌ షేర్‌ చేశాడు. ‘ నేను వార్నర్‌.  ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులందరికీ ఇదే నా స్పెషల్‌ మెసేజ్‌. గత కొన్నేళ్లుగా మీరు మాపై చూపెడుతున్న ప్రేమకు ధన్యవాదాలు. మళ్లీ మన సమయం వచ్చేసింది’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ట్వీటర్‌ పేజీలో వీడియో షేర్‌ చేశాడు. 2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ టైటిల్‌ సాధించడంలో వార్నర్‌ ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే.

ఆ సీజన్‌లో 17 మ్యాచ్‌లకు గాను వార్నర్‌ 848 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంచితే, సొంత గ్రౌండ్‌లో సన్‌రైజర్స్‌ ఆడబోయే తొలి మ్యాచ్‌కు గాను 25వేల సీట్ల ధరను రూ. 500కే అమ్మాలని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఈ విషయాన్ని కూడా తమ అధికారిక ట్వీటర్‌ పేజీ ద్వారా సన్‌రైజర్స్‌ వెల్లడించింది. మార్చి 29వ తేదీన రాజస‍్తాన్‌ రాయల్స్‌తో ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తన హోమ్‌ మ్యాచ్‌లో ఆడనుంది.

విలియమ్సన్‌ రాక ఆలస్యం..

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో గాయపడిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐపీఎల్‌ ఆడేందుకు కాస్త ఆలస్యంగా భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.. ఫీల్డింగ్‌ చేస్తూ విలియమ‍్సన్‌ భుజానికి తీవ్ర గాయం కావడంతో అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాంతో విలియమ్సన్‌ ఆలస్యంగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో కలవచ్చు. మరో 11 రోజుల్లో ఐపీఎల్‌ ఆరంభమయ్యే నాటికి విలియమ్సన్‌ పూర్తిగా కోలుకోకపోవచ్చు. వంద శాతం ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాతే విలియమ్సన్‌ తిరిగి క్రికెట్‌ ఆడతాడని ఆ జట్టు కోచ్‌ స్సష్టం చేశాడు. దాంతో అతను కోలుకోవడానికి కనీసం మూడు వారాలు పట్టే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top