
మే 4 నుంచి ‘తెలంగాణ కేసరి’ రెజ్లింగ్ టోర్నమెంట్
తెలంగాణ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ సంఘం (టీఐఎస్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో మే 4 నుంచి 7 వరకు తెలంగాణ కేసరి, సీనియర్ అంతర్ జిల్లా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరుగనుంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ సంఘం (టీఐఎస్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో మే 4 నుంచి 7 వరకు తెలంగాణ కేసరి, సీనియర్ అంతర్ జిల్లా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఐఎస్‌డబ్ల్యూఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు.
ఈ సమావేశంలో టీఐఎస్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు బి. విజయ్ కుమార్ యాదవ్, కార్యదర్శి అభిమన్యు యాదవ్‌లు నగరంలోని వివిధ అఖాడాలకు చెందిన ఉస్తాద్ ఖలీఫాలతో పోటీల విషయమై చర్చలు జరిపారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ పోటీల్లో తెలంగాణ కేసరి టైటిల్ విభాగంలో తొలి మూడు స్థానాల్లో నిలిచే వారికి ‘బుల్లెట్ బైక్’తోపాటు వెండి గద, నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.