అజేయ ఆనంద్ | Viswanathan Anand wins Candidates chess tournament, gets title shot vs Magnus Carlsen | Sakshi
Sakshi News home page

అజేయ ఆనంద్

Mar 31 2014 2:49 AM | Updated on Sep 2 2017 5:22 AM

అజేయ ఆనంద్

అజేయ ఆనంద్

క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ 14 రౌండ్‌ల టోర్నీలో ఆనంద్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అజేయంగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ 14 రౌండ్‌ల టోర్నీలో ఆనంద్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పీటర్ స్విద్లెర్ (రష్యా)తో జరిగిన చివరిదైన 14వ రౌండ్ గేమ్‌ను ఆనంద్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

చాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌కు 95 వేల యూరోలు (రూ. 78 లక్షల 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ 11 గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... మిగతా మూడు గేముల్లో గెలిచాడు. ఈ టైటిల్‌తో ఆనంద్ ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడేందుకు అర్హత సాధించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement