హ్యాట్సాఫ్ ‘అమ్మ’! | US runner competes while 34 weeks pregnant | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్ ‘అమ్మ’!

Jun 28 2014 1:04 AM | Updated on Sep 2 2017 9:27 AM

హ్యాట్సాఫ్ ‘అమ్మ’!

హ్యాట్సాఫ్ ‘అమ్మ’!

చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు అలీసా మొంటానో. వయసు 28 ఏళ్లు. అమెరికాకు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్. యూఎస్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 800 మీ. విభాగంలో గత నాలుగేళ్లుగా ఆమె వరుసగా విజేతగా నిలుస్తోంది.

 చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు అలీసా మొంటానో. వయసు 28 ఏళ్లు. అమెరికాకు చెందిన మిడిల్ డిస్టెన్స్ రన్నర్. యూఎస్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 800 మీ. విభాగంలో గత నాలుగేళ్లుగా ఆమె వరుసగా విజేతగా నిలుస్తోంది. ఈ సారి పోటీల సమయంలో ఆమె 34 వారాల నిండు గర్భవతి. కానీ ఈవెంట్‌లో పాల్గొనాలన్న ఆమె పట్టుదలకు ప్రెగ్నెన్సీ అడ్డు రాలేదు. భేషుగ్గా పాల్గొనవచ్చని డాక్టర్లు కూడా భరోసా ఇచ్చారు. దాంతో గురువారం శాక్రమెంటో (కాలిఫ్)లో నిర్వహించిన జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. గెలుపు సంగతి పక్కన పెడితే...


 మధ్యలో ఆమె ఆగిపోలేదు. 2 నిమిషాల 32.13 సెకన్లలో పరుగు పూర్తి చేయగలిగింది. ఫినిష్ లైన్ పూర్తి చేయగానే స్టేడియంలోని ప్రేక్షకులంతా ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement